Top Paid CEO’s: ఫార్చ్యూన్ 500 నివేదిక ప్రకారం టెస్లా, స్పేస్‌ఎక్స్ CEO ఎలాన్ మస్క్ 2021లో అత్యధికంగా 23.5 బిలియన్ డాలర్ల పరిహారం అందుకుంటున్నారు. ఆ తరువాతి స్థానంలో Apple CEO టిమ్ కుక్ 2021లో ఫార్చ్యూన్ 500లో అత్యధికంగా పరిహారం పొందిన CEOల జాబితాలో రెండవ స్థానంలో నిలిచారు. టెక్ మొగల్ 2021లో 770.5 మిలియన్ డాలర్లను అందుకున్నారు.
NVIDIA సహ వ్యవస్థాపకుడు, CEO జెన్సన్ హువాంగ్ 561 మిలియన్ డాలర్ల పరిహారం అందుకుండూ మూడవ స్థానంలో నిలిచారు. అయితే Netflix CEO రీడ్ హేస్టింగ్స్ 453.5 మిలియన్ డాలర్ల పరిహారంతో నాల్గవ స్థానంలో నిలిచారు. రెజెనెరాన్ ఫార్మాస్యూటికల్స్ CEO లియోనార్డ్ ష్లీఫెర్ 452.9 మిలియన్ డాలర్ల పరిహారంతో జాబితాలో ఐదవ స్థానంలో నిలిచారు. మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల 2021లో 309.4 మిలియన్ డాలర్ల పరిహారంతో ప్రపంచంలోనే అత్యధికంగా చెల్లించే ఏడవ CEOగా నిలిచారు.
యాక్టివిజన్ బ్లిజార్డ్ CEO రాబర్ట్ కోటిక్ 296.7 మిలియన్ డాలర్ల పరిహారంతో జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉండగా.. బ్రాడ్‌కామ్ CEO హాక్ E. టాన్ 288 మిలియన్ డాలర్లు, ఒరాకిల్ CEO Safra A. Catz 239.5 మిలియన్ డాలర్లు అందుకుంటూ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక్కడ గమనించదగిన విషయం ఏమిటంటే.. ఎకనామిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ నివేదిక ప్రకారం 2020లో ఒక సగటు పెద్ద కంపెనీ సీఈవో సగటు కార్మికుడి జీతం కంటే 351 రెట్లు ఎక్కువగా సంపాదిస్తున్నారు.