Moon lighting: ఒకేసారి రెండు కంపెనీలకు పని చేయడం నైతినతకు సంబంధించిన విషయం.. మూన్‌ లైటింగ్‌పై TCS సీఓఓ వ్యాఖ్యలు..

Moon lighting: ఓవైపు కరోనా మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని అతలా కుతలం చేస్తే ఐటీ ఉద్యోగులకు మాత్రం కలిసొచ్చింది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానంతో చాలా మంది ఉద్యోగులు సొంతూళ్లకు వెళ్లి ఎంచక్కా పని చేసుకుంటున్నారు. అయితే...

Moon lighting: ఒకేసారి రెండు కంపెనీలకు పని చేయడం నైతినతకు సంబంధించిన విషయం.. మూన్‌ లైటింగ్‌పై TCS సీఓఓ వ్యాఖ్యలు..
Moon Lighting

Updated on: Aug 27, 2022 | 6:17 PM

Moon lighting: ఓవైపు కరోనా మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని అతలా కుతలం చేస్తే ఐటీ ఉద్యోగులకు మాత్రం కలిసొచ్చింది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానంతో చాలా మంది ఉద్యోగులు సొంతూళ్లకు వెళ్లి ఎంచక్కా పని చేసుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో మూన్‌ లైటింగ్ అనే ఓ వివాదం తెరపైకి వచ్చింది. ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూనే మరో కంపెనీ కోసం పనిచేయడాన్ని మూన్‌ లైటింగ్ విధానంగా అభివర్ణిస్తున్నారు. కరోనా సమయంలో వర్క్‌ ఫ్రమ్‌ హోం కావడంతో కొందరు ఉద్యోగులు ఒకేసారి రెండు కంపెనీల ఉద్యోగాలు చేస్తూ రెండు చేతులా సంపాదించుకున్నారు. దీంతో ప్రస్తుతం అంశం వివాదాస్పంద మారింది. ఇప్పటికే ఈ అంశంపై స్పందించిన విప్రో సీఈఓ ప్రేమ్జీ మూన్‌లైటింగ్‌ విధానం కంపెనీలను మోసగించడమే అని అభివర్ణించగా తాజాగా దీనిపై టీసీఎస్‌ సీఓఓ గణపతి సుబ్రమణియన్‌ స్పందించారు.

ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మూన్‌లైటింగ్‌ ఉద్యోగుల నైతికతకు సంబంధించిన అంశమని వ్యాఖ్యానించారు. స్వల్పకాలిక ప్రయోజనాల కోసం ఇలాంటి విధానాన్ని అవలంభిస్తే దీర్ఘ కాలంలో నష్టం చేకూరుస్తుందని హెచ్చరించారు. ఇటువంటి వాటిని అనుమతించకూడదని ఆయన సూచించారు. ఇక వ్యాపారం అనేది ఎప్పుడూ కోన్ని పరిమితులకు లోబడి ఉంటాయని గణపతి తెలిపారు. ఇక కరోనా సమయంలో 90 శాతం కంపెనీలు నియమాకాలు చేపట్టకపోతే, టీసీఎస్‌ వంటి కొన్ని సంస్థలు మాత్రమే ఉద్యోగులను తీసుకున్నాయని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..