TVS Raider 125: మార్కెట్‌లోకి టీవీఎస్‌ నయా బైక్‌.. అందుబాటులో ధరలోనే అద్భుతమైన ఫీచర్స్‌

టీవీఎస్‌ కంపెనీ కూడా తన వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త మోడల్‌ బైక్స్‌ను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేస్తుంది. తాజాగా టీవీఎస్‌ కంపెనీ రైడర్‌ 125 అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది.

TVS Raider 125: మార్కెట్‌లోకి టీవీఎస్‌ నయా బైక్‌.. అందుబాటులో ధరలోనే అద్భుతమైన ఫీచర్స్‌
Tvs Raider 125

Updated on: Apr 18, 2023 | 8:30 PM

భారతదేశంలో టూవీలర్‌ మార్కెట్‌లో టీవీఎస్‌ కంపెనీ బైక్స్‌కు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ముఖ్యంగా టీవీఎస్‌ టూ వీలర్స్‌ను గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అధిక మైలేజ్‌ ఇవ్వడంతో పాటు మెయింటెనెన్స్‌ ఖర్చు కూడా చాలా తక్కువ ఉండడంతో ఎక్కువగా వీటిని వాడుతూ ఉంటారు. టీవీఎస్‌ కంపెనీ కూడా తన వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త మోడల్‌ బైక్స్‌ను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేస్తుంది. తాజాగా టీవీఎస్‌ కంపెనీ రైడర్‌ 125 అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. స్ప్లిట్‌ సీట్‌ మోడల్‌ ధర రూ.93,719గా ఉండగా, బ్లూటూత్-ఎక్విప్డ్ మోడల్ రూ. 1,00,719గా ఉంది. ఈ బైక్‌ లుక్స్‌ పరంగా కాస్త అపాచీ బైక్‌ను పోలి ఉంటుంది. ఈ సూపర్‌ బైక్‌ ఇతర ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

రైడర్ 125 సింగిల్-సీటర్ వెర్షన్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, మోనోషాక్ రియర్ సస్పెన్షన్‌ను కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముందవైపు డిస్క్ బ్రేక్‌లు, వెనుకవైపు డ్రమ్‌లు బ్రేకులు ఉన్నాయి. స్పీడోమీటర్, ఫ్యూయల్ గేజ్, టాకోమీటర్, యూఎస్‌బీ ఛార్జింగ్ సదుపాయ వంటి అదునాతన ఫీచర్లు ఈ బైక్‌ సొంతం. అలాగే ప్రామాణిక ఫీచర్లతో కూడిన ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అలాగే ఈ బైక్ 10 లీటర్ల వరకు ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే రైడర్ 125  బైక్‌ 124.8 సీసీ ఎయిర్-కూల్డ్ ఫ్యూయల్-ఇంజెక్టెడ్ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 7,5000 ఆర్‌పిఎమ్ వద్ద 11.2 హార్స్‌పవర్, అలాగే 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 11.2 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఐదు గేర్స్‌తో ఈ రైడర్ బైక్‌ సొగసైన డిజైన్, సౌకర్యవంతమైన రైడ్ అందిస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నూతన రైడర్‌ 125 కచ్చితంగా బైక్‌ లవర్స్‌ను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..