AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TATA Recruitment: బీటెక్‌ చేసిన వారికి టాటా గ్రూప్‌లో ఉద్యోగాలు.. ఏడాదికి రూ. 6 లక్షలు జీతం పొందే అవకాశం.

బీటెక్‌ అర్హతతో ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. టాటా స్టీల్‌ సంస్థ టాటా స్టీల్‌ అస్పైరింగ్‌ ఇంజినీర్స్‌ ప్రోగ్రామ్‌-2023 కింద ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఇంతకీ ఈ ప్రోగ్రామ్‌ ఎలా నిర్వహిస్తారు. అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారన్న...

TATA Recruitment: బీటెక్‌ చేసిన వారికి టాటా గ్రూప్‌లో ఉద్యోగాలు.. ఏడాదికి రూ. 6 లక్షలు జీతం పొందే అవకాశం.
Tata Steel Jobs
Narender Vaitla
|

Updated on: Feb 10, 2023 | 8:38 PM

Share

బీటెక్‌ అర్హతతో ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. టాటా స్టీల్‌ సంస్థ టాటా స్టీల్‌ అస్పైరింగ్‌ ఇంజినీర్స్‌ ప్రోగ్రామ్‌-2023 కింద ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఇంతకీ ఈ ప్రోగ్రామ్‌ ఎలా నిర్వహిస్తారు. అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారన్న పూర్తి వివరాలు మీకోసం.

భర్తీ చేయనున్న పోస్టులు, అర్హతలు..

* టాటా స్టీల్‌ అస్పైరింగ్‌ ఇంజినీర్స్‌ ప్రోగ్రామ్‌-2023 కింద ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 6.5 అకడమిక్‌ పాయింట్లతో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజినీరింగ్‌(ఐటీ/ కంప్యూటర్‌ సైన్స్‌) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా మ్యాథ్స్‌/ స్టాటిస్టిక్స్‌/ ఫిజిక్స్‌/ ఆపరేషనల్‌ రిసెర్చ్‌ స్ట్రీమ్‌లో అర్హత సాధించిన ఎంసీఏ/ ఎంఎస్సీ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

* అభ్యర్థుల వయసు 01-02-2023 వరకు 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 32 ఏళ్లు వరకు వయసులో సడలింపు ఉంది.

పూర్తి వివరాలు మీకోసం..

* అభ్యర్థులను కాగ్నిటివ్‌, టెక్నికల్‌ టెస్ట్‌లో మెరిట్‌ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

* మొదట ఇంజినీర్‌ ట్రెయినీ శిక్షణ ఇస్తారు. అనంతరం ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన అసిస్టెంట్‌ మేనేజర్‌ హోదాలో ఉద్యోగం కల్పిస్తారు.

* ట్రెయినీ శిక్షణ సమయంలో నెలకు రూ. 30,000 స్టైపెండ్‌గా అందిస్తారు. అనంతరం ఉద్యోగంలో చేరిన తర్వాత ఏడాదికి రూ. 6.24 లక్షలు చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 03-03-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!