
మహిళలు వ్యాపారం చేయడం ద్వారా మంచి ఆదాయం పొందాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఓ చక్కటి వ్యాపార ఐడియాతో మీ ముందుకు వచ్చేసాం. ఈ వ్యాపారం చేయడం ద్వారా మీరు ఇంటి వద్ద ఉండి చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. అంతేకాదు ఈ వ్యాపారం ద్వారా మీ ఖాళీ సమయాన్ని ఉపయోగించుకొని ఇంట్లో పనులు చేసుకుంటూ కూడా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చేయాల్సిన వ్యాపారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ మధ్యకాలంలో కూరలు, బిర్యానీ సహా అన్ని వంటకాల్లో ప్రతి ఒక్కరు గరం మసాలాలను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ గరం మసాలాలను తయారు చేసేందుకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలను వాడాల్సి ఉంటుంది. ఈ సుగంధ ద్రవ్యాలు మార్కెట్లో మనకు విడిగా లభిస్తాయి. తద్వారా మీరు అతి తక్కువ ధరకే, ఇంట్లోనే గరం మసాలా ను తయారు చేసుకోవచ్చు. . అయితే ఈ గరం మసాలాను ఒక వ్యాపార అవకాశం కూడా మీరు మార్చుకోవచ్చు.
హోటళ్లు రెస్టారెంట్లు దాబాలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలలో ఈ గరం మసాలా పొడికి చాలా డిమాండ్ ఉంది. మీరు నాణ్యమైన గరం మసాలా పొడిని తక్కువ ధరకు గనుక సప్లై చేసినట్లయితే, మంచి ఆదాయం పొందవచ్చు. మీరు ఇంట్లో ఉండే కమర్షియల్ స్కేల్ లో గరం మసాల పొడిని తయారు చేసి విక్రయించవచ్చు. ఇందుకోసం కేవలం ఒక గదిని కేటాయిస్తే సరిపోతుంది.
మీరు మార్కెట్లోనే మసాలా డ్రై గ్రైండర్ ను కొనుగోలు చేసి గరం మసాలా విక్రయించవచ్చు. ఈ కమర్షియల్ గ్రైండర్ ధర సుమారు 15 వేల రూపాయల నుంచి 50 వేల రూపాయల వరకు ఉంటుంది. దీన్ని మీరు ఆన్లైన్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ గ్రైండర్లో మీరు మీకు కావాల్సిన సుగంధ ద్రవ్యాలను వేసి పొడి చేయడం ద్వారా గరం మసాలాను తయారు చేయవచ్చు. ఇక గరం మసాలా ప్యాకింగ్ కోసం ఒక ప్యాకింగ్ మెషిన్ కూడా కొనుగోలు చేయవచ్చు ఈ ప్యాకింగ్ మిషన్ ధర సుమారు పదివేల నుంచి ప్రారంభం అవుతుంది. సెమీ ఆటోమేటిక్, పులి ఆటోమేటిక్ ఇలా రెండు రకాలుగా ఈ ప్యాకింగ్ మిషన్ ధరలు ఉంటాయి.
ఇక మీరు వ్యాపారం విషయానికి వచ్చినట్లయితే, ముందుగా మీ సమీపంలో ఉన్నటువంటి రెస్టారెంట్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కర్రీ పాయింట్స్ లో ఈ గరం మసాలా పొడులను విక్రయించవచ్చు. ముఖ్యంగా గరం మసాలా లో వాడే మసాలా దినుసులను మీరు హోల్సేల్ మార్కెట్లో కొనుగోలు చేయాలి క్వాలిటీ మసాలా దినుసుల కోసం మీరు కేరళకు రాష్ట్రానికి వెళ్లి తెచ్చుకుంటే మంచిది. అక్కడ చాలా తక్కువ ధరకే మసాలా దినుసులు లభిస్తాయి అలాగే చాలా నాణ్యమైన దనుసులు మీకు ఉంటుంది లభిస్తాయి. వాటిని మీరు పొడి చేసి విక్రయించడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.
మీకు డిమాండ్ పెరిగే కొద్దీ గరం మసాలా యూనిట్ ను మరింత విస్తరిస్తే మంచిది ఇందుకోసం పెట్టుబడి కావాలంటే ప్రధానమంత్రి ముద్ర యోజన కింద పది లక్షల రూపాయల వరకు రుణం పొందే అవకాశం ఉంది. మీకు వ్యాపారం బాగా జరిగితే నెలకు ఒక లక్ష రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంది.
మరిన్ని వ్యాపార సంబంధిత వార్తల కోసం…