CAIT: GST రేట్లను హేతుబద్దీకరించాలి.. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ డిమాండ్..

|

Jun 20, 2022 | 7:10 AM

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ GST రేట్లను హేతుబద్ధీకరించడానికి GST కౌన్సిల్ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించింది. రేట్లను హేతుబద్ధం చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరింది...

CAIT: GST రేట్లను హేతుబద్దీకరించాలి.. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ డిమాండ్..
Follow us on

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ GST రేట్లను హేతుబద్ధీకరించడానికి GST కౌన్సిల్ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించింది. రేట్లను హేతుబద్ధం చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరింది. దీనితోపాటు జీఎస్టీ చట్టం, నియమాలు కూడా కొత్తగా సమీక్షించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న జిఎస్‌టి ఫ్రేమ్‌వర్క్‌ను సరళీకృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ డిమాండ్‌పై దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులను కలవాలని సీఏఐటీ యోచిస్తోంది. GST, ఇ-కామర్స్ రెండింటిపై జాతీయ ప్రచార వ్యూహాన్ని రూపొందించడానికి CAT జూన్ 25 నుంచి 26 వరకు నాగ్‌పూర్‌లో దేశంలోని వాణిజ్యవేత్తలతో రెండు రోజుల సమావేశాన్ని నిర్వహిస్తోంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో అన్ని రాష్ట్రాలకు చెందిన దాదాపు 100 మంది ప్రముఖ వ్యాపారులు పాల్గొని సమస్యలపై చర్చించనున్నారు.

CAT జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ కొద్దిరోజుల క్రితం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. GST చట్టం, నిబంధనలను సరళీకృతం చేయడం, GST పన్ను స్థావరాన్ని విస్తృతం చేయడం, ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మరింత ఆదాయాన్ని సమకూర్చే ఆవశ్యకతను నొక్కి చెప్పారు. దేశంలోని ప్రతి జిల్లాలో జీఎస్టీకి చెందిన సీనియర్ ట్యాక్స్ అధికారులు, సంబంధిత జిల్లాల వ్యాపారవేత్తలతో కూడిన జాయింట్ జీఎస్టీ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. జీఎస్టీ అమలును పర్యవేక్షించడం, వ్యాపారుల ఫిర్యాదులను పరిష్కరించడం వంటి బాధ్యతలను కమిటీకి అప్పగించాలన్నారు. ఎక్కువ మంది వ్యక్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి. వాటాదారులతో సంప్రదించిన తర్వాత జీఎస్టీ రేటును నిర్ణయించాలని కూడా ఆయన అన్నారు.

 

ఇవి కూడా చదవండి