EV Market: ఆ రెండు కంపెనీలను వెనక్కి నెట్టిన టీవీఎస్.. ఈవీ మార్కెట్‌లో టీవీఎస్ హవా
భారతదేశంలో ఇటీవల కాలంలో ఈవీ మార్కెట్ అమాంతం పెరుగుతుంది. టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకు భారత మార్కెట్ ఈవీ వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. అయితే మార్కెట్‌లో ఎన్ని వాహనాలు వచ్చిన టీవీఎస్, ఓలా, చేతక్ కంపెనీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో తాజా టీవీఎస్ ఈవీ ఓ అరుదైన ఘనతను సాధించింది. ఈ నేపథ్యంలో టీవీఎస్ సాధించిన ఘనత గురించి తెలుసుకుందాం.

ఏప్రిల్ 2025 నాటికి భారతదేశ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో టీవీఎస్ మోటార్ అగ్రగామిగా అవతరించింది. గతంలో అగ్రస్థానంలో బజాజ్ ఆటో, ఓలా ఎలక్ట్రిక్‌లను అధిగమించి మరీ టీవీఎస్ ఈ స్థానానికి చేరింది. గత నెలలో టీవీఎస్ 19,736 యూనిట్లను విక్రయించింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 154 శాతం సూచిస్తుందని, అలాగే పెరుగుదల 22 శాతం మార్కెట్ వాటాతో ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఓలా ఎలక్ట్రిక్ 19,709 యూనిట్లను విక్రయించింది. ఇది గత సంవత్సరం కంటే 42 శాతం తగ్గుదల, 21 శాతం మార్కెట్ వాటాతో కలిగి ఉంది. అలాగే బజాజ్ ఆటో 151 శాతం వృద్ధిని సాధించి 19,001 యూనిట్లకు చేరుకుంది. అలాగే 21 శాతం మార్కెట్ వాటాను పొందింది.
అలాగే ఇటీవల అమ్మకాల్లో వృద్ధిని చూపుతున్న ఏథర్ ఎనర్జీ ఈవీ స్కూటర్ల అమ్మకాలు 31 శాతం పెరిగి 13,167 యూనిట్లకు చేరుకున్నాయి. అంటే దాదాపు 14 శాతం మార్కెట్ వాటా ఏథర్ పొందింది. అలాగే హీరో మోటోకార్ప్ 6,123 యూనిట్లు అమ్ముడుపోయి 7 శాతం మార్కెట్ వాటాతో 540 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఓలా ఎలక్ట్రిక్ నెలనెలా తన మార్కెట్ వాటాను పెంచుకున్నప్పటికీ అమ్మకాలు తగ్గడానికి పెరిగిన పోటీ, వ్యూహాత్మక మార్పులే కారణమని నిపుణులు చెబుతున్నారు. భవిష్ అగర్వాల్ నేతృత్వంలోని కంపెనీ మహారాష్ట్రతో సహా అనేక రాష్ట్రాల్లో ట్రేడ్ సర్టిఫికెట్లు, వాహన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఉల్లంఘనల కారణంగా గణనీయమైన నియంత్రణ పరిశీలనలో ఉంది. ముఖ్యంగా చాలా వరకు షోరూమ్‌లను మూసేసే పరిస్థితికి వచ్చింది. అయితే మహారాష్ట్రలోని 100 కి పైగా షోరూమ్‌లను మూసివేయాలని ఆదేశించిందని వార్తలు గుప్పుమన్నాయి. అయితే అధికారిక నోటీసు గురించి తమకు తెలియదని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు.
అలాగే టీవీఎస్, బజాజ్, ఏథర్ వంటి ఈవీ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఓలా అమ్మకాల్లో వెనుకబడింది. టీవీఎస్ ఏప్రిల్ నెలలో అత్యుత్తమ అమ్మకాలను సాధించి మొదటిసారిగా మార్కెట్‌లో అగ్రస్థానంలో నిలిచింది. బజాజ్ ఆటో పనితీరు దాని చేతక్ ఈ-స్కూటర్‌కు సంబంధించిన అమ్మకాలతో బలపడింది. ఈ కంపెనీ క్యూ4 2025 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఓలా ఎలక్ట్రిక్ కూడా పబ్లిక్ మార్కెట్లో ఏథర్ ఎనర్జీ నుండి పోటీని ఎదుర్కొంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




