New IT Act: కేంద్రం కీలక నిర్ణయం.. మారనున్న ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. అమల్లోకి కొత్త ఐటీ చట్టం

కొత్త ఐటీ చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. 1961లో అప్పటివరకు ఉన్నవాటిల్లో మార్పులు చేసి కొత్త చట్టం అమల్లోకి తెచ్చారు. ఇప్పుడు వాటిల్లో కూడా మార్పు చేసి సరికొత్త చట్టం తీసుకురానున్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ చట్టం అమలు చేయనున్నారు.

New IT Act: కేంద్రం కీలక నిర్ణయం.. మారనున్న ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. అమల్లోకి కొత్త ఐటీ చట్టం
Income Tax Department

Updated on: Dec 15, 2025 | 6:15 PM

ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 19వ తేదీ వరకు జరగనున్న సమావేశాల్లో పలు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించనుంది. మహాత్మాగాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చే కీలక బిల్లుతో పాటు మరికొన్ని బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో కొత్త ఆదాయపు పన్ను చట్టం ఎప్పటినుంచి అమలు చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఆదాయపు పన్ను చట్టం 2025 ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం పొందగా.. కొత్త ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుంది. ఈ చట్టంలో ఏవేం ప్రత్యేకలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

సెక్షన్లు తగ్గింపు

గతంలో ఆదాయపు పన్ను చట్టంలో ఉన్న 47 చాప్టర్లను 23కి తగ్గించారు. అలాగే 819 సెక్షన్లను 536కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక షెడ్యూల్ సంఖ్య 16కి పరిమితం చేశారు. సెక్షన్ 10లో ఉన్న అన్ని మినహాయింపులను షెడ్యూల్స్‌లో చేర్చారు. వాడుకలో లేని పదాలను ఇప్పుడు తొలగించారు. ఇక ఇప్పటివరకు ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించేటప్పుడు ఆర్ధిక సంవత్సరం సెలక్ట్ చేసేటప్పుడు కన్‌ప్యూజన్ ఉండేది. అస్సెస్సుమెంట్ ఇయర్, ఫైనాన్సియల్ ఇయర్ వంటివి ఉండేవి. వీటి విషయాల్లో చాలా తికమక ఉండేది. కానీ ఇక నుంచి పన్ను సంవత్సరం అనేది పదం ఉపయోగించన్నారు. ఇక టీడీఎస్ అన్ని అంశాలను ఒకే సెక్షన్‌లో చేర్చారు. అలాగే ఇప్పటివరకు ఐటీ రైడ్స్ అంటే ఆఫీసులు, ఇళ్లు వాటిని ఎంచుకునేవారు. ఇకపై ఈమెయిల్స్, సోషల్ మీడియా అకౌంట్లు, క్లౌడ్ సర్వర్లు అననీ చెక్ చేయనున్నారు.

పాత పదజాలానికి ఎండ్ కార్డ్

ఇన్‌కమ్ ట్యాక్స్‌లో ఉపయోగించే పాత పదజాలానికి బదులు ఆధునిక పరిస్ధితులకు అనుగుణంగా కొత్త పదజాలాన్ని అందుబాటులోకి తెచ్చారు. అలాగే క్రిప్టో, వర్చువల్, డిజిటల్ కరెన్సీకి కూడా హక్కులు వచ్చేలా కొత్త ఐటీ చట్టం రూపొందించారు. ఇక ఐటీ అధికారులకు రైడ్స్ విషయంలో విస్తృత అధికారులు కల్పించారు. ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. వచ్చే ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఐటీ చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నారు.