Airtel prepaid: ఎయిర్ టెల్ నుంచి అదిరిపోయే రీచార్జ్ ప్లాన్లు.. 56 రోజుల వ్యాలిడిటీ.. మరిన్ని ఆకర్షణీయ ప్రయోజనాలు..
ఈ క్రమంలో మరికొన్ని బడ్జెట్ లెవల్ లో ప్రీ పెయిడ్ ప్లాన్ల తీసుకొచ్చింది. 56 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్లు వస్తున్నాయి. రూ. 479, రూ. 549, రూ. 699 చొప్పున ఈ ప్లాన్లు ఉండనున్నాయి. వీటిలో అదనంగా రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తుంది.
భారతీ ఎయిర్ టెల్ తన వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది. నాణ్యతలో రాజీ లేకుండా మంచి అనుభూతిని తన వినియోగదారులకు అందిస్తుంది. ఈ క్రమంలో మరికొన్ని బడ్జెట్ లెవల్ లో ప్రీ పెయిడ్ ప్లాన్ల తీసుకొచ్చింది. 56 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్లు వస్తున్నాయి. రూ. 479, రూ. 549, రూ. 699 చొప్పున ఈ ప్లాన్లు ఉండనున్నాయి. వీటిలో అదనంగా రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తుంది. అంతేకాక యాడ్ ఆన్ ప్రయోజనాలతో దాదాపు రెండు నెలల పాటు వ్యాలిడిటీ కొనసాగించుకునే అవకాశం ఉంది. ఇంకా ప్లాన్ల గురించిన మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఎయిర్‌టెల్ రూ. 479 ప్లాన్..
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 56 రోజులు చెల్లుబాటు అవుతుంది. అంతేకాక అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 SMSలను అందిస్తుంది. 56 రోజుల పాటు రోజుకు 1.5 GB డేటా ఇంటర్ నెట్ వినియోగించుకోవచ్చు. వినియోగదారులు ఫ్రీ వింక్ మ్యూజిక్ , అపోల్లో 24/7 సర్కిల్, ఫ్రీ హాలో ట్యూన్స్ వంటి వాటితో పాటు ఫాస్టాగ్ చెల్లింపుల్లో క్యాష్ బాక్ వంటి ప్రయజనాలు పొందుతారు.
ఎయిర్‌టెల్ రూ. 549 ప్లాన్..
ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు. ఇది కూడా రోజుకు 100 ఎస్ఎంఎస్ లను అందిస్తుంది. ఇంటర్ నెట్ కోసం 56 రోజుల పాటు రోజుకు 2 GB డేటా ఇస్తుంది.. వినియోగదారు వింక్ మ్యూజిక్ ఫ్రీ, అపోల్లో 24/7 సర్కిల్, ఫ్రీ హాలో ట్యూన్స్ వంటి యాప్‌లతో పాటుగా ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ యాప్‌కు యాక్సెస్‌ను పొందుతారు. ఒక ఎంపిక చేసిన Xstream ఛానెల్ ఉచితంగా, అలాగే ఫాస్టాగ్ చెల్లింపులపై క్యాష్‌బ్యాక్ పొందగలుగుతారు.
ఎయిర్‌టెల్ రూ. 699 ప్లాన్..
దీనిలో వినియోగదారులు 56 రోజుల పాటు రోజుకు 3 GB డేటాను పొందుతారు. ఇది రోజుకు 100 SMSలను అందిస్తుంది యూజర్‌కి అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. వినియోగదారులు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్, ఒక ఎయిర్‌టెల్ వింక్ మ్యూజిక్ ఫ్రీ, ఎక్స్‌స్ట్రీమ్ ఛానెల్‌ని ఉచితంగా ఎంచుకోవచ్చు. అపోలో 24 /7 సర్కిల్, ఫాస్టాగ్ ఉచిత హెలోట్యూన్స్, క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలను పొంద వచ్చు.
అదనపు ప్రయోజనాలు..
వినియోగదారులు యాపిల్ ఐ ఫోన్ 14ని గెలుచుకునే అవకాశాన్ని ఎయిర్ టెల్ అందిస్తోంది. దీని కోసం వినియోగదారులు వారి ప్లాన్‌లో ఎక్స్ ట్రీ మ్ యాప్ లో Hoichoiని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇది రూ. 549 మరియు రూ. 699 ప్లాన్లపై మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..