TechMahindra: ఉద్యోగులను భారీగా తగ్గించనున్న ప్రముఖ ఐటీ కంపెనీ.. ఆదాయం పెరిగినా ఎందుకు ఇలా చేస్తుందంటే..
Tech Mahindra Reducing Employees: ప్రముఖ టెక్ దిగ్గజం టెక్ మహీంద్ర తమ ఉద్యోగులకు భారీ సంఖ్యలో ఉద్వాసన పలికేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్‌సోర్సింగ్ (బీపీఓ) ఉద్యోగులను ఏకంగా..
Tech Mahindra Reducing Employees: ప్రముఖ టెక్ దిగ్గజం టెక్ మహీంద్ర తమ ఉద్యోగులకు భారీ సంఖ్యలో ఉద్వాసన పలికేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్‌సోర్సింగ్ (బీపీఓ) ఉద్యోగులను ఏకంగా 5000 మందిని తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో బీపీఓ ఉద్యోగులను 38000కు పరిమితం చేయాలని సంస్థ భావిస్తోంది. ఆదాయం తగ్గింది కాబోలు అందుకే ఉద్యోగులను తీసేయాలనుకుంటున్నారు అనుకుంటే మాత్రం మీరు పొరబడినట్లే. ఎందుకంటే.. సెప్టెంబరు త్రైమాసికంతో పోలిస్తే అక్టోబరు-డిసెంబరులో కంపెనీ ఆదాయం 11 శాతం పెరిగింది. అయినా కూడా కంపెనీ 2500 మందిని తొలగించింది. దీనికి కారణం బీపీఓ సేవల్లో ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అనలిటిక్స్ విధానాన్ని అమలు చేయడమే. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా నిర్దేశించుకున్న లక్ష్యాలు పూర్తికావడంతో, ప్రస్తుతం ఉన్నంతమేర సిబ్బంది అవసరం లేదనే అభిప్రాయానికి కంపెనీ వచ్చింది. గతంలో బీపీఓ అంటే కేవలం కాల్ సెంటర్లు మాత్రమే ఉండేవి కానీ ఇప్పుడు టెక్నాలజీ సహాయంతో.. విదేశీ ఖాతాదారులకు కొన్ని రకాల సేవలను కూడా వీటితోనే అందించగలుగుతున్నారు. ఇక లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నందున, కొన్ని అద్దె భవనాలను ఖాళీ చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
Also Read: Elon Musk : బిట్ కాయిన్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించిన టెస్లా సీఈఓ ఈలాన్ మస్క్