పది రోజుల్లో.. వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం..!

గత కొద్ది రోజులుగా బంగారం.. ప్రజలను హడలెత్తిస్తోన్న విషయం తెలిసిందే. మధ్యలో తగ్గినా.. ఆ తర్వాత ఊహించని విధంగా.. 40వేల బెంజ్ మార్క్‌ దాటింది. దీంతో.. బంగారం షాపులన్నీ వెలవెలబోయాయి. ఈ నేపథ్యంలో.. 10 గ్రాముల బంగారం రూ.50 వేలు దాటినా ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉండేది కాదని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా.. మరలా.. డిసెంబర్ 1వ తేదీ నుంచి పసిడి ధరలు తగ్గు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. దాదాపు పది రోజుల్లో […]

పది రోజుల్లో.. వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం..!
Follow us

| Edited By:

Updated on: Dec 13, 2019 | 9:09 PM

గత కొద్ది రోజులుగా బంగారం.. ప్రజలను హడలెత్తిస్తోన్న విషయం తెలిసిందే. మధ్యలో తగ్గినా.. ఆ తర్వాత ఊహించని విధంగా.. 40వేల బెంజ్ మార్క్‌ దాటింది. దీంతో.. బంగారం షాపులన్నీ వెలవెలబోయాయి. ఈ నేపథ్యంలో.. 10 గ్రాముల బంగారం రూ.50 వేలు దాటినా ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉండేది కాదని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాగా.. మరలా.. డిసెంబర్ 1వ తేదీ నుంచి పసిడి ధరలు తగ్గు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. దాదాపు పది రోజుల్లో వెయ్యి రూపాయలు తగ్గింది. డిసెంబర్ 4వ తేదీ వరకూ.. రూ. 39,800 ఉన్న పసిడి.. డిసెంబర్ 13వ తేదీ వచ్చేసరికి రూ. 38,870లకి తగ్గింది. ఈ లెక్కన దాదాపు 1000 రూపాయలు తగ్గినట్టే అనుకోవాలి. అంతేకాకుండా.. ఈ తగ్గిన ధరలతో.. పలువురు పసిడిని కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

తాజాగా శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3 8,870లు కాగా.. 22 క్యారెట్స్ బంగారు ఆభరణాల 10 గ్రాముల బంగారం ధర రూ. 36,090లుగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో.. 24k 10 గ్రాములు రూ. 38,910 కాగా.. 22k 10 గ్రాములు 36,850గా ఉంది. ముంబాయిలో.. 24k 10 గ్రాములు 38,925 కాగా.. 22k 10 గ్రాములు 36,700లుగా ఉంది. అలాగే.. హైదరాబాద్ ప్రస్తుత మార్కెట్‌లోని కిలో వెండి రూ.47,500గా ఉంది.