AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAN Card: పాన్ కార్డు పోయిందా? కంగారొద్దు.. డూప్లికేట్ కార్డును సులభంగా పొందండిలా..

పాన్ కార్డు అంటే శాశ్వత ఖాతా సంఖ్య (పర్మినెంట్ అక్కౌంట్ నంబర్). దీనిని ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. దేశంలోని ప్రజలందరికీ పాన్ కార్డు అత్యవసరం. అయితే ఒక్కోసారి ఈ కార్డును పోగొట్టుకుంటూ ఉంటాం. కార్డు లేకపోతే మన లావాదేవీలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఇలాంటి సమయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలా సులభంగా డూప్లికేట్ పాన్ కార్డును పొందే అవకాశం ఉంది.

PAN Card: పాన్ కార్డు పోయిందా? కంగారొద్దు.. డూప్లికేట్ కార్డును సులభంగా పొందండిలా..
Pan Card
Madhu
|

Updated on: Jul 14, 2024 | 5:19 PM

Share

మన దైనందిన జీవితంలో అనేక సందర్భాలలో ఉపయోగపడే ముఖ్యమైన పత్రాలలో పాన్ (పీఏఎన్) కార్డు ఒకటి. ప్రధానంగా ఆర్థిక లావాదేవీలకు ఇది అత్యంత అవసరం. ఏదైనా ఆస్తి కొనుగోలు చేయాలన్నా, బ్యాంకులలో రూ.50 వేలు మించి లావాదేవీలు నిర్వహించాలన్నా, బ్యాంకులో ఖాతా ప్రారంభించాలన్నా పాన్ కార్డు అవసరం ఉంటుంది. వాహనాల కొనుగోలు, విక్రయాలు, క్రెడిట్ కార్డు కావాలన్నా, డీమ్యాట్ ఖాతా ప్రారంభించాలన్నా, షేర్ల కొనాలన్నా, అమ్మాలన్నా, ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలన్నా పాన్ కార్డు తప్పనిసరిగా కావాలి.

శాశ్వత ఖాతా సంఖ్య..

పాన్ కార్డు అంటే శాశ్వత ఖాతా సంఖ్య (పర్మినెంట్ అక్కౌంట్ నంబర్). దీనిని ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. దేశంలోని ప్రజలందరికీ పాన్ కార్డు అత్యవసరం. అయితే ఒక్కోసారి ఈ కార్డును పోగొట్టుకుంటూ ఉంటాం. కార్డు లేకపోతే మన లావాదేవీలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఇలాంటి సమయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలా సులభంగా డూప్లికేట్ పాన్ కార్డును పొందే అవకాశం ఉంది.

డూప్లికేట్ కార్డు పొందాలంటే..

డూప్లికేట్ పాన్ కార్డును ఆన్ లైన్ లో చాలా సులభంగా పొందవచ్చు. దాని కోసం ఈ కింద పద్ధతులు పాటించి, దరఖాస్తు చేసుకోవాలి.

  • ముందుగా వెబ్ సైట్ లోకి వెళ్లండి. అప్లికేషన్ టైప్ అనే దానిని ఎంపిక చేసుకుని, పాన్ కార్డు రీప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • అక్కడ తెరుచుకున్నపేజీలో మీ పాన్ నంబర్, ఆధార్, పుట్టిన తేదీ తదితర వివరాలను నమోదు చేయాలి.
  • ఇమెయిల్, మొబైల్ ద్వారా ఓటీపీ డెలివరీ ఎంపికను ఎంచుకోమని అడుగుతారు. మీ ప్రాధాన్య ఎంపికను ఎంచుకున్న తర్వాత, మీ ఒరిజినల్ పాన్ కార్డ్‌తో అనుబంధించబడిన మీ ఇమెయిల్, మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
  • ఆ ఓటీపీని పేజీలో నమోదు చేసి, సెండ్ అనే బటన్ పై క్లిక్ చేయాలి.
  • దానికి అవసరమైన చార్జీని ఆన్‌లైన్‌లో చెల్లించి, ప్రింట్ ద పాన్ కార్డ్ అనే ఎంపికపై క్లిక్ చేయాలి.
  • మీ మొబైల్ నంబర్‌కు మెసేజ్ వస్తుంది. దానిలో తెలిపిన లింక్‌ని ఉపయోగించి ఇ-పాన్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • మీ ఒరిజినల్ కార్డులోని వివరాలే డూప్లికేట్ కార్డులోనూ ఉంటాలి. కొత్తగా ఏ సమాచారం, వివరాలు అప్ డేట్ కావు. డూప్లికేట్ పాన్ కార్డ్ 15 నుంచి 20 రోజుల సమయంలో మీ చిరునామాకు వస్తుంది.

ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునే విధానం..

  • డూప్లికేట్ పాన్ కార్డు మన ఇంటికి రావడానికి దాదాపు 15 నుంచి 20 రోజులు పడుతుంది. దీంతో అత్యవసరం అయితే ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
  • ముందుగా వెబ్ సైట్ ను  సందర్శించాలి.
  • మీపేరు, ఫోన్ నంబర్, ఇమెయిల్ తదితర వివరాలు దానిలో నమోదు చేయాలి.
  • అనంతరం దరఖాస్తు ఫాంను సమర్పించండి.
  • ఇమెయిల్ ద్వారా పీడీఎఫ్ ఫార్మాట్ లో ఇ-పాన్‌ను పంపిస్తారు.
  • దాన్ని మీ ఇమెయిల్ నుంచి సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us