AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric cars: మార్కెట్ రేసులో ఎలక్ట్రిక్ కార్ల వెనుకంజ.. ఈ విభాగంలో స్కూటర్లదే దూకుడు

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ఈ విభాగంలో ద్విచక్ర వాహనాలు, కార్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పెట్రోలు, డీజిల్ వెహికల్స్ కు ప్రత్యామ్నాయంగా ఇవి తెరపైకి వచ్చాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, పర్యావరణహితం, తక్కువ నిర్వహణ తదితర కారణాలతో వీటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అయితే తన దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాలు బాగున్నప్పటికీ, కార్లు మాత్రం వెనుక బడ్డాయి. దీనికి గల కారణాలను తెలుసుకుందాం.

Electric cars: మార్కెట్ రేసులో ఎలక్ట్రిక్ కార్ల వెనుకంజ.. ఈ విభాగంలో స్కూటర్లదే దూకుడు
Electric Vehicles
Nikhil
|

Updated on: Dec 18, 2024 | 6:42 PM

Share

వాహనాల అమ్మకాల పరంగా ప్రపంచంలో మూడోస్థానంలో మన దేశం ఉంది. అత్యధిక జనాభా, సుస్థిర రాజకీయ వ్యవస్థ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో ప్రగతి, ప్రజల ఆదాయాలు మెరుగ్గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్లు వినియోగం విపరీతంగా పెరగాలి. కానీ అందుకు భిన్నంగా విక్రయాలు సాగుతున్నాయి. వీటి వినియోగంలో చైనాలో 30 శాతం, అమెరికాలో 12 శాతానికి పైగా ఉండే, మన దేశంలో మాత్రం ఏడు కంటే తక్కువగా ఉంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం క్రమంగా పెరుగుతోంది. అది కేవలం స్కూటర్లకు పరిమితమైంది. కార్ల వినియోగం అతి తక్కువగా ఉంది. భారతీయ మార్కెట్ లో టాటా మోటార్స్ ఆధిపత్యం చెలాయిస్తోంది. దాని వెనుక హ్యుందాయ్, మహీంద్రా, కియా, జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్స్ ఉన్నాయి. దేశంలో 2030 నాటికి ఈవీల శాతం 30కి పెరగాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇది కొంచె కష్టమే అయినప్పటికీ ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లాలని భావిస్తోంది.

ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోల్చితే కార్ల ధరలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉండే మన దేశంలో వాటిని కొనుగోలు చేయడం కష్టం. దీంతో చాలామంది ద్విచక్ర వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం దేశంలో అత్యంత చౌకయిన ఎలక్ట్రిక్ కారు ఎంపీ కామెట్. దీని ధర రూ.7 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇది కూడా పరిమిత పరిధి కలిగి, నగరాల్లో తిరగడానికి వీలుగా ఉండే కారు. ఆ తర్వాత టాటా టియాగో రూ.8 లక్షల నుంచి అందుబాటులో ఉంది. దీన్ని ఒక్కసారి చార్జింగ్ చేస్తే కేవలం 300 కిలోమీటర్ల రేంజ్ మాత్రమే వస్తుంది.

దేశంలోని వెయ్యి మందిలో కేవలం 26 మంది మాత్రమే కార్లను వినియోగిస్తున్నారు. మిగిలిన వారికి ద్విచక్ర వాహనాలు, ప్రభుత్వ రవాణా సాధనాలే శరణ్యం. ఇక ఎలక్ట్రిక్ కార్లన్నీ పట్టణ ప్రాంతాలకే పరిమితమయ్యాయి. మేజర్ పంచాయతీలలో పాటు గ్రామాల స్థాయికి పూర్తిస్థాయిలో చేరలేదనే చెప్పాలి. ఎలక్ట్రిక్ వాహనాలకు బ్యాటరీ చాలా కీలకం. ఆధునిక టెక్నాలజీతో బ్యాటరీ సామర్థ్యం పెరుగుతున్న నేపథ్యంలో దాని ఖర్చులు తగ్గుతున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈవీల ధరలు తగ్గుముఖం పట్టాయి. అలాగే మారుతీ సుజుకీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ వీ విటారాను జనవరిలో జరిగే మొబిలిటీ ఎక్స్ పోలో విడుదల చేయడానికి సిద్దమైంది. మహీంద్రా నుంచి బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ, హ్యుందాయ్ నుంచి క్రెటా ఈవీ కూడా మార్కెట్ లోకి రానున్నాయి. మరికొన్ని లగ్జరీ కార్ల బ్రాండ్ల నుంచి వాహనాలు విడుదల కానున్నాయని సమాచారం. అలాగే పబ్లిక్ చార్జింగ్ పాయింట్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బ్యాటరీ టెక్ డెవలప్మెంట్ కూడా మెరుగుపడుతోంది. ఇదే జరిగితే ఎలక్ట్రిక్ కార్లు లాంగ్ డ్రైవ్ కు చాాలా అనుకూలంగా ఉంటాయి. వాటిని వినియోగం పెరిగి, విక్రయాలు కూడా జోరందుకుంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి