AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Traffic Stuck: ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారా? ఆఫీస్ గందరగోళాన్ని జయించడానికి ఈ 5 మేనేజ్‌మెంట్ సూత్రాలు!

ట్రాఫిక్ ఆగిపోయినప్పుడు వెంటనే ఏదో ఒక రూట్ మార్చేయాలి. ఓవర్‌టేక్ చేయాలి అనే ఆరాటం ఉంటుంది. కానీ కొన్నిసార్లు అలా తొందరపడకుండా శాంతంగా ఉండటమే శ్రేయస్కరం. ఆఫీస్‌లో కూడా పని ఆశించిన వేగంతో జరగనప్పుడు వెంటనే జోక్యం చేసుకోకుండా 'వేచి చూడటం' అనే వ్యూహం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ప్రతీ సమస్యకూ తక్షణ చర్య అవసరం లేదు. వేచి చూడటం అంటే నిర్ణయం తీసుకోలేకపోవడం కాదు,

Traffic Stuck: ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారా? ఆఫీస్ గందరగోళాన్ని జయించడానికి ఈ 5 మేనేజ్‌మెంట్ సూత్రాలు!
Traffic Stuck
Subhash Goud
|

Updated on: Aug 30, 2026 | 10:18 AM

Share

Traffic Stuck: ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కోవడం ఎవరికైనా చిరాకు తెప్పిస్తుంది. ముందున్న వాహనాలను నిందించడం, పదేపదే హారన్ కొట్టడం, ఒక లేన్ నుంచి మరో లేన్‌కు మారడం.. ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. అయితే ట్రాఫిక్ జామ్ మనకు మానవ ప్రవర్తనతో పాటు మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పాఠాలను కూడా నేర్పుతుంది. రోడ్డుపై నీరు నిలవడం వల్లో లేక విఐపి కాన్వాయ్ వల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్నప్పుడు మనకు అమితమైన కోపం, విసుగు వస్తుంటాయి. అయితే, నిశితంగా గమనిస్తే ఆఫీస్‌లో జరిగే ప్రాజెక్ట్ జాప్యాలు, పని ఒత్తిడి, గందరగోళం కూడా సరిగ్గా ఈ ట్రాఫిక్ జామ్ లాంటివే. ట్రాఫిక్ సమస్యల నుంచి ఆఫీస్ మేనేజ్‌మెంట్‌ను సులువుగా ఎలా సమర్థించుకోవచ్చో నేర్పించే 5 ముఖ్యమైన సూత్రాలు ఇవే:

1. ఆటంకాన్ని మొదట గుర్తించండి:

ట్రాఫిక్ ఆగిపోయినప్పుడు మనకు మొదట కనిపించేది ముందున్న కార్లే. కానీ అసలు కారణం లోపల ఎక్కడో ఒక ఇరుకైన రోడ్డు, ప్రమాదం లేదా కారు మొరాయించడం కావచ్చు. ఆఫీస్‌లో కూడా అంతే. ప్రాజెక్ట్ ఆలస్యమవుతున్నప్పుడు కేవలం ఒక వ్యక్తిని నిందించడం సరికాదు. డిజైనర్ కంటెంట్ కోసం వేచి చూస్తుండవచ్చు. కంటెంట్ టీమ్ డేటా కోసం వేచి ఉండవచ్చు. డేటా టీమ్ అనుమతుల (Approvals) కోసం వేచి చూస్తుండవచ్చు. అలాగే దీనికి అసలైన సూత్రం ఏంటంటే.. సిబ్బందిని వేగంగా పనిచేయమని అడిగే ముందు, అసలు వారి వేగాన్ని తగ్గిస్తున్న ‘కంటికి కనిపించని ఆటంకం’ ఏమిటో గుర్తించి దాన్ని తొలగించండి.

2. ఎక్కువ మంది మనుషులు, వేగవంతమైన పని కాదు

ట్రాఫిక్ జామ్‌లో ఒకే చిన్న గ్యాప్‌లోకి ఐదారు కార్లు ఒకేసారి వెళ్లడానికి ప్రయత్నిస్తే పరిస్థితి ఇంకా ఘోరంగా మారుతుంది. అలాగే, సమస్యలో ఉన్న ఒక ప్రాజెక్ట్‌లోకి అవసరం లేకపోయినా ఎక్కువ మంది ఉద్యోగులను తీసుకురావడం వల్ల మరిన్ని అభిప్రాయాలు, నిరంతర మీటింగ్‌లు, కమ్యూనికేషన్ గందరగోళం పెరుగుతాయి తప్ప పని వేగవంతం కాదు. ఎక్కువ మంది మనుషులు ఉన్నంత మాత్రాన పనిలో సమర్థత పెరుగుతుందని చెప్పలేం.

3. ప్రతీ ఐదు సెకన్లకూ లేన్ మార్చకండి

పక్క లేన్ వేగంగా వెళ్తోందని భావించి తరచూ లేన్లు మారడం ట్రాఫిక్‌లో చూస్తుంటాం. కానీ తీరా మారాక పాత లేన్ కదలడం మొదలవుతుంది. ఆఫీసుల్లో మేనేజర్లు కూడా ఇదే తప్పు చేస్తుంటారు. ఒక కొత్త స్ట్రాటజీ తీసుకురావడం, కొన్ని వారాలకే దాన్ని వదిలేసి వేరేది ప్రయత్నించడం. అలాగే ఒక ప్రక్రియను పదే పదే మార్చడం.. ఇలా చేయడం వల్ల ఉద్యోగులు నిరంతరం కష్టపడుతున్నట్లు అనిపించినా, ఫలితం మాత్రం సున్నా. ప్రతీ నెమ్మదైన పరిస్థితికీ కొత్త స్ట్రాటజీ అవసరం లేదు. ఒక్కోసారి కాస్త ఓపిక కూడా అవసరమే.

