Tax On Gold: బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా..? వచ్చే ఆదాయంపై పన్ను విధిస్తారా..? నిబంధనలు ఏమిటి?

భారతీయులలో భవిష్యత్తు కోసం బంగారం సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా మహిళలకు ఇది వారి వృద్ధాప్య ఆసరా అని చెప్పవచ్చు. ఇప్పుడు..

Tax On Gold: బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా..? వచ్చే ఆదాయంపై పన్ను విధిస్తారా..? నిబంధనలు ఏమిటి?
Tax On Gold

Updated on: Nov 30, 2022 | 5:15 PM

భారతీయులలో భవిష్యత్తు కోసం బంగారం సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా మహిళలకు ఇది వారి వృద్ధాప్య ఆసరా అని చెప్పవచ్చు. ఇప్పుడు త్వరలో ప్రభుత్వం బంగారం ఆదాయంపై పన్ను విధానాన్ని మార్చే అవకాశం ఉంది. పన్ను నిబంధనల ప్రకారం.. భారతదేశం కొన్ని ఆస్తుల కేటగిరీని మార్చవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇందులో బంగారం కూడా ఉంది. ఇప్పుడు మూలధన లాభాలు పన్ను వర్గంలో ఉంచవచ్చు.

ఈ విషయంలో ఐఐఎఫ్‌ఎల్‌కు చెందిన అనూజ్ గుప్తా మాట్లాడుతూ.. భారత్‌లో బంగారం కొనుగోళ్లు చాలా వరకు నగదు రూపంలోనే జరుగుతాయని చెప్పారు. అటువంటి పరిస్థితిలో ప్రజలు బంగారం ద్వారా తమ ఆదాయాన్ని నికర ఆదాయం రూపంలో మాత్రమే చూపుతారు. కొత్త విధానంలో బంగారాన్ని క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ గూడ్స్‌గా చూపించే అవకాశం ఉంది. దీనివల్ల బంగారంపై పెట్టుబడులను ట్రాక్ చేయడం ప్రభుత్వానికి సులభతరం అవుతుంది.

మూలధన రాబడి పన్ను ఒక స్థిర వ్యవధిలో ఆస్తి నుండి సంపాదించిన ఆదాయంపై విధించబడుతుంది. ఇందులో షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ నుండి వచ్చే ఆదాయం ఉంటుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) వివరాల ప్రకారం.. గోల్డ్‌ కొనుగోలు చేయడానికి వెచ్చిస్తున్న మొత్తం ఎలా సంపాదించారనే దానిపై పన్ను పడుతుందనేది ఆధారపడి ఉంటుంది. వ్యవసాయం, ఇంట్లో పొదుపు చేసిన సొమ్ముతో బంగారం కొనుగోలు చేసినా, వారసత్వంగా వచ్చిన అభరణాలపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. నిబంధనల ప్రకారం.. ఓ వివాహిత తన ఇంట్లో 500 గ్రాములు, అవివాహిత ఇంట్లో 250 గ్రామలు బంగారం లేదా నగలు ఉండవచ్చు. ఈ వ్యవధిలోపల ఉన్న బంగారానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే సోదాల్లో ఈ పరిమితి లోపు బంగారం దొరికినట్లయితే అధికారులు దానిని సీజ్‌ చేయడానికి వీలుండదు.

ఇవి కూడా చదవండి

మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం తర్వాత మీ దగ్గరున్న గోల్డ్‌ను అమ్మినట్లయితే అది దీర్ఘకాలిక పెట్టుబడి కిందకు వస్తుంది. అలాంటి సమయంలో వచ్చిన మొత్తంపై 20 శాతం వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు చెబుతున్నాయి. ఒకవేళ మూడేళ్లలోపు బంగారాన్ని అమ్మినట్లయితే వ్యక్తిగత ఆదాయం కిందకు వస్తుంది. దీనిపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే సావరీస్‌ గోల్డ్‌ బాండ్‌ల అమ్మకాల విషయంలో కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయి. ఒక వేళ మెచ్యూరిటీ కాలం పూర్తయ్యాక పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us