Marriage: పెళ్లి ఎంత లాభదాయకమో తెలుసా? దంపతులకు కలిగే ఆర్థిక ప్రయోజనాలు ఇవే..

అయితే వివాహంతో బ్యాచిలర్ లైఫ్ నుంచి బయటకొచ్చిన వ్యక్తులు ఖర్చులు పెరుగుతాయని తరచూ ఆలోచిస్తారు. కాని వివాహం వల్ల ఖర్చులు పెరగడం అంటుంచితే.. దాని వల్లే  అనేక ఆర్థిక ప్రయోజనాలు పొందొచ్చు. వాటిల్లో ఇన్సురెన్స్ ప్లాన్లలో రాయితీ, మెరుగైన మార్టగేజ్ అర్హతలు వంటి ఆర్థిక ప్రోత్సాహకాలు అందుతాయి. ఈ ఆర్థిక ప్రయోజనాలు ఇద్దరూ ఆదాయాలు కలిగిన జంటలకు మాత్రమే పరిమితం కాదు.

Marriage: పెళ్లి ఎంత లాభదాయకమో తెలుసా? దంపతులకు కలిగే ఆర్థిక ప్రయోజనాలు ఇవే..
Marriage

Edited By:

Updated on: Nov 01, 2023 | 10:11 PM

మన జీవితాలలో కొన్ని మాత్రం ఒక్కసారే జరిగే వీలుంటుంది. వాటిని చాలా ప్రాధాన్యం ఉంటుంది. దానిపైనే జీవితం ఆధారపడి ఉంటుంది. అలాంటి వాటిల్లో జీవిత భాగస్వామిని ఏర్పాటు చేసుకోవడం. వివాహం అనేది మన సంప్రదాయంలో చాలా పవిత్రమైన, ప్రాముఖ్యమైన అంశం. అందుకే దీనిని జీవితాంతం గుర్తుంచుకునేలా ఆడంబరంగా నిర్వహించుకోవాలని చాలా మంది భావిస్తారు. అయితే పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు.. అది ఓ అపురూప బంధం, రెండు కుటుంబాల సమ్మేళనం, సామాజికంగా తగిన గుర్తింపును అందించే గొప్ప క్రియ. ప్రాణమున్నంత వరకూ ఒకరికొకరు తోడుగా ఉంటామని అగ్ని సాక్షిగా చేసే ప్రమాణాలు ఆ బంధానికి భరోసానిస్తాయి. అయితే వివాహంతో బ్యాచిలర్ లైఫ్ నుంచి బయటకొచ్చిన వ్యక్తులు ఖర్చులు పెరుగుతాయని తరచూ ఆలోచిస్తారు. కాని వివాహం వల్ల ఖర్చులు పెరగడం అంటుంచితే.. దాని వల్లే  అనేక ఆర్థిక ప్రయోజనాలు పొందొచ్చు. వాటిల్లో హెల్త్ ఇన్సురెన్స్ ప్లాన్లలో రాయితీ, మెరుగైన మార్టగేజ్ అర్హతలు వంటి ఆర్థిక ప్రోత్సాహకాలు అందుతాయి. ఈ ఆర్థిక ప్రయోజనాలు ఇద్దరూ ఆదాయాలు కలిగిన జంటలకు మాత్రమే పరిమితం కాదు. వివాహిత జంటలు వివిధ పథకాల ద్వారా ఉమ్మడి ఆదాయాన్ని పొందగలరు. అలాగే వ్యక్తిగత పదవీ విరమణ ఖాతాలకు (ఐఆర్ఏ) సహకారంతో భవిష్యత్తు కోసం మరింత ప్రభావవంతమైన పొదుపులను చేయవచ్చు. ఈ నేపథ్యంలో జంటలు ఉమ్మడిగా పొందే ఆర్థిక ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

వివాహం భార్య భర్తలకు ఉమ్మడి ఆదాయాన్ని అందిస్తుంది. ఇది జంటలను తక్కువ పన్ను పరిధిలో ఉంచే అవకాశం ఉంది. దీంతో వారి మొత్తం పన్ను భారం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో మన దేశంలో వివిధ  ఇన్సురెన్స్, పన్ను మినహాయింపుల నుంచి వివాహిత జంటలు పొందే ఆర్థిక ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం..

గృహ రుణం.. వివాహిత జంటగా హోమ్ లోన్ తీసుకోవడం ద్వారా మీరు పన్ను ఆదా చేసుకోవచ్చు. మీరు ఉమ్మడి గృహ రుణాన్ని తీసుకుంటే, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 (సీ) ప్రకారం, వివాహిత జంటలకు గృహ రుణం యొక్క అసలు మొత్తం తిరిగి చెల్లింపుపై పన్ను మినహాయింపు రూ. 1.5 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెరుగుతుంది. అదేవిధంగా, మీరు వివాహానంతరం గృహ రుణం తీసుకున్నట్లయితే, సెక్షన్ 24 (బీ) ప్రకారం, గృహ రుణంపై వడ్డీ చెల్లింపుపై పన్ను మినహాయింపు జంటలోని ప్రతి వ్యక్తికి సంవత్సరానికి రూ. 2 లక్షల వరకు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఆరోగ్య బీమా.. ఆరోగ్య బీమా తీసుకోవడం ద్వారా మీరు ఆదాయపు పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు. సెక్షన్ 80 (సీ) ప్రకారం, వివాహిత జంట గరిష్టంగా రూ. 25,000 వరకు ఆరోగ్య బీమా కోసం ప్రీమియం చెల్లింపులపై పన్ను మినహాయింపు పొందవచ్చు. వివాహిత జంటలలో ఒకరు పని చేస్తున్నప్పుడు, కుటుంబానికి ఆదాయాన్ని పొందుతున్నప్పుడు మాత్రమే ఈ మినహాయింపు చెల్లుబాటు అవుతుంది. భార్యాభర్తలిద్దరూ పన్ను చెల్లింపుదారులు అయితే, అది రెట్టింపు అవుతుంది. వారు సంవత్సరానికి రూ. 50,000 వరకు ఆరోగ్య బీమా ప్రీమియంలపై పన్ను ఆదా చేసుకోవచ్చు. ఇద్దరూ అధిక-ఆదాయ వ్యక్తులు అయితే ఇది కూడా ఉపయోగపడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..