Offers On TATA Cars: టాటా కార్లపై తగ్గింపు ఆఫర్లు షురూ.. ఆ కార్లపై ఎంత తగ్గింపు లభిస్తుందంటే..?
నెవర్ బిఫోర్ ఆఫర్'గా మార్కెట్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఈ ఆఫర్ టాటా టియాగో, టాటా టిగోర్, టాటా ఆల్ట్రోజ్, టాటా హారియర్, టాటా సఫారి కార్లకు సంబంధించిన అన్ని వేరియంట్‌లపై చెల్లుబాటు అవుతుంది. కార్పొరేట్ డిస్కౌంట్‌లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లు, విభిన్న వినియోగదారు పథకాలు వంటి వివిధ రకాల డిస్కౌంట్‌ల ద్వారా ఈ ఆఫర్‌లను పొందవచ్చు.
టాటా మోటార్స్ మే నెలలో విస్తృత శ్రేణి కార్లపై డిస్కౌంట్లను అందిస్తోంది. దీనిని ‘నెవర్ బిఫోర్ ఆఫర్’గా మార్కెట్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఈ ఆఫర్ టాటా టియాగో, టాటా టిగోర్, టాటా ఆల్ట్రోజ్, టాటా హారియర్, టాటా సఫారి కార్లకు సంబంధించిన అన్ని వేరియంట్‌లపై చెల్లుబాటు అవుతుంది. కార్పొరేట్ డిస్కౌంట్‌లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లు, విభిన్న వినియోగదారు పథకాలు వంటి వివిధ రకాల డిస్కౌంట్‌ల ద్వారా ఈ ఆఫర్‌లను పొందవచ్చు. ఈ తగ్గింపులు వాహనాల ఐసీఈ మోడల్‌లపై మాత్రమే ఉన్నాయని, ఇవి నెక్సాన్, టిగోర్, టియాగో వంటి ఈవీ శ్రేణి వాహనాలకు వర్తించవని గమనించాలి. ఈ ఆఫర్లు మే 31 అందుబాటులో ఉంటాయని కంపెనీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ప్రస్తుతం టాటా కంపెనీ ఏ కార్లపై ఆఫర్ ప్రకటిస్తుందో? ఓ సారి చూద్దాం.
టాటా ఆల్ట్రోజ్
టాటా మోటార్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ‘ఆల్ట్రోజ్’ మొత్తం రూ. 28,000 తగ్గింపుతో లభిస్తుంది. పెట్రోల్ (డీసీఏ మినహా), అన్ని డీజిల్ వేరియంట్‌లు రూ. 15,000 విలువైన ప్రయోజనాలను, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపును పొందుతాయి.ఈ కార్ డీసీఏ వెర్షన్ రూ. 10,000 విలువైన వినియోగదారు ప్రయోజనాలు, రూ. 10,000 విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపుతో మొత్తం రూ. 23,000 తగ్గింపులను పొందవచ్చు.
టాటా హారియర్, సఫారీ
టాటా సఫారీ. టాటా హారియర్ రెండు కార్లపై రూ. 35,000 విలువైన తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు ఎస్‌యూవీలపై రూ. 25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, అలాగే రూ. 10,000 విలువైన కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. అయితే ఈ రెండు మోడళ్లపై వినియోగదారు ప్రయోజనాలు ఏవీ అందుబాటులో ఉండవు.
టాటా టిగోర్
టాటా టిగోర్ అనేది టాటా మోటార్స్ నుంచి వచ్చిన సెడాన్. ఇది పెట్రోల్, సీఎస్‌జీ, ఈవీ శ్రేణిలో అందుబాటులో ఉంది. అయితే ఈ తగ్గింపులు పెట్రోల్, సీఎన్‌జీ వెర్షన్‌లపై మాత్రమే అందుబాటులో ఉన్నాయి. టాటా టిగోర్ పెట్రోల్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వెర్షన్ రూ. 15,000 వినియోగదారు ప్రయోజనం, రూ. 10,000 ఎక్స్చేంజ్ ప్రయోజనం పొందుతుంది. అయితే మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వెర్షన్ రూ. 20,000 విలువైన వినియోగదారు ప్రయోజనాలను పొందుతుంది. మీరు రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపు తర్వాత పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వెర్షన్‌పై మొత్తం రూ. 33,000 తగ్గింపును పొందవచ్చు. టాటా టిగోర్ సీఎన్‌జీ వెర్షన్‌పై రూ. 15,000 వినియోగదారు ప్రయోజనాలు, రూ. 10,000 ఎక్స్చేంజ్ బోనస్‌ను అందుబాటులో ఉంది. దీంతో మొత్తం తగ్గింపు రూ. 25,000కి చేరుకుంది.
టాటా టియాగో
టాటా టియాగో కార్లు పెట్రోల్, సీఎన్‌జీ, ఈవీ శ్రేణిలో అందుబాటులో ఉన్నాయి. అయితే, తగ్గింపులు పెట్రోల్, సీఎన్‌జీ వెర్షన్‌లపై మాత్రమే అందుబాటులో ఉన్నాయి. టాటా టియాగో పెట్రోల్ వెర్షన్ రూ. 15,000 విలువైన వినియోగదారు ప్రయోజనాలను, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందుతుంది, అయితే టియాగో ఎక్స్‌టీ, ఎక్స్‌టీ రిథమ్, ఎన్ఆర్‌జీ మాన్యువల్, ఎక్స్‌జెడ్ ప్లస్ పెట్రోల్ వెర్షన్‌లు మొత్తం రూ. 30,000 తగ్గింపుతో పాటు రూ. 20,000 విలువైన వినియోగదారు ప్రయోజనాలను పొందుతాయి. టాటా టియాగో సీఎన్‌జీ వెర్షన్ రూ. 10,000 విలువైన వినియోగదారు ప్రయోజనాలను, రూ. 10,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 5,000 కార్పొరేట్ ప్రయోజనాలు అందుతాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..