Credit Score: క్రెడిట్‌ స్కోర్‌ తక్కువగా ఉందా? ఈ టిప్స్‌ పాటిస్తే బూస్ట్‌ ఇచ్చినట్లే..

సిబిల్‌ స్కోర్‌ ఎంత ఎక్కువ ఉంటే అంత సులువుగా లోన్లు మంజూరవుతాయి. అలాగే వడ్డీ రేటు కూడా దీని ఆధారంగా నిర్ధారిస్తారు. సాధారణంగా సిబిల్‌ స్కోర్‌ 650 నుంచి 900 మధ్య ఉంటుంది. సగటున 750కి పైన ఈ స్కోర్‌ ఉంటే రుణాలు త్వరగా మంజూరువడంతో పాటు వడ్డీ రేటు తక్కువ పడుతుంది. 750 కన్నా తక్కువ ఉంటే మాత్రం రుణదాతలు మీకు లోన్‌ మంజూరు చేయడానికి ఆలోచిస్తారు.

Credit Score: క్రెడిట్‌ స్కోర్‌ తక్కువగా ఉందా? ఈ టిప్స్‌ పాటిస్తే బూస్ట్‌ ఇచ్చినట్లే..
Credit Score
Follow us
Madhu

|

Updated on: Jan 13, 2024 | 5:30 PM

ఇటీవల కాలంలో రుణాలు తీసుకునే వారి సంఖ్య బాగా పెరిగింది. బ్యాంకర్లు కూడా అతి నిబంధనలు పెట్టకుండా సరళంగా లోన్లు మంజూరు చేస్తుండటంతో అందరూ వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. పర్సనల్‌ లోన్లు, హోమ్‌ లోన్లు, గోల్డ్‌ లోన్లు వంటి వాటిని అధికంగా తీసుకుంటున్నారు. లోన్లలో సాధారణంగా రెండు రకాలుంటాయి. ఎటువంటి గ్యారంటీ లేకుండా మంజూరు చేసే వాటిని అసురక్షిత(అన్‌ సెక్యూర్డ్‌) లోన్లని, బంగారం, ప్రాపర్టీ వంటి వాటిపై మంజూరు చేసే లోన్లను సురక్షిత(సెక్యూర్డ్‌) లోన్లనీ పిలుస్తుంటారు. ఈ సెక్యూర్డ్‌ లోన్లను బ్యాంకర్లు సులువుగానే మంజూరు చేస్తారు గానీ, అసురక్షిత లోన్లను మాత్రం అంత తేలికగా మంజూరు చేయరు. పర్సనల్‌ లోన్లు ఈ పరిధిలోకే వస్తాయి. వీటిని వ్యక్తుల క్రెడిట్‌ రిపోర్టు ఆధారంగా మంజూరు చేస్తుంటారు. ఇది కొన్ని సంస్థలు ఆ వ్యక్తుల ఖాతాల నిర్వహణ, రాబడి, ఖర్చులు, పాత రుణాలు, వాటి చెల్లింపులు వంటి వాటిని ఆధారంగా చేసుకొని రూపొందిస్తాయి. దీనినే క్రెడిట్‌ స్కోర్‌, సిబిల్‌ స్కోర్‌ అని కూడా పిలుస్తుంటారు. ఈ సిబిల్‌ స్కోర్‌ ఎంత ఎక్కువ ఉంటే అంత సులువుగా లోన్లు మంజూరవుతాయి. అలాగే వడ్డీ రేటు కూడా దీని ఆధారంగా నిర్ధారిస్తారు. సాధారణంగా సిబిల్‌ స్కోర్‌ 650 నుంచి 900 మధ్య ఉంటుంది. సగటున 750కి పైన ఈ స్కోర్‌ ఉంటే రుణాలు త్వరగా మంజూరువడంతో పాటు వడ్డీ రేటు తక్కువ పడుతుంది. 750 కన్నా తక్కువ ఉంటే మాత్రం రుణదాతలు మీకు లోన్‌ మంజూరు చేయడానికి ఆలోచిస్తారు. ఒకవేళ మంజూరు చేసిన తక్కువ మొత్తంలోనే లోన్‌ ఇస్తారు. అది కూడా అధిక వడ్డీ రేటును విధిస్తారు. మరి అలాంటప్పుడు ఈ క్రెడిట్‌ స్కోర్‌ ను పెంచుకోవాలంటే ఏం చేయాలి.. ఇది చదవండి..

క్రెడిట్‌ కార్డుతో బాగా పెరుగుతుంది..

మీ క్రెడిట్‌ స్కోర్‌ తక్కువ ఉంటే వెంటనే మీరు ఓ బేసిక్‌ క్రెడిట్‌ కార్డును తీసుకోండి. దీని సాయంతో మీ క్రెడిట్‌ స్కోర్‌ను పెంచుకునే వీలుంది. మీరు కనుక ఉద్యోగి అయితే శాలరీ అకౌంట్‌పై సులభంగానే క్రెడిట్‌ కార్డులుమంజూరు అవుతాయి. ఆ కార్డును పక్కాగా ఉపయోగించడం వల్ల క్రెడిట్‌ స్కోర్‌ పెరుగుతుంది. మీకు లభించిన క్రెడిట్‌ పరిమితిలో కేవలం 30శాతం మాత్రమే వినియోగించుకుంటూ, సకాలంలో బాకీలను చెల్లిస్తూ ఉంటే క్రెడిట్‌ స్కోర్‌కు మంచి బూస్ట్‌ ఇచ్చినట్లు అవుతుంది. ఒకవేళ మీకు శాలరీ అకౌంట్‌ కాకపోతే క్రెడిట్‌ కార్డు మంజూరు కష్టమవ్వొచ్చు. అలాంటి వారు మొదట ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఓపెన్‌ చేసి, దానిపైక్రెడిట్‌ కార్డు తీసుకోవచ్చు.

వస్తువులు లోన్‌ పై తీసుకోండి..

ఏదైనా ఎలక్ట్రానిక్‌ పరికరాలను రుణాల ద్వారా తీసుకునేందుకు ప్రయత్నించండి. ఏదైనా టీవీ లేదా సెల్‌ఫోన్‌ వంటి వాటిని ఈఎంఐ ప్రాతిపదికన తీసుకుంటే ఆరు లేదా ఎనిమిది నెలల్లో వాయిదాలు చెల్లిస్తే మీ క్రెడిట్‌ స్కోరు బాగాపెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

ఇవి గుర్తుంచుకోండి..

రుణాల కోసం అధికంగా దరఖాస్తులు చేయొద్దు. వీటి వల్ల మీ క్రెడిట్‌స్కోర్‌ ప్రభావితం అవుతుంది. అలాగే అప్పు తీసుకునే ముందే వాటిని తిరిగి చెల్లించే శక్తి ఉందా లేదా అనేది అంచనా వేసుకోవాలి. సకాలంలో సక్రమంగా చెల్లించేలా ప్రణాళిక చేసుకోవాలి. ఒకవేళ కట్టలేకపోతే బ్యాంకు వారికి చెప్పి మారటోరియం ను తీసుకోండి. అప్పుడు క్రెడిట్‌ స్కోర్‌ ప్రభావితం కాదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?