Hero EV Scooters: హీరో ఈవీ స్కూటర్ల ధరలు తగ్గాయోచ్చ్… ఆ రెండు స్కూటర్లపై ఏకంగా రూ.25 వేల తగ్గింపు

|

May 07, 2023 | 9:15 PM

గతేడాది అక్టోబర్‌‌లో హీరో మోటోకార్ప్ కొత్త ఈవీ అనుబంధ సంస్థ అయిన విడా మార్కెట్‌లో వీ1, వీ1 ప్రో రెండు స్కూటర్లను లాంచ్ చేసింది. లాంచింగ్ సమయంలో విడా వీ1 ధర రూ.1.45 లక్షలు, విడా వీ1 ప్రో ధర రూ.1.59 లక్షలుగా కంపెనీ పేర్కొంది. మార్కెట్‌లో ఇతర స్కూటర్ల నుంచి పెరిగిన పోటీని తట్టుకునేందుకు తాజాగా ఈ రెండు మోడల్స్‌పై ధరలను తగ్గించారు.

Hero EV Scooters: హీరో ఈవీ స్కూటర్ల ధరలు తగ్గాయోచ్చ్… ఆ రెండు స్కూటర్లపై ఏకంగా రూ.25 వేల తగ్గింపు
Hero Vida V1
Follow us on

భారతదేశంలో ప్రస్తుతం ఈవీ వాహనాల ట్రెండ్ నడుస్తుంది. టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకూ ప్రతిఒక్కరూ మార్కెట్‌లో తమ కంపెనీ నుంచి ఈవీ వాహనాలను లాంచ్ చేశాయి. ముఖ్యంగా పెట్రోల్ వాహన అమ్మకాల్లో తన మార్క్ చూపిస్తున్నహీరో ఈవీ వాహనాలను కూడా రిలీజ్ చేసింది. అయితే హీరో ఈవీ స్కూటర్లు ధర కాస్త ఎక్కువగా ఉండడంతో సగటు మధ్య తరగతి వాళ్లు ఈ స్కూటర్ కొనుగోలుకు కాస్త వెనుకడుగు వెేశారు. ముఖ్యంగా గతేడాది అక్టోబర్‌‌లో హీరో మోటోకార్ప్ కొత్త ఈవీ అనుబంధ సంస్థ అయిన విడా మార్కెట్‌లో వీ1, వీ1 ప్రో రెండు స్కూటర్లను లాంచ్ చేసింది. లాంచింగ్ సమయంలో విడా వీ1 ధర రూ.1.45 లక్షలు, విడా వీ1 ప్రో ధర రూ.1.59 లక్షలుగా కంపెనీ పేర్కొంది. మార్కెట్‌లో ఇతర స్కూటర్ల నుంచి పెరిగిన పోటీని తట్టుకునేందుకు తాజాగా ఈ రెండు మోడల్స్‌పై ధరలను తగ్గించారు. విడా వీ1 ధరను రూ.25000 వరకూ తగ్గించారు. అలాగే వీ 1ప్రో ధర రూ.19000 తగ్గించారు. తాజా ధర తగ్గింపు తర్వాత విడా వీ1 ధర రూ. 1.20 లక్షలు, విడా వీ1 ప్రో మీకు రూ. 1.40 లక్షలుగా ఉంది. దీనికి అదనంగా కొన్ని రాష్ట్రాలు ఎలక్ట్రిక్ వాహనాలపై అదనపు సబ్సిడీలను అందిస్తాయి. దీంతో సబ్సిడీకి అనుగుణంగా ఈ స్కూటర్ల ధరలు మరింత తగ్గుతాయి. 

ముఖ్యంగా విడా వీ1కు పోటినిస్తున్న ఎథెర్ 450 ఎక్స్ ధర కూడా గత నెలలో తగ్గించారు. దీంతో విడా వీ 1 ధర కూడా హీరో కంపెనీ తగ్గించిందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే ఓలా ఎస్ 1 సిరీస్‌లో స్కూటర్ల ధర కూడా రూ.85000 నుంచి ప్రారంభం అవ్వడంతో మార్కెట్‌లో పోటీను తట్టుకునేందుకు హీరో ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొంటున్నారు. ఈ భారీ తగ్గింపు ఈ స్కూటర్ల సేల్స్ కూడా గణనీయంగా వృద్ధి చెందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే విడా వీ 3.44 బ్యాటర్ ప్యాక్‌తో వస్తుంది. అలాగే ఓ సారి చార్జ్ చేస్తే 143 కిలో మీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. అలాగే వీ1 ప్రో 3.94 బ్యాటరీ ప్యాకప్‌తో ఒక్కసారి చార్జ్ చేస్తే 165 కిలో మీటర్ల పరిధి వచ్చేలా ఈ స్కూటర్‌ను రూపొందించారు. బ్యాటరీ సామర్థ్యంలో వ్యత్యాసం ఉన్నప్పటికీ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు 6 కేడబ్ల్యూ గరిష్ట శక్తిని ఇచ్చే మోటారునే వాడారు. అలాగే విస్తృతమైన డీలర్‌షిప్‌ల వల్ల తాజా తగ్గింపుతో విడా వీ1, వీ1 ప్రో స్కూటర్ల సేల్స్ పెరుగుతాయని కంపెనీ అంచనా వేస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..