Gold Loan: బంగారంపై రుణం తీసుకునే ముందు గుర్తుంచుకోవలసిన విషయాలు..

Gold Loan: బంగారంపై రుణం తీసుకునే ముందు గుర్తుంచుకోవలసిన విషయాలు..
Gold Loan

Gold Loan: సహజంగా మధ్య తరగతికి చెందిన వారు చిన్న మెుత్తంలో లోన్ తీసుకోవడానికి తమ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకుల వద్ద తాకట్టుపెట్టి రుణం పొందుతుంటారు.

Ayyappa Mamidi

|

Feb 10, 2022 | 6:18 PM

Gold Loan: సహజంగా మధ్య తరగతికి చెందిన వారు చిన్న మెుత్తంలో లోన్ తీసుకోవడానికి తమ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకుల వద్ద తాకట్టుపెట్టి రుణం పొందుతుంటారు. కానీ.. అనుకోని సమస్యలు ఎదురైతే లోన్ చెల్లింపులు సమయానికి చేయలేకపోతుంటారు. సహజంగా ఎక్కువ మంది ఇటువంచి సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. వారి అసలు బంగారం విలువకంటే తక్కువ మెుత్తంలో సంస్థల నుంచి రుణాన్ని పొందుతుంటారు. చివరికి సమయానికి వాటి చెల్లింపులు చేయకపోవడంతో తాకట్టు పెట్టిన పూర్తి బంగారాన్ని కోల్పోతుంటారు. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి వచ్చాక అనేక మంది కేవలం మూడు నాలుగు నెలల్లో చెల్లించేద్దామనే ఉద్దేశంతో లోన్ తీసుకుని అనుకోకుండా ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఒక సారి చూడండి. వారు ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తున్నారో ఇక్కడ తెలుసుకోండి.

  • సాధారణంగా బ్యాంకింగ్ సంస్థలు తాకట్టు పెట్టే బంగారం విలువ కన్నా తక్కువ రుణాన్ని ఇస్తుంటాయి. ఇటువంటి సమయంలో బంగారానికి వచ్చే వీలైనంత ఎక్కువ సొమ్మును రుణంగా పొందాలి. దీనివల్ల రుణగ్రహీతకు రిస్క్ తక్కువ.
  • సాధారణంగా బంగారంపై ఇచ్చే రుణాలకు చెల్లింపు కాలం తక్కువగా ఉంటుంది. ఈ రుణాలు ఏడు రోజుల నుంచి గరిష్ఠంగా మూడు సంవత్సరాల కాలపరిమితిని కలిగి ఉంటాయి. రుణ గ్రహీత తనకు అనుకూలంగా ఉండే విధంగా బ్యాంకులు అందించే వివిధ కాలపరిమితుల్లో దేనినైనా ఎంపిక చేసుకోవచ్చు. లోన్ మెుత్తాన్ని ఒకేసారి కాకుండా.. ఈఎమ్ఐల రూపంలో సరళంగా చెల్లించే వెసులుబాట్లు కూడా బ్యాంకింగ్ సంస్థలు ప్రస్తుతం అందిస్తున్నాయి. వాటిని రుణగ్రహీతలు వినియోగించుకోవాలి.
  • బంగారంపై తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీని ముందుగా చెల్లించి.. తరువాత అసలు లోన్ చెల్లింపు చేయవచ్చు. రుణం తీసుకున్నప్పుడు మెుత్తం లోన్ సొమ్ములో 2.5 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజుతో పాటు దానికి అదనంగా 18 శాతం జీఎస్టీ రుణగ్రహీత చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల వినియోగదారులు లోన్ పొందేటప్పుడు ప్రాసెసింగ్ ఫీజు ఎక్కువగా ఉంటే తదరు సంస్థతో మాట్లాడి దానిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. దీనికి అదనంగా వ్యాల్యూయేషన్ ఫీజు కూడా సంస్థలు వసూలు చేస్తుంటాయి.
  • బ్యాంకు సూచించిన సమయానికి లోన్ చెల్లింపులు చేసేందుకు ఏర్పాటు చేసుకోవాలి.. లేకుంటే 2 నుంచి 3 శాతం వరుకు అదనపు ఛార్జీలు వర్తిస్తాయి. దీని వల్ల రుణగ్రహీత క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. వరుసగా మూడు చెల్లింపులు లేటుగా చేస్తే ఎక్కువ పెనాల్టీ పడుతుందని లోన్ కండిషన్లలో ముందుగానే ఉంటుంది. కాబట్టి లోన్ పొందేవారు దీనిని గమనించి అప్రమత్తతో వ్యవహరించాలి.
  • లోన్ పొందినవారు గడువు ముగిశాక 90 రోజుల గ్రేస్ సమయంలోపు బంగారు రుణానికి సంబంధించి చెల్లింపులు పూర్తి చేయకపోతే సదరు సంస్థ ఆ బంగారాన్ని అమ్మేందుకు చట్టపరంగా చర్యలు చేపడుదుంది.

తక్కువ కాలానికి రుణం కావాలనుకున్నప్పుడు మాత్రమే బంగారంపై లోన్ పొందడం ఉత్తమం. ఎక్కువ కాలం కోసం రుణాన్ని పొందాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక కాదు. దీనకి తోడు తక్కువ వడ్డీకి రుణం అందిస్తున్న బ్యాంకింగ్ సంస్థను ఎంచుకోవడం ఉత్తమం. గోల్డ్ లోన్ తీసుకోవాలనుకునే ప్రతిఒక్కరూ ముందుగా ఈ విషయాలను తప్పక పరిగణలోకి తీసుకోవాలని మరచిపోకండి.

ఇవీ చూడండి…

Banks Privatization: బ్యాంకుల ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి?

Credit Score: క్రెడిట్ స్కోర్‌కి వడ్డీ రేటుకి మధ్య సంబంధం ఏమిటి?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu