Tata Car Offers: ఆ రెండు మోడళ్ల కార్లపై టాటా అదిరిపోయే ఆఫర్.. తగ్గింపు ఎంతో తెలిస్తే షాకవుతారు..
ప్రస్తుతం మనం 2023 చివర్లో ఉన్నాం. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఇయర్ ఎండ్ సేల్స్‌ను నిర్వహిస్తున్నాయి. మహీంద్రా, మారుతీ సుజుకీ, ఎంజీ, హ్యూందాయ్, జీప్, వోక్స్‌వ్యాగన్ కంపెనీలు ఇప్పటికే ఇయర్ ఎండ్ ఆఫర్లు ప్రకటించాయి. ఇదే లిస్ట్‌లో ప్రస్తుతం టాటా కంపెనీ కూడా చేరిపోయింది. మరి టాటా కంపెనీ కార్లపై ఇస్తున్న డిస్కౌంట్ వివరాలను తెలుసుకోండి.
భారతదేశంలో కార్ల మార్కెట్ ఇటీవల కాలంలో ఊపందుకుంటుంది. ముఖ్యంగా ప్రజలు జీవన ప్రమాణాలు పెరగడంతో కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ఉద్యోగులు సైతం కార్ల కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. ఊహించని ఈ డిమాండ్ కంపెనీలన్నీ కొత్త కొత్త కార్లను అందుబాటులో తీసుకొచ్చాయి. అయితే ప్రస్తుతం మనం 2023 చివర్లో ఉన్నాం. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఇయర్ ఎండ్ సేల్స్‌ను నిర్వహిస్తన్నాయి. మహీంద్రా, మారుతీ సుజుకీ, ఎంజీ, హ్యూందాయ్, జీప్, వోక్స్‌వ్యాగన్ కంపెనీలు ఇప్పటికే ఇయర్ ఎండ్ ఆఫర్లు ప్రకటించాయి. ఇదే లిస్ట్‌లో ప్రస్తుతం టాటా కంపెనీ కూడా చేరిపోయింది. వినియోగదారుల్లో అత్యంత ఆదరణ పొందిన టాటా సఫారీ, హారియర్ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ డిస్కౌంట్ల ధరలు ఎంత స్థాయిలో ఉన్నాయో? ఓ సారి తెలుసుకుందాం.
ఇటీవల కాలంలో అన్ని కంపెనీలు తమ మోడల్స్ కార్లపై 2024, జనవరి నుంచి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. టాటా కూడా ధరల పెంపును ప్రకటించింది. కాబట్టి కార్లను కొనుగోలు చేయాలనుకునే వాళ్లు ఈ నెలలో కొనుగోలు చేస్తే మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే టాటా ఆఫర్ల విషయానికి వస్తే కార్ల ప్రియులు టాటా హారియర్, సఫారీకు సంబంధించిన ప్రీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లపై తగ్గింపును పొందవచ్చు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఏడీఏఎస్‌తో కూడిన టాటా హారియర్ ఏటీపై రూ.1.35 లక్షల తగ్గింపును పొందవచ్చు. వీటిల్లో రూ.75,000 కస్టమర్ బెనిఫిట్స్, రూ.10 వేల కార్పొరేట్ తగ్గింపు, రూ.50,000 ఎక్స్చేంజ్ బోనస్ ఉంటుంది. అదే విధంగా ఏడీఏఎస్‌తో కూడిన ప్రీ ఫేస్‌లిఫ్ట్ టాటా సఫారీ ఏటీపై రూ.1.40 లక్షల తగ్గింపును పొందవచ్చు. అయితే ఈ తగ్గింపుల్లో రూ.75,000 వినియోగదారుల తగ్గింపులు, రూ.15 వేల కార్పొరేట్ ప్రయోజనాలు, రూ.15 వేల ఎక్స్చేంజ్ బోనస్ ఉన్నాయి.
ఈ ఎస్‌యూవీలతో పాటు టాటా టియాగోపై కూడా రూ.80 వేల తగ్గింపు ధరతో లభిస్తుంది. టిగోర్ కూడా రూ.80 వేల ఆఫర్ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఆల్ట్రోజ్ కారుపై రూ.45 వేలు, నెక్సాన్‌పై రూ.70 వేల వరకూ తగ్గింపును పొందవచ్చు. అయితే టాటా పంచ్ కారుపై మాత్రం కేవలం రూ.3 వేల తగ్గింపు మాత్రమే అందుబాటులో ఉంది. అలాగే టాటా సఫారీ, హారియర్, నెక్సాన్ ఇటీవలే ఫేస్‌లిఫ్ట్‌ను పొందాయి. ఈ తాజా చర్యతో ఆయా కార్లు మరింత సుందరంగా కనిపిస్తున్నాయి. టాటా సఫారీ కారు ప్రారంభం ధర రూ.16.19 లక్షలు కాగా, హారియర్ ధర రూ.15.19 లక్షలుగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..