4. స్పష్టమైన కమ్యూనికేషన్‌తో గందరగోళాన్ని అరికట్టండి

రోడ్డుపై సిగ్నల్స్, లేన్ మార్కింగ్‌లు, ఇండికేటర్లు ఉండటం వల్ల ప్రయాణం సురక్షితంగా సాగుతుంది. అలాగే ఆఫీస్‌లో కూడా నియమ నిబంధనలు, కమ్యూనికేషన్ మార్గాలు స్పష్టంగా ఉండాలి.

ఎవరి బాధ్యత ఏమిటి? ఏదైనా సమస్య వస్తే తుది నిర్ణయం ఎవరిది? కమ్యూనికేషన్ ఎలా జరగాలి? కార్యాలయంలో స్పష్టమైన నిబంధనలు, సమాచార వ్యవస్థ ఉంటే పనిలో ఆటంకాలు ఏర్పడవు.

5. కొన్నిసార్లు వేచి చూడటమే అత్యుత్తమ నిర్ణయం

ట్రాఫిక్ ఆగిపోయినప్పుడు వెంటనే ఏదో ఒక రూట్ మార్చేయాలి. ఓవర్‌టేక్ చేయాలి అనే ఆరాటం ఉంటుంది. కానీ కొన్నిసార్లు అలా తొందరపడకుండా శాంతంగా ఉండటమే శ్రేయస్కరం. ఆఫీస్‌లో కూడా పని ఆశించిన వేగంతో జరగనప్పుడు వెంటనే జోక్యం చేసుకోకుండా ‘వేచి చూడటం’ అనే వ్యూహం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ప్రతీ సమస్యకూ తక్షణ చర్య అవసరం లేదు. వేచి చూడటం అంటే నిర్ణయం తీసుకోలేకపోవడం కాదు, అది కూడా ఒక గొప్ప వ్యూహమే. ట్రాఫిక్ అయినా, ఆఫీస్ వర్క్ అయినా అందరూ ముందుకు వెళ్లాలనే కోరుకుంటారు. కానీ వేగంగా వెళ్లడం కంటే సరైన పద్ధతిలో వెళ్లడమే ముఖ్యం. ఆటంకాలను గుర్తించడం, స్పష్టమైన సమాచారం అందించడం. అనవసర మార్పులు మానడం, ఓపిక పట్టడం ద్వారా ఆఫీస్ గందరగోళాన్ని తేలికగా అధిగమించవచ్చు.

Follow Us
నా బిడ్డకు తండ్రి అతనే.. 21 ఏళ్ల తర్వాత కుమారుడితో కలిసి ధర్నా..
నా బిడ్డకు తండ్రి అతనే.. 21 ఏళ్ల తర్వాత కుమారుడితో కలిసి ధర్నా..
మాడిన పాత్రలపై మసి పోవాలంటే.. ఈ కూరగాయలతో తలా తలా మెరిసిపోతాయ్
మాడిన పాత్రలపై మసి పోవాలంటే.. ఈ కూరగాయలతో తలా తలా మెరిసిపోతాయ్
విడాకుల విషయంలో తప్పంతా నాదే.. ఆమె నన్ను భరించలేకపోయింది..
విడాకుల విషయంలో తప్పంతా నాదే.. ఆమె నన్ను భరించలేకపోయింది..
వాహనదారులకు బిగ్ అలర్ట్.. నంబర్ ప్లేట్ తేడా ఉంటే క్రిమినల్ కేసే..
వాహనదారులకు బిగ్ అలర్ట్.. నంబర్ ప్లేట్ తేడా ఉంటే క్రిమినల్ కేసే..
ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారా?ఆఫీస్ గందరగోళాన్ని జయించడానికి సూత్రాలు
ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారా?ఆఫీస్ గందరగోళాన్ని జయించడానికి సూత్రాలు
సచిన్‌ vs కపిల్‌.. ‘ఆల్‌టైమ్‌ గ్రేట్‌’ ప్లేయర్ ఎవరు..?
సచిన్‌ vs కపిల్‌.. ‘ఆల్‌టైమ్‌ గ్రేట్‌’ ప్లేయర్ ఎవరు..?
భారత్-ఉజ్బెకిస్తాన్ వ్యూహాత్మక బంధం..!
భారత్-ఉజ్బెకిస్తాన్ వ్యూహాత్మక బంధం..!
అరటిపండు తిన్నాక నీళ్లు తాగితే మీ పొట్టలో ఏం జరుగుతుందో తెలుసా..?
అరటిపండు తిన్నాక నీళ్లు తాగితే మీ పొట్టలో ఏం జరుగుతుందో తెలుసా..?
16 ఏళ్లలో 6 సీక్వెల్స్, అన్నీ సూపర్ హిట్లు
16 ఏళ్లలో 6 సీక్వెల్స్, అన్నీ సూపర్ హిట్లు
అందరి చూపు వైభవ్, తిలక్‌పైనే.. మ్యాచ్‌ ఎక్కడ చూడాలంటే?
అందరి చూపు వైభవ్, తిలక్‌పైనే.. మ్యాచ్‌ ఎక్కడ చూడాలంటే?