AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trump Tariffs: భారత్‌పై 100 శాతం సుంకాలు.. కీలక బిల్లుపై ట్రంప్ సంతకం..

భారత్‌పై 100 శాతం సుంకాలు విధించే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. దీంతో ఇది చట్టరూపం దాల్చింది. రష్యా నుంచి ఎక్కువగా ఇంధనం కొనుగోలు చేసే ఐదే దేశాలపై 100 శాతం సుంకాలు విధించడానికి ఈ చట్టం అనుమతిస్తుంది.

Trump Tariffs: భారత్‌పై 100 శాతం సుంకాలు.. కీలక బిల్లుపై ట్రంప్ సంతకం..
India
Venkatrao Lella
|

Updated on: Sep 19, 2026 | 7:20 AM

Share

భారత్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాకిచ్చారు. భారత్‌పై 100 శాతం దిగుమతి సంకాలు విధించే బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు. ఇటీవల హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ప్రతినిధుల సభ ఆమోదించిన లిండ్సే ఓ.గ్రాహం ఆంక్షల బిల్లుపై ట్రంప్ తాజాగా సంతకం చేశారు. దీంతో ఇది ఒక చట్టంగా మారింది. ఈ చట్టం ప్రకారం రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే ఐదు దేశాలపై అమెరికా 100 శాతం టారిఫ్‌లు విధించనుంది. ఉక్రెయిన్‌పై యుద్దం చేస్తున్న రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన కొద్దిసేపటికే ఈ బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు. రష్యా నుంచి ఇంధనం, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం సుంకాలు విధించడానికి ఈ చట్టం అనుమతిస్తుంది.

రష్యా నుంచి భారత్, చైనా ఎక్కువగా ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నాయి. దీంతో ఈ రెండు దేశాలపై అధిక సుంకాల ప్రభావం ఎక్కువగా పడనుంది. ఉక్రెయిన్‌పై గత నాలుగున్నర ఏళ్లుగా రష్యా యుద్దం కొనసాగిస్తోంది. దీంతో రష్యా ఆర్ధిక మూలాలను దెబ్బతీసేందుకు అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. రష్యాకు ప్రధాన ఆదాయ వనరుగా చమురు, గ్యాస్ ఉంది. దీంతో రష్యాపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా చర్చలకు దిగొస్తుందని అమెరికా భావిస్తోంది. ఈ కొత్త చట్టం రష్యా నుంచి నేరుగా అమెరికాకు పంపే ఉత్పత్తులపై 500 శాతం దిగుమతి సుంకం విధించేందుకు అనుమతిస్తుంది. ఏప్రిల్‌ 2025లో దివంగత సెనేటర్ లిండ్సే గ్రహం, సెనేటర్ రిచర్డ్ బ్లూమెంథాల్ ఈ బిల్లు ప్రతిపాదించారు. 18 నెలల తర్వాత ఇప్పుడు ఆ బిల్లు చట్టంగా మారింది. రష్యా నుంచి ఎక్కువగా చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలే లక్ష్యంగా ఈ చట్టం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దని గతంలో పలుమార్లు భారత్‌ను ట్రంప్ హెచ్చరించారు. రష్యా నుంచి కాకుండా వేరే దేశాల నుంచి కొనుగోలు చేయాలని సూచించారు. రష్యా నుంచి ఎక్కువగా ఇంధనం కొనుగోలు చేసే టాప్ ఐదు దేశాల జాబితాను 180 రోజులకు ఒకసారి అమెరికా సమీక్షిస్తోంది. ఈ జాబితాలో చైనా, భారత్, హంగేరీ, అజర్ బైజాన్, స్లోవేకియా ఉన్నాయి. అయితే భారత్‌పై 100 శాతం సుంకాలు విధించడం వల్ల అమెరికాకు ఎగుమతి అయ్యే ఐటీ, ఫార్మా, ఇంజినీరింగ్, టెక్స్ టైల్స్ ఉత్పత్తలు ధరల పెరిగే అవకాశముంది. దీని వల్ల భారత్ నుంచి వాటిని ఎగుమతి చేసేవారికి తీవ్ర నష్టం జరగనుంది. అయితే ఈ సుంకాల నుంచి భారత్‌కు మినహాయింపు ఇచ్చే అవకాశం కూడా చట్టంలో ఉంది. రానున్న రోజుల్లో అమెరికా, భారత్ మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చల్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ ఉంది.

Follow Us