AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: ఆధార్ కార్డు వినియోగించేవారికి బిగ్ అలర్ట్.. యాప్ సేవలు బంద్.. ఇకపై అన్నీ ఇందులోనే..

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఆధార్ యాప్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ యాప్ స్థానంలో వచ్చిన కొత్త ఆధార్ యాప్‌ను అందరూ ఉపయోగించాలని సూచించింది. ఇక నుంచి అందరూ కొత్త యాప్‌ను మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది. కొత్త యాప్ రావడం తో పాత యాప్‌ను నిలిపివేసింది.

Aadhaar Card: ఆధార్ కార్డు వినియోగించేవారికి బిగ్ అలర్ట్.. యాప్ సేవలు బంద్.. ఇకపై అన్నీ ఇందులోనే..
Maadhaar
Venkatrao Lella
|

Updated on: May 19, 2026 | 7:30 PM

Share

ఆధార్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్. యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఆధార్ యాప్‌ను పూర్తిగా నిలిపివేసింది. యాప్ సేవలను పూర్తిస్థాయిలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక నుంచి కొత్త ఆధార్ యాప్‌ను మాత్రమే ఉపయోగించాలని సూచించింది. కొత్త ఆధార్ యాప్‌ అందరూ వాడాలని యూఐడీఏఐ సిఫార్సు చేసింది. కొత్త యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. కేంద్రం గత ఏడాది డిసెంబర్‌లో ఆధార్ కొత్త యాప్‌ను ప్రారంభించింది. ఆ యాప్‌లో అన్నీ సేవలు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఎంఆధార్ యాప్‌ సేవలను నిలిపివేశారు.

కొత్త ఆధార్ యాప్

“ఎంఆధార్ యాప్ త్వరలో నిలిపివేయబడుతోంది. ఇప్పుడు కొత్త ఆధార్ యాప్‌తో మరింత స్మార్ట్, వేగవంతం, సురక్షితమైన డిజిటల్ ప్రయాణాన్ని అనుభవించండి. సురక్షితమైన QR ఆధారిత ఆధార్ షేరింగ్ నుండి మెరుగైన గోప్యతా నియంత్రణలు, ఆధార్ సేవలకు నిరంతరాయ యాక్సెస్ వరకు.. మీ డిజిటల్ గుర్తింపు అనుభవాన్ని సరళతరం చేయడానికి ఈ కొత్త యాప్ రూపొందించబడింది. ఆధార్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి” అంటూ యూఐడీఏఐ పేర్కొంది.

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే..

ఈ ఏడాది జనవరి 28న ఆధార్ యాప్ కొత్త వెర్షన్‌ను కేంద్రం విడుదల చేసింది. ఇందులో మరిన్ని ఫీచర్లను జోడించింది. ఈ యాప్‌లో మీరు ఎక్కడినుంచైనా, ఎప్పుడైనా వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ ఆధార్‌లో ఏ వివరాలు అయితే అవసరమో వాటిని మాత్రమే ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. గతంలో ఆధార్ కార్డులను డిజిటల్‌గా నిల్వ చేసుకునేందుకు ఎంఆధార్ యాప్ ఉపయోగించేవారు. అయితే ఈ యాప్ ద్వారా ఎలాంటి సమాచారాన్ని అప్డేట్ చేసుకోవడం కుదరదు. కొత్త ఆధార్ యాప్‌లో అన్నీ సేవలు ఒకేచోట లభిస్తున్నాయి. దీంతో ఎంఆధార్ యాప్‌ను నిలిపివేశారు. అయితే కొత్త యాప్‌లో క్యూఆర్ కోడ్ గుర్తింపు ధృవీకరణ ఫీచర్ అందుబాటులో ఉంది. అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఆధార్ ధృవీకరణ పూర్తవుతుంది. దీంతో మీరు జిరాక్స్ కాపీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఆధార్ యాప్‌లోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. మీరు సిమ్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్, హోటళ్లు, దేవాలాయాల్లో అవసరమైన చోట సులువుగా ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేయొచ్చు.

Follow Us
ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్
ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?
రూ.1000 లంచానికి లక్ష బహుమతి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
రూ.1000 లంచానికి లక్ష బహుమతి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
ఉప్మా అంటే ముఖం మాడ్చుకుంటున్నారా?కమ్మని పెరుగు ఉప్మా ట్రై చేయండి
ఉప్మా అంటే ముఖం మాడ్చుకుంటున్నారా?కమ్మని పెరుగు ఉప్మా ట్రై చేయండి
6 గంటల్లోనే విజయవాడ టు బెంగళూరు.. కొత్త హైవే త్వరలోనే..
6 గంటల్లోనే విజయవాడ టు బెంగళూరు.. కొత్త హైవే త్వరలోనే..
అలాంటి పరిస్థితి వస్తే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను..
అలాంటి పరిస్థితి వస్తే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను..