ITR Verification: ఐటీఆర్ ఫైల్ చేశారు సరే.. ఈ పని చేయకపోతే నష్టపోతారు..

ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్ చేసిన తర్వాత దాన్ని ధ్రువీకరించుకోవడం చాలా అవసరం. ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత ఆదాయపుశాఖ దాన్ని అందుకుంటుంది. కానీ ప్రాసెసింగ్ ప్రారంభించదు. ఐటీఆర్ ధ్రువీకరణ అయిన తర్వాత మాత్రమే ప్రాసెసింగ్ ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు ఫైలింగ్ చేసిన 30 రోజుల్లోపు పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ధ్రువీకరించపోతే మీరు ఐటీఆర్ ఫైల్ చేయలేదని భావిస్తారు.

ITR Verification: ఐటీఆర్ ఫైల్ చేశారు సరే.. ఈ పని చేయకపోతే నష్టపోతారు..
Income Tax
Follow us

|

Updated on: Jul 09, 2024 | 4:57 PM

దేశంలో పరిమితికి మించి ఆదాయం పొందేవారందరూ ఆదాయపు పన్ను చెల్లించాలి. ఇది ప్రజల ముఖ్యమైన బాధ్యత. దేశ ప్రగతి, సౌకర్యాల కల్పనకు ఇది దోహదపడుతుంది. దీనిలో భాగంగా ఆదాయపు పన్ను చెల్లించే వారందరూ ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) ఫైల్ చేయాలి. దీనిని ఆ శాఖ ధ్రువీకరించిన తర్వాత మీరు కట్టే పన్నుపై స్పష్టత లభిస్తుంది. కాబట్టి ఐటీఆర్ సమర్పించిన తర్వాత దాని ధ్రువీకరణ అనేది చాలా ముఖ్యం.

జూలై 31 వరకూ గడువు..

2023-24 ఆర్థిక సంవత్సరానికి (అసెసెమెంట్ ఈయర్ 2024-25) ఐటీఆర్ సమర్పించే గడువు దగ్గర పడుతోంది. ఈ నెల 31 వరకూ దీనికి అవకాశం ఉంది. ఐటీఆర్ ధ్రువీకరణ అనేది పన్ను రిటర్న్ ప్రామాణికత, చెల్లుబాటును నిర్ధారించే కీలక దశ. పన్ను రిటర్న్స్ సమర్థంగా అందించడానికి, మోసాలను అరికట్టడానికి, కచ్చితమైన, సురక్షి పన్ను వ్యవస్థ రూపకల్పనకు దోహదపడుతుంది.

అనేక పద్ధతులు..

ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్ చేసిన తర్వాత దాన్ని ధ్రువీకరించుకోవడం చాలా అవసరం. ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత ఆదాయపుశాఖ దాన్ని అందుకుంటుంది. కానీ ప్రాసెసింగ్ ప్రారంభించదు. ఐటీఆర్ ధ్రువీకరణ అయిన తర్వాత మాత్రమే ప్రాసెసింగ్ ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు ఫైలింగ్ చేసిన 30 రోజుల్లోపు పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ధ్రువీకరించపోతే మీరు ఐటీఆర్ ఫైల్ చేయలేదని భావిస్తారు. ఐటీఆర్ ధ్రువీకరణ కు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లో అనేక పద్ధతులు ఉన్నాయి. వాటిని ఉపయోగించి వివరాలు తెలుసుకోవచ్చు.

ఆధార్ ఓటీపీ..

ఆధార్ ఓటీపీని ఉపయోగించి ఇ-ధ్రువీకరణ చేసుకోవచ్చు. ముందుగా మీపాన్ కార్డుతో ఆధార్ ను లింక్ చేసుకోవాలి. అలాగే ఆధార్ కు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ను అనుసంధానించాలి. ఇ-ధ్రువీకరణ పద్ధతులలో ఆధార్ ఓటీపీ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ఆ ఓటీపీని నమోదు చేయాలి.

నెట్ బ్యాంకింగ్..

