Bike Riding Tips: వర్షాకాలంలో బైక్‌పై టూరా? ఈ టిప్స్ పాటిస్తే సేఫ్‌గా వెళ్లి రావొచ్చు..

ప్రస్తుతం వర్షాకాలం సీజన్ నడుస్తోంది. ఈ సమయంలో బైక్‌లపై టూర్లు ప్లాన్ చేసుకున్నవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ టూర్ ప్లాన్ ఏజెన్సీలు, అనుభవం కలిగిన బైక్ రైడర్లు తెలిపిన జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా మొదటిసారి బైక్ టూర్ ప్లాన్ చేసుకున్నవారు ఈ విషయాలను గుర్తించుకోవాలి.

Bike Riding Tips: వర్షాకాలంలో బైక్‌పై టూరా? ఈ టిప్స్ పాటిస్తే సేఫ్‌గా వెళ్లి రావొచ్చు..
Tips For Monsoon Bike Tour
Follow us
Madhu

|

Updated on: Sep 15, 2024 | 2:43 PM

బైక్ రైడింగ్ అంటే చాలామంది యువతకు ఎంతో ఇష్టం. గుంపుగా, లేదా సింగిల్ వివిధ ప్రాంతాలలో పర్యటించడానికి ఆసక్తి చూపుతారు. కొత్త ప్రాంతాలను సందర్శించడం వల్ల అక్కడి ఆచార వ్యవహారాలు తెలుస్తాయి. బైక్ లపై గుంపులుగా వెళ్లడం వల్ల తోటి వారితో పరిచయం ఏర్పడుతుంది. కొన్ని సంస్థలు ఇటువంటి టూర్లను ప్లాన్ చేస్తాయి. ఆసక్తి కలిగిన వారందరూ వాటి ద్వారా చక్కగా వివిధ ప్రాంతాలలో పర్యటించవచ్చు. ప్రస్తుతం వర్షాకాలం సీజన్ నడుస్తోంది. ఈ సమయంలో బైక్‌లపై టూర్లు ప్లాన్ చేసుకున్నవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ టూర్ ప్లాన్ ఏజెన్సీలు, అనుభవం కలిగిన బైక్ రైడర్లు తెలిపిన జాగ్రత్తలు ఇలా ఉన్నాయి. ముఖ్యంగా మొదటిసారి బైక్ టూర్ ప్లాన్ చేసుకున్నవారు ఈ విషయాలను గుర్తించుకోవాలి.

ఆహ్లాదంగా ఉన్నప్పటికీ..

వర్షాకాలంలో మోటార్ సైకిల్‌పై రైడింగ్ చేయడం చాలా బాగుంటుంది. అదే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఎక్కువే. చిరుజల్లులు కురిసినప్పుడు రోడ్లపై వాహనాలు జారిపోయి ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. వర్షం వల్ల రహదారిపై చమురు, గ్రీజును బయటకు వస్తాయి. వాటితో నీటిపై జారే పొర ఏర్పడుతుంది. వాహనం టైర్ దానిపై వెళ్లినప్పడు జారిపోయే అవకాశం ఉంది. కాబట్టి వర్షం ప్రారంభమైన తర్వాత కొన్ని నిమిషాలు వేచి ఉండాలి.

అధిక వేగం ప్రమాదం..

తడి రోడ్లపై ఎప్పుడూ అధిక వేగంతో వెళ్లకూడదు. దానివల్ల బైక్‌ను నియంత్రించే మీ సామర్థ్యం దెబ్బతింటుంది. రోడ్లపై గుంతలు, ఓపెన్ మ్యాన్‌హోల్స్‌ లో పడిపోయే ప్రమాదం కూడా ఉంది. వర్షాకాలంలో ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు ఆ మార్గంలో పంక్చర్ షాపులు, గ్యారేజీలు, మోటార్‌సైకిల్ కంపెనీ అధీకృత సర్వీస్ సెంటర్‌ల జాబితాను మ్యాప్ చేసుకోవాలి. ప్రథమ చికిత్సకు సంబంధించిన సామగ్రిని తీసుకెళ్లాలి.

ఆరోగ్య సమస్యలు..

వర్షాకాలంలో సాధారణంగా దాహం వేయదు. దీంతో బైక్ రైడర్లు నీరు తాగడం ఆపేస్తారు. దీనివల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. తద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మధ్యలో రెగ్యులర్ వాటర్ బ్రేక్ తీసుకోవడం చాలా ముఖ్యం. చైన్ క్లీనర్, లూబ్‌ని వెంట తీసుకువెళ్లాలి. కొన్ని కిలోమీటర్లకు మీ చైన్‌ను తనిఖీ చేయండి. మెరుగైన ట్రాక్షన్ పొందడానికి టైర్ ప్రెజర్‌ను సాధారణం కంటే తక్కువగా ఉంచండి.

రైడింగ్‌లో జాగ్రత్తలు..

  • తడి రోడ్లపై ఆకస్మిక బ్రేకింగ్‌ తో ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ముందు వాహనానికి నిర్ణీత దూరం పాటించాలి.
  • ఇతర రైడర్లు, ప్రయాణికులకు బాగా కనిపించేలా రిఫ్లెక్టర్‌లతో కూడిన రంగుల రెయిన్ గేర్/జాకెట్‌లను ధరించాలి.
  • తక్కువ వేగంతో ప్రయాణించడం, మలుపుల్లో మరీ వంగకుండా నడపడం చాలా అవసరం.
  • వాటర్ రెసిస్టెంట్ బూట్లు, గ్లోజులు మీకు రక్షణ కల్పిస్తాయి.
  • వాహనం క్లచ్, బ్రేక్ కేబుళ్లు మంచి స్థితిలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి. జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు క్రాస్‌విండ్లు బ్యాలెన్స్‌ కోల్పోయేలా చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్