Tata Steel: టాటా స్టీల్‌ నాలుగో త్రైమాసికం ఫలితాలు విడుదల.. పెరిగిన లాభాలు..

మార్చి త్రైమాసికంలో(q4 Results) టాటా స్టీల్(Tata Steel) లాభం 46.83 శాతం పెరిగి రూ. 9,756.20 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.6,644.15 కోట్ల లాభాన్ని ఆర్జించింది...

Tata Steel: టాటా స్టీల్‌ నాలుగో త్రైమాసికం ఫలితాలు విడుదల.. పెరిగిన లాభాలు..

Edited By:

Updated on: May 04, 2022 | 8:48 AM

మార్చి త్రైమాసికంలో(q4 Results) టాటా స్టీల్(Tata Steel) లాభం 46.83 శాతం పెరిగి రూ. 9,756.20 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.6,644.15 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.50,028.37 కోట్లతో పోలిస్తే 38.6 శాతం పెరిగి రూ.69,323.5 కోట్లకు చేరుకుంది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.9,572.67 కోట్లు, ఆదాయం(profit) రూ.60,783.11 కోట్లు. యూరోపియన్ వ్యాపారం ద్వారా కంపెనీ ఆదాయం 54 శాతం పెరిగి 887 మిలియన్ పౌండ్లకు చేరుకుంది. పూర్తి సంవత్సరానికి టాటా స్టీల్ లాభం 436 శాతం పెరిగి రూ.40,153.93 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో కంపెనీ లాభం రూ.7,490.22 కోట్ల స్థాయిలో ఉంది. ఏడాది మొత్తంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.2,43,959.17 కోట్లు. ఏడాది క్రితం కంపెనీ ఆదాయం రూ.1,56,477.40 కోట్ల స్థాయిలో ఉంది. ఫలితాలతో పాటు, వాటాదారుల కోసం డివిడెండ్, స్టాక్ స్ప్లిట్‌కు కూడా కంపెనీ ఆమోదించింది.

ఫలితాలతో పాటు స్టాక్‌ను 10 నుండి 1 నిష్పత్తిలో స్ల్పిట్‌ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక స్టాక్‌ను రూ.1 ముఖ విలువ కలిగిన 10 స్టాక్‌లుగా మార్చాలని బోర్డు నిర్ణయించినట్లు కంపెనీ తెలియజేసింది. దీనితో పాటు, కంపెనీ తన పెట్టుబడిదారులకు ఒక్కో షేరుకు 51 రూపాయల డివిడెండ్‌ను కూడా ప్రకటించింది. అదే సమయంలో, కంపెనీ 19 మిలియన్ టన్నుల ముడి ఉక్కు ఉత్పత్తిలో అత్యధిక ఉత్పత్తిని సాధించింది. దీంతో డెలివరీలు 18 మిలియన్ టన్నులు దాటాయి. ఫలితాల అనంతరం కంపెనీ సీఈవో టీవీ నరేంద్రన్ మాట్లాడుతూ, కోవిడ్ 19, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య కూడా కంపెనీ పటిష్ట పనితీరు కనబరిచిందన్నారు.

Read Also.. Swiggy Drone Delivery: ఆ నగరంలో డ్రోన్ డెలివరీలు మెుదలు పెట్టిన స్విగ్గీ.. త్వరలోనే మరిన్ని నగరాలకు..