Best scooters: స్కూటర్ మార్కెట్‌ను ఏలేది ఆ మూడు స్కూటర్లే.. టాప్ స్కూటర్ ఏదంటే..?

|

Aug 30, 2024 | 3:30 PM

ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు సౌకర్యానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. తమ ప్రయాణానికి అనువుగా ఉండే వాహనాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో ఉండేవారికి బండి చాలా అవసరం. అదే సమయంలో నగరంలోని ట్రాఫిక్ రద్దీ, సిగ్నల్స్ తదితర వాటిని దాటుకుని వెళ్లడానికి అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. ఈ నేపథ్యంలో నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో కూడా స్కూటర్లకు డిమాండ్ పెరిగింది. వీటికి గేర్లు లేకపోవడంతో నడపడం చాలా సులువుగా ఉంటుంది. గేర్ల మార్చే సమయంలో ఇంజిన్ ఆగిపోతుందనే భయం ఉండదు.

Best scooters: స్కూటర్ మార్కెట్‌ను ఏలేది ఆ మూడు స్కూటర్లే.. టాప్ స్కూటర్ ఏదంటే..?
Scooters
Follow us on

ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు సౌకర్యానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. తమ ప్రయాణానికి అనువుగా ఉండే వాహనాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో ఉండేవారికి బండి చాలా అవసరం. అదే సమయంలో నగరంలోని ట్రాఫిక్ రద్దీ, సిగ్నల్స్ తదితర వాటిని దాటుకుని వెళ్లడానికి అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. ఈ నేపథ్యంలో నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో కూడా స్కూటర్లకు డిమాండ్ పెరిగింది. వీటికి గేర్లు లేకపోవడంతో నడపడం చాలా సులువుగా ఉంటుంది. గేర్ల మార్చే సమయంలో ఇంజిన్ ఆగిపోతుందనే భయం ఉండదు. మహిళలు చాలా సులువుగా నడవవచ్చు. కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ వాహనాన్ని వాడుకునే వీలుంటుంది. స్కూటర్లలో టీవీఎస్ జూపిటర్ 110, హోండా యాక్టివా 110, హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 ప్రజల ఆదరణ పొందాయి. వాటి ధర, ఫీచర్లు, మైలేజీ, ఇతర ప్రత్యేకతలను తెలుసుకుందాం.

ధర వివరాలు

ముందుగా ఈ మూడు వాహనాల ధరల వివరాలు తెలుసుకుందాం. టీవీఎస్ జూపిటర్ రూ. 73,700, హోండా యాక్టివా రూ.76,684, హీరో మాస్ట్రో ఎడ్జ్ రూ. 62,750 (ఎక్స్-షోరూమ్) కు అందుబాటులో ఉన్నాయి.

ఫీచర్లు

  • హీరో మాస్ట్రో ఎడ్జ్ లో ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, ఆప్రాన్-మౌంటెడ్ మల్టీ-ఫంక్షన్ కీ స్లాట్, యుటిలిటీ హుక్, సీటు కింద లాక్ చేయగల హుక్, అండర్ సీట్ యూఎస్ బీ ఛార్జర్, బూట్ లైట్ తదితర ఫీచర్లున్నాయి. దీని సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో సర్వీస్ రిమైండర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, ట్రిప్‌ మీటర్ ఏర్పాటు చేశారు.
  • టీవీఎస్ జూపిటర్ లో ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్, కలర్ ఎల్సీడీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ కోసం స్మార్ట్ కనెక్ట్, కాల్/ఎస్ఎంఎస్ హెచ్చరికలు, నావిగేషన్, వాయిస్ అసిస్టెన్స్, మొబైల్ ఛార్జర్, హజార్డ్ లైట్లు తదితర ఫీచర్లు ఉన్నాయి. అలాగే రద్దీగా ఉండే ప్రాంతాల్లో స్కూటర్‌ను గుర్తించడంలో సహాయపడే ఫైండ్ మీ ఫంక్షన్ ఉంది.
  • హోండా యాక్టివా విషయానికొస్తే సైలెంట్ స్టార్ట్‌ కోసం ఏసీజీ స్టార్టర్, ఇంజిన్ కిల్ స్విచ్, ఇంటిగ్రేటెడ్ పాస్ స్విచ్, ఎల్ఈడీ హెడ్‌లైట్ తదితర ఫీచర్లు ఉన్నాయి. హెచ్-స్మార్ట్ వేరియంట్ లో రిమోట్ అన్‌లాకింగ్ అమర్చారు. కానీ బేస్ మోడల్ పూర్తి అనలాగ్ కన్సోల్‌ తో, స్మార్ట్ వేరియంట్ సెమీ డిజిటల్ క్లస్టర్‌తో వస్తుంది.

మైలేజీ

హీరో మాస్ట్రో ఎడ్జ్ 51 కేఎంపీఎల్ మైలేజీ ఇస్తుంది. దీనిలో 5.5 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఉంది. టీవీఎస్ జూపిటర్ మైలేజ్ 64 కేఎంపీఎల్, జాతీయ రహదారిపై ప్రయాణించినప్పుడు 52 కేఎంపీఎల్ మైలేజీ ఇస్తుంది. దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 5.1 లీటర్లు. ఇక హోండా యాక్టివా 47 కేఎంపీఎల్ మైలేజీ అందిస్తుంది. దీనిలో 5.3 లీటర్ ఇంధన ట్యాంక్‌ ఉంది.

ఇవి కూడా చదవండి

స్పెసిఫికేషన్స్

హీరో మాస్ట్రో ఎడ్జ్ 110.9సీసీ ఎయిర్ కూల్డ్, టీవీఎస్ జూపిటర్ 113.3సీసీ, హోండా యాక్టివా 109.51సీసీ ఇంజిన్లతో బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా వస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..