Tata Car Offers: ఆ టాటా కార్లపై భారీ డిస్కౌంట్స్.. ఏకంగా రూ.58000 వరకూ తగ్గింపు..

టాటా కంపెనీ తాజాగా తన ఐసీఈ లైనప్‌లో జూన్ 2023 కోసం తన ఆఫర్‌ల సెట్‌ను విడుదల చేసింది. అయితే ఈ ఆఫర్లు మాత్రం ఈవీ వాహనాలకు వర్తించవు. ముఖ్యంగా నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ప్రయోజనాలు వంటి ఎన్నో ఆఫర్లను టాటా కంపెనీ వినియోగదారులకు అందిస్తుంది.

Tata Car Offers: ఆ టాటా కార్లపై భారీ డిస్కౌంట్స్.. ఏకంగా రూ.58000 వరకూ తగ్గింపు..
Tata
Follow us
Srinu

| Edited By: seoteam.veegam

Updated on: Jun 09, 2023 | 7:07 PM

కారు అనేది మధ్యతరగతి ప్రజల కల. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో హ్యాపీగా బయటకు వెళ్లాలనుకునే చాలా మంది కార్ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మధ్యతరగతి ప్రజల కలను సాకారం చేస్తూ ఇండియన్ కంపెనీ టాటా తక్కువ ధరకే అధిక ఫీచర్లతో కార్లను అందిస్తుంది. టాటా కంపెనీ తాజాగా తన ఐసీఈ లైనప్‌లో జూన్ 2023 కోసం తన ఆఫర్‌ల సెట్‌ను విడుదల చేసింది. అయితే ఈ ఆఫర్లు మాత్రం ఈవీ వాహనాలకు వర్తించవు. ముఖ్యంగా నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ప్రయోజనాలు వంటి ఎన్నో ఆఫర్లను టాటా కంపెనీ వినియోగదారులకు అందిస్తుంది. టాటా టిగోర్, టియాగో, హారియర్, సఫారిచ, ఆల్ట్రోజ్ కార్లపై టాటా కంపెనీ భారీ డిస్కౌంట్‌ను అందిస్తుంది. రూ.15,000 నుంచి రూ.58,000 వరకూ ఈ ఆఫర్ల ద్వారా కొనుగోలుదారులు లబ్ధి పొందుతారు. జూన్‌లో టాటా కార్లపై వచ్చే ఆఫర్లు ఏంటో ఓ సారి తెలుసకుందాం.

టాటా టిగోర్

ఈ కార్‌పై టాటా కంపెనీ రూ.58,000 తగ్గింపును అందిస్తుంది. కేవలం ఈ ఆఫర్ సీఎన్‌జీ కార్ మోడల్ పైనే ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. సాధారణ పెట్రోల్ వేరియంట్‌పై కేవలం రూ.20,000 తగ్గింపు లభిస్తుంది. ఈ కార్ ధర రూ.6.30 లక్షల నుంచి రూ.8.90 లక్షల వరకూ ఉంటుంది. ఈ కార్‌పై రూ.35,000 నగదు తగ్గింపు, అలాగే రూ.10,000 ఎక్స్చేంజ్ బోనస్, మరో రూ.10,000 అదనపు ఎక్స్చేంజ్ బోనస్, రూ.3000 వరకూ కార్పొరేట్ తగ్గింపు వెరశి రూ.58,000 తగ్గింపు లభిస్తుంది. 

టాటా టియాగో

ఈ కార్‌పై టాటా కంపెనీ రూ.53,000 తగ్గింపును అందిస్తుంది. కేవలం ఈ ఆఫర్ సీఎన్‌జీ కార్ మోడల్ పైనే ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్ ధర రూ.5.60 లక్షల నుంచి రూ.8.11 లక్షల వరకూ ఉంటుంది. ఈ కార్‌పై రూ.30,000 నగదు తగ్గింపు, అలాగే రూ.10,000 ఎక్స్చేంజ్ బోనస్, మరో రూ.10,000 అదనపు ఎక్స్చేంజ్ బోనస్, రూ.3000 వరకూ కార్పొరేట్ తగ్గింపు వెరశి రూ.53,000 తగ్గింపు లభిస్తుంది. 

ఇవి కూడా చదవండి

టాటా పంచ్

ఈ కార్‌పై రూ.10,000 ఎన్ఈసీ తగ్గింపు లభిస్తుంది. ఈ కార్ ధర రూ.6 లక్షల నుంచి 9.52 లక్షల వరకూ ఉంటుంది. 

టాటా ఆల్ట్రోజ్

ఈ కార్‌పై టాటా కంపెనీ రూ.45,000 తగ్గింపును అందిస్తుంది. కేవలం ఈ ఆఫర్ డీజిల్ వేరియంట్లపై అందిస్తుంది. ఈ కార్ ధర రూ.6.60 లక్షల నుంచి రూ.10.74 లక్షల వరకూ ఉంటుంది. అయితే ఈ కార్‌లో ఎక్స్ఈ, ఎక్స్ఈ ప్లస్ తగ్గింపు కేవలం రూ.30,000 పరిమితం చేశారు. ఈ కార్‌పై రూ.15,000 నగదు తగ్గింపు, అలాగే రూ.10,000 ఎక్స్చేంజ్ బోనస్, మరో రూ.15,000 అదనపు ఎక్స్చేంజ్ బోనస్, రూ.5000 వరకూ కార్పొరేట్ తగ్గింపు వెరశి రూ.45,000 తగ్గింపు లభిస్తుంది. 

టాటా నెక్సాన్

ఈ కార్‌పై టాటా కంపెనీ రూ.20,000 తగ్గింపును అందిస్తుంది. కేవలం ఈ ఆఫర్ డీజిల్ వేరియంట్ మోడల్ పైనే ఉంటుంది. ఈ కార్‌కు ఎలాంటి ఎక్స్చేంజ్ ఆఫర్లు రావు. ఈ కార్ ధర రూ.7.80 లక్షల నుంచి రూ.14.35 లక్షల వరకూ ఉంటుంది. ఈ కార్‌పై రూ.15,000 నగదు తగ్గింపు, అలాగే  రూ.5000 వరకూ కార్పొరేట్ తగ్గింపు వెరశి రూ.20,000 తగ్గింపు లభిస్తుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..