Aadhaar Card Update: ఆధార్‌ కార్డు ఉన్నవాళ్లకు అలర్ట్‌.. కీలక అప్‌డేట్‌.. ఇది తప్పక తెలుసుకోవాల్సిందే

|

Oct 22, 2022 | 10:39 AM

ముఖ్యమైన పత్రాలలో ఆధార్‌ ఒకటి. ఇది లేనిది ఏ పని జరగదు. ప్రభుత్వ, ప్రైవేటు పనులతో పాటు ఇతర చిన్నపాటి పని కావాలంటే ఆధార్‌ తప్పనిసరి అవుతోంది..

Aadhaar Card Update: ఆధార్‌ కార్డు ఉన్నవాళ్లకు అలర్ట్‌.. కీలక అప్‌డేట్‌.. ఇది తప్పక తెలుసుకోవాల్సిందే
Aadhaar Card Update
Follow us on

ముఖ్యమైన పత్రాలలో ఆధార్‌ ఒకటి. ఇది లేనిది ఏ పని జరగదు. ప్రభుత్వ, ప్రైవేటు పనులతో పాటు ఇతర చిన్నపాటి పని కావాలంటే ఆధార్‌ తప్పనిసరి అవుతోంది. ఇక ఆధార్‌కార్డు విషయంలో ఇప్పటి వరకు ఎన్నో అప్‌డేట్స్‌ వచ్చాయి. రకరకాల సదుపాయాలు కూడా వచ్చాయి. ఇక తాజాగా మరో కీలక అప్‌డేట్‌ వచ్చింది. ఆధార్ జారీ చేసే సంస్థ యూఐడీఏఐ బయోమెట్రిక్ అప్‌డేట్‌కు సంబంధించి కీలక సమాచారాన్ని వెల్లడించింది. యూఐడీఏఐ నుండి అందిన సమాచారం ప్రకారం.. అన్ని రాష్ట్రాలు దాని అధికారిక పరిధిని పెంచాలని కోరింది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ప్రతి ఒక్కరూ తమ ఆధార్, బయోమెట్రిక్‌లను అప్‌డేట్ చేసేలా ప్రోత్సహించాలని యూఐడీఏఐ తెలిపింది. తద్వారా ప్రతి ఒక్కరూ తమ ఆధార్‌ను అప్‌డేట్‌గా ఉంచుకుంటారు. అయితే, ఇలా చేయడం ఎవరి బలవంతం కాదని తెలిపింది.

ఇలా చేయడం ద్వారా ఫేక్ బేసిస్ కూడా అరికట్టబడుతుందని, అలాగే ప్రతి ఒక్కరి డేటా కూడా పూర్తిగా భద్రంగా ఉంటుంద యూఐడీఏఐ డేటా సెక్యురిటీ తెలిపింది. జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఏ వ్యక్తి అయినా ఎంపిక చేసుకున్న ప్రతి పదేళ్లకు బయోమెట్రిక్స్, డెమోగ్రాఫిక్ వివరాలను అప్‌డేట్ చేయవచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఎలాంటి నిబంధనలు జారీ చేయలేదు. ఇది ప్రస్తుతం ఒక రకమైన సలహా మాత్రమే అని పేర్కొంది.

ప్రతి ఒక్కరికీ ఆధార్ అప్‌డేట్ అవసరం..

మీరు ఇప్పుడు కేంద్రాన్ని సందర్శించడం ద్వారా మీ ఆధార్ కార్డ్‌ని నవీకరించవచ్చు. మీ ఆధార్ కార్డును అప్‌డేట్‌గా ఉంచడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రోజుల్లో ఆధార్ కార్డ్ ప్రతిచోటా అవసరం. మీరు కేవైసీ పూర్తి చేయాలనుకుంటే ఏదైనా ప్రభుత్వ పని కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, ఆధార్ కార్డ్ గురించి సరైన సమాచారాన్ని కలిగి ఉండటం ముఖ్యం. కేవైసీ లేకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి