Today Gold Price: బంగారం ధర ఈరోజు కూడా తగ్గింది.. శుక్రవారం తులం బంగారం ఎంత ఉందంటే..
Today Gold Price: బంగారం ధరల పతనం కొనసాగుతూనే ఉంది. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధర ఈరోజు (శుక్రవారం) కూడా తగ్గింది. లాక్‌డౌన్ సమయంలో భారీగా పెరిగిన గోల్డ్ రేట్ తాజాగా నేల చూపులు చూస్తోంది. బంగారం కొనుగోలు..
Today Gold Price: బంగారం ధరల పతనం కొనసాగుతూనే ఉంది. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధర ఈరోజు (శుక్రవారం) కూడా తగ్గింది. లాక్‌డౌన్ సమయంలో భారీగా పెరిగిన గోల్డ్ రేట్ తాజాగా నేల చూపులు చూస్తోంది. బంగారం కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం అన్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఈరోజు దేశవ్యాప్తంగా గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయన్నదానిపై ఓ లుక్కేయండి.. దేశ రాజధాని ఢిల్లీలో గురువారంతో పోలిస్తే 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.350 తగ్గి.. రూ.45,550 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ విషయానికొస్తే రూ.380 తగ్గి, రూ.49,690 వద్ద ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై విషయానికొస్తే మాత్రం గురువారంతో పోలిస్తే బంగారం ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం రూ.45,690 ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ రూ.46,690 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది. శుక్రవారం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 తగ్గి రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ.380 తగ్గి రూ.47,350 పలికింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం రూ.43,400 ఉండగా.. 2 4 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.47,350 వద్ద కొనసాగుతోంది. మరి బంగారం ధరల్లో తగ్గుదల నేటితో ఆగిపోతుందా.. శనివారం కూడా కొనసాగుతుందా చూడాలి.