Paytm: పేటీఎం ఖాతాదారుల్లో గందరగోళం.. మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇదే..
ఖాతాదారుల సందేహాలను, అనుమానాలను తీర్చడానికి పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్ (పీపీబీఎల్) ఇటీవల ఒక జాబితాను విడుదల చేసింది. వినియోగదారులు తరచూ అడుగుతున్న ప్రశ్నలను, వాటి సమాధానాలను దానిలో పొందుపరిచింది. ఆ ప్రకారం పేటీఎం బ్యాంక్‌లో కొత్తగా నగదు డిపాజిట్లు చేయకూడదు. అయితే ఇప్పటికే మన ఖాతాలో ఉన్నడబ్బులను తీసుకోవడానికి, లావాదేవీలు జరపడానికి ఎలాంటి అభ్యంతరం లేదు.
డిజిటల్ పేమెంట్స్‌కు ఆదరణ పెరిగింది. జేబులో డబ్బులు లేకపోయినా మొబైల్ ఫోన్‌ను నుంచి ఉపయోగించి పేటీఎం తదితర వాటి ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయి. ఇది చాలా సులభమైన ప్రక్రియ కావడంతో ప్రజలు కూడా ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)లో అనేక మంది ఖాతాలు ప్రారంభించారు. దాని నుంచి లావాదేవీలు కూడా బాగా పెరిగాయి. అయితే పేటీఎం బ్యాంకులో మార్గదర్శకాల ఉల్లంఘన, నిర్వహణ లోపాల కారణాలతో దాని లావాదేవీలపై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల ఆంక్షలు విధించింది. అవి ఈనెల 15 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆ ప్రకారం పీపీబీఎల్ డిపాజిట్ల సేకరణ, క్రెడిట్ ట్రాన్సాక‌్షన్లు చేయకూడదు. బ్యాంకింగ్, వాలెట్, ఫాస్ట్రాగ్ తదితర సేవలు నిలిపివేయాలి. వీటిపై ఖాతాదారులకు గందరగోళ పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాటిని నివృత్తి చేసేందుకు పేటీఎం వినియోగదారులు తరచూ అడుతున్న ప్రశ్నలు, వాటిని సమాధానాలను అందించింది. అవేంటో చూద్దాం..
జాబితా విడుదల..
ఖాతాదారుల సందేహాలను, అనుమానాలను తీర్చడానికి పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్ (పీపీబీఎల్) ఇటీవల ఒక జాబితాను విడుదల చేసింది. వినియోగదారులు తరచూ అడుగుతున్న ప్రశ్నలను, వాటి సమాధానాలను దానిలో పొందుపరిచింది. ఆ ప్రకారం పేటీఎం బ్యాంక్‌లో కొత్తగా నగదు డిపాజిట్లు చేయకూడదు. అయితే ఇప్పటికే మన ఖాతాలో ఉన్నడబ్బులను తీసుకోవడానికి, లావాదేవీలు జరపడానికి ఎలాంటి అభ్యంతరం లేదు.
- 2024 మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో కొత్త డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలకు అనుమతి లేదు. ఖాతాల్లో డబ్బులు ఉంటే మాత్రం ఉపయోగించవచ్చు, డ్రా చేసుకోవచ్చు లేకపోతే బదిలీ చేయవచ్చు. అందుకోసం డెబిట్ కార్డులను కూడా వాడుకోవచ్చు.
- క్యాష్‌బ్యాక్, వడ్డీ, భాగస్వామి బ్యాంకుల నుంచి స్వీప్-ఇన్‌లు, రీఫండ్‌లకు అనుమతి ఉంది. ఆ సేవలను నిరభ్యంతరంగా పొందవచ్చు.
- ఖాతాలో డబ్బు ఉంటే మాత్రమే లావాదేవీలు చేయగలరు. విత్ డ్రాలు, డెబిట్‌ల కోసం ఆటోమేటిక్ యూపీఐ ఆదేశాలు కొనసాగుతాయి.
- పేటీఎం బ్యాంకు నుంచి యథాతథంగా డబ్బులు విత్‌డ్రా చేయవచ్చు. ఖాతాలో బ్యాలెన్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. రీఫండ్స్, క్యాష్‌బ్యాక్, వడ్డీ వంటివి మీ ఖాతాల్లోకి క్రెడిట్ అవుతుంటాయి. నెలవారీ విద్యుత్ బిల్లులు, ఆటో డెబిట్ సేవలు కొనసాగుతాయి. మీ ఖాతాలో సరిపడే బ్యాలెన్స్ ఉన్నంత వరకూ ఈ సేవలు వినియోగించుకోవచ్చు.
- నగదు జమచేయడం మాత్రం కుదరదు. కానీ నెలవారీ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ చార్జీలు, యూపీఐ ద్వారా ఆటోమెటిక్‌గా కొనసాగుతాయి. రుణాల ఈఎంఐ, ఆటో డెబిట్ ఆప్షన్ ఉంటుంది. ఫాస్టాగ్‌ను కొనసాగించవచ్చు. ఇవి కూడా ఖాతా డబ్బులు ఉన్నంత వరకేనని గమనించాలి.
- యూపీఏ, ఐఎంపీఎస్ ద్వారా పేటీఎం ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.
- నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (ఎన్‌ఏసీహెచ్) నుంచి ఉపసంహరణలు, డెబిట్‌ల కోసం ఆదేశాలు మీ ఖాతా బ్యాలెన్స్ అయిపోయే వరకు అమలు చేయబడతాయి.
- పేటీఎం బ్యాంకు కాకుండా ఇతర బ్యాంకుల్లో నమోదు చేసుకున్న ఈఎమ్‌ఐలు ఇప్పటికీ చెల్లించవచ్చు.
- వాలెట్ లోకి డబ్బులు పంపించడం, టాప్ అప్ చేయడం అందుబాటులో ఉండవు. ఎలాంటి నగదు డిపాజిట్ చేయడానికి వీలుండదు. జీతం క్రెడిట్ జరగదు. పాస్టాగ్ రీచార్జి చేసుకోలేరు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..