Motovolt URBN E-Scooter: ఈ-స్కూటర్‌కు లైసెన్స్ అవసరం లేదు.. రిజిస్ట్రేషన్‌తో పనేలేదు.. సింగిల్ చార్జ్‌పై 120కి.మీ.
అతి తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. దీనిని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. అంతేకాక బండికి రిజిస్ట్రేషన్ కూడా అక్కరలేదు. ఇంతకీ బైక్ ఎంటో చెప్పలేదు కదా.. దాని పేరు యూఆర్బీఎన్(URBN) ఎలక్ట్రిక్ స్కూటర్. మోటోవోల్ట్ మొబిలిటీ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ దీనిని లాంచ్ చేసింది. దీని ధర రూ. 49,999గా ఉంది.
మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. అతి తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. దీనిని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. అంతేకాక బండికి రిజిస్ట్రేషన్ కూడా అక్కరలేదు. ఇంతకీ బైక్ ఎంటో చెప్పలేదు కదా.. దాని పేరు యూఆర్బీఎన్(URBN) ఎలక్ట్రిక్ స్కూటర్. మోటోవోల్ట్ మొబిలిటీ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ దీనిని లాంచ్ చేసింది. దీని ధర రూ. 49,999గా ఉంది. ఇప్పటికే బుకింగ్స్ కూడా ప్రారంభించింది. రూ. 999 టోకెన్ అమౌంట్ తో బుక్ చేసుకోవచ్చు. ఈ యూఆర్బీఎన్ ఈ-బైక్ ను 100పైగా ఫిజికల్ రిటైల్ పాయింట్లను ఏర్పాటు చేసింది. పసుపు, బ్లూ, రెడ్, ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంచింది. ఈ ఎలక్ట్రిక్ టూ వీలర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
రిమూవబుల్ బ్యాటరీ సిస్టమ్..
మోటోవోల్ట్ యూఆర్బీఎన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బీఐఎస్ అప్రూవ్డ్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. దీనిని ఇంట్లోనే చార్జ్ చేసేసుకోవచ్చు. బైక్ ఇంటి బయట పార్క్ చేసుకొని, బ్యాటరీని ఇంట్లోకి తెచ్చుకొని చార్జ్ చేసుకోవచ్చు. రెండు బ్యాటరీలు తీసుకుంటే.. ఒకటి స్కూటర్లో పెట్టుకొని బయటకు వెళ్లి..మరొక దానిని ఇంట్లోనే చార్జ్ పెట్టుకోవచ్చు.
దీనిలో పెడల్ అసిస్ట్ సెన్సార్ ఉంటుంది. ఇది పలురకాల రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఆటోమేటిక్ రైడ్ ప్రిఫరెన్స్ లను ఎంపిక చేసుకోవచ్చు. ఇగ్నిషన్ కీ, హ్యాండిల్ లాక్ సేఫ్టీ ఉంటుంది.
స్పెసిఫికేషన్స్..
యూఆర్బీఎన్ ఈ-బైక్ 1,700ఎంఎం పొడవు, 645ఎంఎం వెడల్పు, 1010ఎంఎం ఎత్తు ఉంటుంది. 40కేజీల బరువు ఉంటుంది. 120 కేజీల బరువను మోయగలుగుతుంది. యూఆర్బీఎన్ ఈ-స్కూటర్ కేవలం 10 సెకండ్ల లోపే గంటకు 25కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది.
దీనిలోని బ్యాటరీ లిథియం అయాన్ టైప్ ఉంటుంది. ఇది పూర్తిగా చార్జ్ అవడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. దీని రేంజ్ సింగిల్ చార్జ్ పై 120 కిలోమీటర్లు వస్తుంది. దీనిలో మోటార్ 36వోల్ట్స్ సామర్థ్యంతో ఉంటుంది. బీఎల్డీసీ రకం 20 అంగుళాల చక్రాలు ఉంటాయి. దీనిలోని మోటార్ 35ఎన్ఎం నుంచి 40ఎన్ఎం వరకూ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే ముందు, వెనుక డిస్క్ బ్రేకులు ఉంటాయి. సస్పెన్షన్ చూస్తే ముందు వైపు స్ప్రింగ్ యూనిట్స్, వెనుకవైపు హైడ్రాలిక్ కాయిల్ స్ప్రింగ్స్ ఉంటాయి. ఇవి రైడర్ కు మంచి సౌకర్యాన్ని అందిస్తాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సిటీ పరిధిలో చక్కగా ఉపయోగపడుతుంది. ఇంట్లో ఆడవారు కూడా ఇంటి అవసరాలను దీనిని వినియోగించుకోవచ్చు. లో స్పీడ్ స్కూటర్ కాబట్టి ఎటువంటి లైసెన్స్, రిజిస్ట్రేషన్ కూడా అవసరం ఉండదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..