AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upcoming Two Wheelers: దూసుకొస్తున్న కొత్త టూ వీలర్స్‌.. జనవరిలో ఎన్ని లాంచ్‌లున్నయో తెలుసా..

కొత్త సంవత్సరంలో ఆటోమొబైల్‌ మార్కెట్‌లో కొత్త జోష్‌ నింపుతోంది. పలు టాప్‌ బ్రాండ్లకు చెందిన టూ వీలర్లు లాంచింగ్‌కు రెడీ అయ్యాయి. 2024, జనవరిలోనే పెద్ద ఎత్తున బైక్లు, ‍స్కూటర్లు మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనున్నాయి. వాటిల్లో సంప్రదాయ పెట్రోల్‌ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్‌ వాహనాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఉ‍న్న పలు మోడళ్లలో అప్‌ గ్రేడెడ్‌ వెర్షన్లను కంపెనీలు లాంచ్‌ చేస్తుండగా.. మరికొన్ని నూతన మోడళ్లుగా మార్కెట్లోకి వస్తున్నాయి. వాటిపై లుక్కేద్దాం రండి..

Upcoming Two Wheelers: దూసుకొస్తున్న కొత్త టూ వీలర్స్‌.. జనవరిలో ఎన్ని లాంచ్‌లున్నయో తెలుసా..
Royal Enfield Shotgun 650
Madhu
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 14, 2024 | 10:45 AM

Share

కొత్త సంవత్సరంలో ఆటోమొబైల్‌ మార్కెట్‌లో కొత్త జోష్‌ నింపుతోంది. పలు టాప్‌ బ్రాండ్లకు చెందిన టూ వీలర్లు లాంచింగ్‌కు రెడీ అయ్యాయి. 2024, జనవరిలోనే పెద్ద ఎత్తున బైక్లు, ‍స్కూటర్లు మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనున్నాయి. వాటిల్లో సంప్రదాయ పెట్రోల్‌ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఉ‍న్న పలు మోడళ్లలో అప్‌ గ్రేడెడ్‌ వెర్షన్లను కంపెనీలు లాంచ్‌ చేస్తుండగా.. మరికొన్ని నూతన మోడళ్లుగా మార్కెట్లోకి వస్తున్నాయి. వాటిపై లుక్కేద్దాం రండి..

ఏథర్ 450 ఎపెక్స్..

ఎలక్ట్రిక్‌ స్కూటర్లలో ఏథర్‌ కంపెనీకి మంచి డిమాండ్‌ ఉంది. దీని నుంచి ఏథర్‌ 450 ఎపెక్స్‌ పేరిట కొత్త స్కూటర్‌ లాంచ్‌ కానుంది. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఏథర్‌ 450ఎక్స్‌ కు అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌. దీనిలో మల్టీ-లెవల్ రీజెన్ బ్రేకింగ్, పారదర్శక ప్యానెల్‌లను కూడా పొందే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్‌లు ఓపెన్‌ అయ్యాయి. దీని ధర రూ. 1.60 లక్షలు (ఎక్స్-షోరూమ్ బెంగళూరు, ఫేమ్‌2 సబ్సిడీతో సహా)గా ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650..

రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 మోడల్‌ ను కంపెనీ 2023, డిసెంబర్లో ఆవిష్కరించింది. దీనిని 2024 జనవరిలో మార్కెట్లోకి తీసుకురానున్నారు. సింగిల్-సీట్ సెటప్, రీడిజైన్ చేసిన ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. ఇది సూపర్ మెటోర్ 650 ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. దీని ధర దాదాపు రూ. 3.5 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ఉండే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

హోండా ఎన్‌ఎక్స్‌ 500..

సరికొత్త హోండా ఎన్‌ఎక్స్‌ 500 ఈఐసీఎంఏ 2023లో ఆవిష్కరించారు. అయితే దీనిని ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో మన దేశంలో లాంచ అయ్యే అవకాశం ఉంది. హోండా సీబీ500ఎక్స్‌ సక్సెసర్ రీడిజైన్ చేసిన రూపాన్ని పొందుతుంది, టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ట్రాక్షన్ కంట్రోల్, ఇది 471సీసీ సమాంతర-ట్విన్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్ 47.5పీఎస్‌ మరియు 43ఎన్‌ఎం శక్తిని అందిస్తుంది. దీని ధర రూ. 6.5 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా.

హీరో ఎక్స్‌ట్రీమ్ 210ఆర్..

ఈ బైక్‌ మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్‌తో దూకుడుగా కనిపించే హెడ్‌లైట్ డిజైన్‌ను పొందుతుంది. ఇది కరిజ్మా ఎక్స్‌ఎంఆర్‌ 210సీసీ, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. దీని ధర రూ. 1.60 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరను పొందే అవకాశం ఉంది

హీరో ఎక్స్‌పల్స్ 210..

దీనిలో కూడా కరిజ్మా ఎక్స్‌ఎంఆర్‌ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. స్పై షాట్‌ల నుంచి మిగిలిన ప్రొఫైల్ ఎక్స్‌పల్స్‌ 200 4వీ మాదిరిగానే కనిపిస్తుంది దీని ధర సుమారు రూ. 1.90 లక్షలు, ఎక్స్-షోరూమ్ ఉంటుంది. దీంతో పాటు హీరో ఎక్స్‌ట్రీమ్‌ 125ఆర్‌, హీరో జూమ్‌ 160, హీరో జూమ్‌ 125ఆర్‌, వంటి మరిన్ని మోడళ్లు కూడా మార్కెట్లోకి రానున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..