ఫైర్ బోల్ట్ ఫోనిక్స్.. 240x240 పిక్సెల్ రిజల్యూషన్, 260 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 1.3 అంగుళాల టీఎఫ్టీ కలర్ ఫుల్-టచ్ డిస్‌ప్లేతో ఫైర్ బోల్ట్ ఫోనిక్స్ స్మార్ట్‌వాచ్ ఆకట్టుకుంటోంది. దీనిలోని బ్యాటరీ సామర్థ్యం బ్లూటూత్ కాలింగ్ లేకుండా ఏడు రోజులు, కాలింగ్ చేసుకుంటే నాలుగు రోజులు ఉంటుంది. 120+ స్పోర్ట్స్ మోడ్‌లతో ఫిట్‌నెస్ కు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ నోటిఫికేషన్లు, బిల్ట్-ఇన్ మైక్, స్పీకర్, హెచ్ డీ కాలింగ్ అదనపు ప్రత్యేకతలు. ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ ధర రూ.1,599.