Google Pay: మీ ఫోన్లో గూగుల్ పే ఉందా.. రోజూ రూ.1000 మీవే.. అదెలా అంటే..
గూగుల్ పేతో డబ్బులు సంపాదించడానికి సులువైన మార్గం ఉంది. మీరు ఇంట్లోని కూర్చుని ప్రతి రోజూ రూ.500 నుంచి రూ.1000 వరకూ సంపాదించవచ్చు. అదెలా అంటే గూగుల్ ఎర్న్ మనీ ట్రిక్. దీనిని ఉపయోగించి డబ్బులు సంపాదించొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

నేడు ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా దర్శనమిస్తోంది. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అనేక పనులు చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతోంది. కాల్స్ మాట్లాడుకోవడం, మెసేజ్ పంపండం, ఆర్థిక లావాదేవీలు తదితర వాటిని చేసుకోవచ్చు. అలాగే స్మార్ట్ ఫోన్ ఉపయోగించి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్ లో గూగుల్ పే అనే యాప్ ఉంటుంది. దీని ద్వారా యూపీఏ లావాదేవీలు, షాపింగ్ బిల్లులు, విద్యుత్ బిల్లులు, గ్యాస్ సిలిండర్, నీటి బిల్లులను కట్టవచ్చు. అలాగే మొబైల్ బ్యాలెన్స్‌ని రీఛార్జ్ చేయవచ్చు. వాటి ద్వారా మీకు క్యాష్‌బ్యాక్ లు లభిస్తాయి. గూగుల్ పే అనేది చాలా సురక్షితమైన యాప్. మీ లావాదేవీలను సక్రమంగా, సమర్థవంతంగా నిర్వహిస్తుంది.
సులువైన మార్గం..
గూగుల్ పేతో డబ్బులు సంపాదించడానికి సులువైన మార్గం ఉంది. మీరు ఇంట్లోని కూర్చుని ప్రతి రోజూ రూ.500 నుంచి రూ.1000 వరకూ సంపాదించవచ్చు. గూగుల్ ఎర్న్ మనీ ట్రిక్ ను ఉపయోగించి డబ్బులు సంపాదించే విధానాన్ని తెలుసుకుందాం..
గూగుల్ పే రిఫరల్ కోడ్..
స్మార్ట్ ఫోన్ వినియోగదారులు గూగుల్ పే రిఫరల్ కోడ్ ను ఉపయోగించి డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ముందుగా మీరు గూగుల్ పే యాప్ లింక్ ను స్నేహితులు, ఇతర పరిచయస్తులకు షేర్ చేయాలి. యాప్ ఆఫర్ ప్రకారం మీకు రూ.101 లేదా రూ.201 వరకూ క్యాష్‌బ్యాక్ అందుతుంది. ఇది నేరుగా మీ ఖాతాలో జమ అవుతుంది. అవతలి వ్యక్తి మీ లింక్ నుంచి గూగుల్ పే యాప్ ను డౌన్ లోడ్ చేసి లావాదేవీ చేసినప్పుడు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అతడు లావాదేవీలు జరపకపోతే.. ముందుగా మీ ఖాతాకు రూ.200 పంపమనండి. అనంతరం ఆ సొమ్మును అతడికి తిరిగి పంపేయండి. ఈ లావాదేవీ ద్వారా మీకు రూ. 101 లేదా 201 క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఇలా రోజుకు ఐదుగురికి గూగుల్ లింక్ ను పంపించడం ద్వారా రూ.500 నుంచి రూ.1000 వరకూ ఆదాయం వస్తుంది.
క్యాష్‌బ్యాక్ ఆఫర్లు..
క్యాష్ బ్యాక్ ఆఫర్ల ద్వారా గూగుల్ పే నుంచి డబ్బులు సంపాదించే అవకాశం ఉంది. మొబైల్ రీఛార్జ్, విద్యుత్ బిల్లు, నీటి బిల్లు, డీటీహెచ్, టీవీ రీఛార్జ్, గ్యాస్ సిలిండర్ బుక్కింగ్ తదితర ఆన్ లైన్ లావాదేవీలు చేయవచ్చు. వీటి నుంచి వచ్చిన క్యాష్ బ్యాక్ ల ద్వారా డబ్బులు సంపాదించవచ్చు.
గూగుల్ పే ఇన్ స్టాల్ చేసే విధానం..
- గూగుల్ పే ఖాతాను తెరవడానికి తప్పనిసరిగా బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి. మీ స్మార్ట్‌ఫోన్ మొబైల్ నంబర్‌ను బ్యాంక్ ఖాతాకు లింక్ చేయాలి. అలాగే ఏటీఎం లేదా డెబిట్ కార్డ్ తప్పనిసరి.
- ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లండి.
- సెర్చ్ బార్‌లో గూగుల్ పే అని టైప్ చేసి ఎంటర్ చేయండి.
- అనంతరం గూగుల్ పే యాప్ డౌన్‌లోడ్ / ఇన్‌స్టాల్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ అప్లికేషన్ డౌన్‌లోడ్ అవుతుంది.
- చివరిగా గూగుల్ పే మొబైల్ అప్లికేషన్‌ను తెరవాలి. దాని నుంచి లావాదేవీలు జరపవచ్చు.
- ఆపై మీరు మీ గూగుల్ పే ఖాతాను సృష్టించవచ్చు. మొబైల్ అప్లికేషన్‌ను సులభంగా యాక్సెస్ చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




