Skoda Electric Car: స్కోడా నుంచి తొలి ఈ-కార్ వచ్చేస్తోంది.. లుక్, ఫీచర్స్ అదిరిపోయాయి..
తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును ఇక్కడ లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. స్కోడా ఎన్యాక్ ఐవీ పేరుతో 2024 మార్చిలో గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే దీనిని మన దేశంలోని రోడ్లపై పరీక్షిస్తుండగా ఔత్సాహికులు గుర్తించారు. ఇది 2023 హ్యూందాయ్ వెర్నా సెడాన్ బాడీ కిట్‌తో సవరించారు. లుక్, డిజైన్, స్పెక్స్ వంటివి కూడా లీక్ అయ్యాయి.

ప్రపంచ దిగ్గజ కారు బ్రాండ్ల తయారీలో ఒకటైన స్కోడా మన దేశంలో తన మార్కెట్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును ఇక్కడ లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. స్కోడా ఎన్యాక్ ఐవీ పేరుతో 2024 మార్చిలో గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే దీనిని మన దేశంలోని రోడ్లపై పరీక్షిస్తుండగా ఔత్సాహికులు గుర్తించారు. ఇది 2023 హ్యూందాయ్ వెర్నాసెడాన్ బాడీ కిట్‌తో సవరించారు. లుక్, డిజైన్, స్పెక్స్ వంటివి కూడా లీక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో స్కోడా ఎన్యాక్ ఐవీ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
స్కోడా ఎన్యాక్ ఐవీ స్పెసిఫికేషన్లు..
ఇది వోక్స్‌వ్యాగన్ గ్రూప్‌కు చెందిన ఎంఈబీ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా తయారైంది. ప్రస్తుతం ఎన్యాక్ ఐదు వెర్షన్లు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండగా, ఇండియాలో లాంచ్ అయ్యేది బౌండ్ వెర్షన్ ఎన్యాక్ 85గా ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఎన్యాక్ 85లో 82కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్, సింగిల్-మోటార్ రియర్-వీల్ డ్రైవ్ సెటప్‌ను కలిగి ఉంటుంది, ఇది సుమారుగా 282బీహెచ్‌పీని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 6.7 సెకన్లలోనే 0 నుంచి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.దీనిలో బ్యాటరీ సింగిల్ చార్జ్ పై 565 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. దీనిలో ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో కేవలం 28 నిమిషాల్లో 10-80% నుంచి ఛార్జ్ చేయగలగుతుంది. మన దేశ మార్కెట్లో ఇప్పటికే ఉన్న హ్యూందాయ్ ఐయనిక్5, కియా ఈవీ6 కార్లతో ఇది పోటీ పడే అవకాశం ఉంది.
డిజైన్ ఇలా..
ఎన్యాక్ ఈవీ స్కోడా సిగ్నేచర్ గ్రిల్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో పదునైన, దూకుడుగా కనిపించే హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌ల్యాంప్‌లు ఉన్నాయి. ఈ కారు పెద్ద ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. 2,765ఎంఎం వీల్‌బేస్‌తో 4648x1877x1618ఎంఎం కొలతలు కలిగి ఉంది. ఎన్యాక్ కూపే-ఎస్‌యూవీ వెర్షన్ అందుబాటులో ఉన్నప్పటికీ, ఇది స్టాండర్డ్ వెర్షన్‌తో పాటు భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం లేదు. ఎన్యాక్ లోపలి భాగం ఆధునిక క్యాబిన్ లేఅవుట్‌తో మినిమలిస్టిక్ డ్రైవర్ డిస్‌ప్లే, 15-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, తక్కువ ఫిజికల్ బటన్‌లను అందిస్తుంది.
డ్రైవర్ సీటులో 5.3-అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) టెక్నాలజీతో కూడిన కొత్త హెడ్స్-అప్ డిస్‌ప్లే (హెచ్‌యూడీ)ని అమర్చారు. సెంట్రల్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ 15-అంగుళాల పరిమాణంలో ఉంది. ప్లాట్‌ఫారమ్ పొడవైన వీల్‌బేస్ కారణంగా క్యాబిన్ తగినంత స్థలాన్ని అందిస్తుంది. బూట్ స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు 585 లీటర్ల స్టోరేజ్ కెపాసిటీని అందిస్తోంది. ఎన్యాక్ తొమ్మిది ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు కార్ టెక్నాలజీలతో కూడా వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..