AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tata Punch EV: టాటా పంచ్ ఈవీకి ముహూర్తం ఫిక్స్.. ఆ కారుతోనే పోటీ.. పూర్తి వివరాలు

టాటా మోటార్స్ ఇండియా నుంచి మరో ఎలక్ట్రిక్ కారు లాంచింగ్ కు రెడీ అయ్యింది. కాంపాక్ట్ ఎస్ యూవీగా టాటా పంచ్ ఎలక్ట్రిక్ వేరియంట్ మార్కెట్లోకి వచ్చేందుకు సర్వం సిద్దమైంది. జనవరి 17న ఈ కారు గ్రాండ్ గా లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రూ. 21,000 టోకెన్ అమౌంట్ చెల్లించి ఈకారును బుక్ చేసుకోవచ్చు.

Tata Punch EV: టాటా పంచ్ ఈవీకి ముహూర్తం ఫిక్స్.. ఆ కారుతోనే పోటీ.. పూర్తి వివరాలు
Tata Punch Ev
Madhu
|

Updated on: Jan 15, 2024 | 4:20 PM

Share

టాటా మోటార్స్ ఇండియా నుంచి మరో ఎలక్ట్రిక్ కారు లాంచింగ్ కు రెడీ అయ్యింది. కాంపాక్ట్ ఎస్ యూవీగా టాటా పంచ్ ఎలక్ట్రిక్ వేరియంట్ మార్కెట్లోకి వచ్చేందుకు సర్వం సిద్దమైంది. జనవరి 17న ఈ కారు గ్రాండ్ గా లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రూ. 21,000 టోకెన్ అమౌంట్ చెల్లించి ఈకారును బుక్ చేసుకోవచ్చు. ఈ కారు నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. స్మార్ట్ అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంవపర్డ్ ప్లస్ వంటి మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

టాటా పంచ్ ఈవీ డిజైన్..

కొత్తగా వస్తున్న ఈ టాటా పంచ్ ఈవీ డిజైన్ కూడా సరికొత్తగా తీర్చిదిద్దారు. టాటా జెన్-2 ఈవీ ఆర్కిటెక్చర్ ఆధారంగా దీనిని రూపొందించారు. డిజైన్ నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ నుంచి తీసుకున్నారు. దీనిలో ముందు వైపు ఎల్ఈడీ లైట్ బార్ ఉంటుంది. బంపర్, గ్రిల్ కూడా నెక్సాన్ స్టైల్లోనే ఉంటుంది. ఫ్రంట్ బంపర్ పై స్ల్పిట్ ఎల్ఈడీ హెడ్ లైట్స్ ఉంటాయి. కొత్తగా వెర్టికల్ స్ట్రేక్స్ తో లోయర్ బంపర్ ఉంచారు. సిల్వర్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్ ఉంటుంది.

ముందువైపు చార్జర్..

టాటా పంచ్ ఈవీకి ముందు వైపు చార్జింగ్ పోర్టు ఉంటుంది. ఇలా ఉన్న మొట్టమొదటి టాటా ఎలక్ట్రిక్ కారు ఇదే. కచ్చితంగా బ్రాండ్ లోగోకు దిగువన దీనిని అమర్చారు.

ఇవి కూడా చదవండి

టాటా పంచ్ ఈవీ రేంజ్..

ప్రస్తుతం ఈ కారు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. స్టాండర్డ్, లాంగ్ రేంజ్ పేరిట ఇవి ఉంటాయి. ఇవి సింగిల్ చార్జ్ పై 300 నుంచి 375 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలుగుతాయి.

టాటా పంచ్ ఈవీ ధర, లభ్యత..

ఈ కారు ప్రత్యక్షంగా సిట్రోయిన్ ఈసీ3తో పోటీ పడనుంది. ఈ కారు ధర కూడా రూ. 11లక్షల నుంచి రూ. 13లక్షలు(ఎక్స్ షోరూం) ఉండనుంది. ఇండియన్ మార్కెట్లోని ఎస్యూవీ సెగ్మెంట్లో ఇది చాలా ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా టాటా నుంచి ఇప్పటికే పలు కార్లు ఎలక్ట్రిక్ వేరియంట్లో అందుబాటులో ఉన్నాయి. భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వేరియంట్లో అందుబాటులో ఉన్న ఎక్కువ కార్లు టాటా కంపెనీవే కావడం గమనార్హం. ఒకరకంగా చెప్పాలంటే ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ల రంగంలో టాటా లీడర్ ఉందనడంలో సందేహం లేదు. ఇప్పుడు మరో కారు అది కూడా మార్కెట్లో క్లిక్ అయిన  చిన్న ఎస్ యూవీ పంచ్ ను ఎలక్ట్రిక్ వేరియంట్లో తీసుకురావడంతో దీనిని అధిక డిమాండ్ ఉండే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..