Mutual Fund: ఈ టాటా మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడితో బంఫర్ రిటన్స్.. లాభాలు చూస్తే కళ్లుచెదరాల్సిందే..
Multibagger stock: టాటా బ్యాంకింగ్ & ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది బ్యాంకింగ్-ఫైనాన్స్ సర్వీసెస్ సెక్టార్‌లో పెట్టుబడి పెట్టే ఓపెన్-ఎండ్ ఈక్విటీ పథకం. ఈ ఫండ్ 28 డిసెంబర్ 2015న స్థాపించారు. ఈ ఫండ్‌కు 3-స్టార్ రేటింగ్ ఉంది.

మీరు భవిష్యత్తు కోసం భారీ మొత్తాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే, ఈ పెట్టుబడి కోసం ఇప్పటి నుంచే పొదుపు చేయాల్సి ఉంటుంది. మీరు సరైన సమయంలో సరైన చోట పెట్టుబడి పెట్టినట్లయితే, అద్భుతమైన రాబడిని అందుకుంటారు. కొన్ని సంవత్సరాలు వేచి ఉంటే భారీ మొత్తాన్ని అందుకోవచ్చు.
ఉదాహరణకు, టాటా గ్రూప్‌నకు చెందిన టాటా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్‌లో సుమారు 7 సంవత్సరాల క్రితం ప్రతి నెలా రూ.10,000 ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ల మొత్తం ఇప్పటి వరకు రూ.13 లక్షలు దాటింది. టాటా బ్యాంకింగ్ & ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది బ్యాంకింగ్-ఫైనాన్స్ సర్వీస్ సెక్టార్‌లో పెట్టుబడి పెట్టే ఓపెన్-ఎండ్ ఈక్విటీ స్కీమ్. ఈ ఫండ్ 28 డిసెంబర్ 2015న మొదలైంది. ఈ ఫండ్ 3-స్టార్ రేటింగ్‌ను కలిగి ఉంది.
పనితీరు ఎలా ఉంది: ఈ మ్యూచువల్ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP)లో పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులు సంపన్నులుగా మారారు. నెలవారీ రూ. 10000 సిప్ పెట్టిన పెట్టుబడిదారుల మొత్తం పెట్టుబడి రూ 1.20 లక్షల నుంచి రూ. 1.32 లక్షలకు పెరిగి 20.42% రాబడిని అందించింది. అదేవిధంగా, నెలవారీ రూ. 10000 సిప్ గత మూడేళ్లలో మీ మొత్తం పెట్టుబడిని రూ. 3.60 లక్షల నుంచి రూ. 4.63 లక్షలకు పెరిగింది. అంటే పెట్టుబడిపై 17.09% రాబడి అందింది.




అయితే, గత ఐదేళ్లలో రూ. 10000 నెలవారీ SIP చేసినట్లయితే, మీ మొత్తం పెట్టుబడి రూ. 6 లక్షల నుంచి రూ. 8.37 లక్షలకు పెరిగింది. దీంతో ఇన్వెస్టర్లకు 13.30 శాతం రాబడి లభించింది. అదేవిధంగా, ఏడు సంవత్సరాల వ్యవధిలో నెలవారీ రూ.10,000 SIPపై రాబడి రూ. 13.13 లక్షలకు పెరిగింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..