ముందుగా మీ బ్యాంకుకు సంబంధించిన నెట్ బ్యాంకింగ్ పోర్టల్‌కి లాగిన్ అవ్వండి. పన్ను విభాగం కింద ఐటీఆర్ ను ధ్రువీకరించే ఎంపిక కనిపిస్తుంది. సంబంధిత ఐటీఆర్ ఫాంను ఎంచుకోవాలి. అనంతరం ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు వెళతారు. మీ ఐటీఆర్ దానికదే ధ్రువీకరించబడుతుంది.

బ్యాంక్ ఖాతా..

ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో మీ బ్యాంక్ ఖాతాను నమోదు చేయండి. ఇ- ధ్రువీకరణ పద్ధతులలో బ్యాంక్ ఖాతాను ఎంపిక చేసుకోండి. మీ రిజస్టర్ మొబైల్ కు ఒక ఎలక్ట్రానిక్ ధ్రువీకరణ కోడ్ (ఈవీసీ) వస్తుంది. పోర్టల్ లో ఈ కోడ్ ను నమోదు చేయాలి.

డీమ్యాట్ ఖాతా..

ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో మీ డీమ్యాట్ ఖాతాను ముందుగా ధ్రువీకరణ చేసుకోండి. ఆప్షన్లలో డీమ్యాట్ ఖాతాను ఎంపిక చేసుకోండి. మీ రిజిస్టర్ మొబైల్ కు వచ్చిన ఈవీసీ కోడ్ ను పోర్టల్‌లో నమోదు చేయండి.

ఏటీఎమ్..

ఇ-ఫైలింగ్ సౌకర్యం ఉన్న ఏటీఎమ్ ను సందర్శించండి. మీ ఏటీఎమ్ కార్డును స్వైప్ చేసి, ఆదాయపు పన్ను ఫైలింగ్ కోసం ఈవీసీని రూపొందించే ఆప్షన్ ను ఎంపిక చేసుకోండి. వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు కోడ్ వస్తుంది. దానిని ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేయండి.

డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ (డీఎస్సీ)..

ముందుగా ధ్రువీకరించిన విక్రేత నుంచి డీఎస్ సీ పొందాలి. దానిని ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేయండి. ఐటీఆర్ ఫైల్ చేస్తున్నప్పుడు డీఎస్సీ ఫైల్‌ను అటాచ్ చేయండి.

ఆఫ్‌లైన్ విధానం..

మీకు ఎలక్ట్రానిక్ ధ్రువీకరణ పద్ధతులపై అవగాహన లేకపోతే భౌతిక పద్ధతిని అనుసరించవచ్చు. ముందుగా ఇ-ఫైలింగ్ పోర్టల్ నుంచి ఐటీఆర్ – వి (అక్నాలెడ్జ్‌మెంట్)ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దానిపై నీలి రంగు ఇంకుతో సంతకం చేయాలి. ఐటీఆర్ ఫైల్ చేసిన 30 రోజుల లోపు సంతకం చేసిన ఐటీఆర్-వి ని సాధారణ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా బెంగళూరులోని సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ)కి కేంద్రీకృత ప్రాసెసింగ్ సెంటర్, ఆదాయపు పన్ను శాఖ, బెంగళూరు – 560500, కర్ణాటక, భారతదేశం అనే చిరునామాకు పంపాలి.

ఐటీఆర్ డౌన్ లోడ్ చేసే విధానం..

  • ఇన్ కమ్ ట్యాక్స్ వెబ్ సైట్లోకి లాగిన్ అవ్వండి.
  • రిటర్న్‌లు/ఫారమ్‌లను వీక్షించండి’ విభాగానికి వెళ్లండి.
  • సంబంధిత మదింపు సంవత్సరానికి ఐటీఆర్ – విని డౌన్‌లోడ్ చేయండి.
  • ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోని మీ ప్రొఫైల్‌లో అన్ని వివరాలు, ముఖ్యంగా మొబైల్ నంబర్‌, ఇమెయిల్ చిరునామాలు సరిగ్గా ఉండేటట్టు నిర్ధారించుకోండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..