EV Car: ఎట్టకేలకు దేశంలో ఆ కారు ఈవీ వెర్షన్ రిలీజ్.. టాప్ క్లాస్ ఫీచర్లు ఈ కారు సొంతం
ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ బాగా పెరిగింది. అయితే భారతదేశంలో ఎక్కువగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కొనుగోలుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. కాలక్రమేణ ఈవీ కార్లు కూడా మార్కెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. దేశంలోని ఈవీ కార్ల ప్రియులు ఎన్నో రోజుల నుంచి టాటా మోటార్స్‌కు సంబంధించిన హారియర్ ఈవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాయి. ఎట్టకేలకు ఇటీవల దేశంలో హారియర్ ఈవీను దేశంలో రిలీజ్ చేశారు.

టాటా మోటార్స్ భారతదేశంలో టాటా హారియర్ ఈవీను అధికారికంగా ప్రారంభించారు. ఈవీ రంగంలో స్వదేశీ బ్రాండ్ కారుగా ఉన్న హారియర్ ఈవీ ధరలు రూ. 21.49 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతాయి. ముఖ్యంగా హారియర్ ఈవీను మీరు ఎన్ని కిలోమీటర్లు నడిపినా జీవితకాల వారంటీతో వస్తుంది. టాటాకు సంబంధించిన జెన్ 2 ఈవీ ఆర్కిటెక్చర్ ఆధారంగా నిర్మించిన డ్యూయల్-మోటార్ సెటప్‌తో వస్తుంది రియర్-వీల్ డ్రైవ్ బయాస్‌లో ఆల్-వీల్ డ్రైవ్‌ను అందిస్తుంది. అలాగే ఈ కారు 504 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ కారు కేవలం 6.3 సెకన్లలో 0-100 కిమీ/ గం వేగాన్ని అందుకుంటుంది. టాటా హారియర్ ఈవీ ఆరు టెర్రెన్ మోడ్లతో ఆకట్టుకునే ఆఫ్-రోడ్ కెపాసిటీతో వస్తుంది.
బ్యాటరీ పవర్ విషయానికి వస్తే హారియర్ ఈవీలో రెండు బ్యాటరీ ఎంపికలు ఉన్నాయి. 65 కేడబ్ల్యూహెచ్, 75 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఎంపికల్లో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా ఈ కారు ఏఆర్ఏఐ సర్టిఫైడ్ 627 కి.మీ పరిధిని అందిస్తుందని కంపెనీ చెబుతున్నా వాస్తవ పరిధి 480-505 కి.మీ మధ్య ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారును 120 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించి ఈ కారు బ్యాటరీని కేవలం 25 నిమిషాల్లో 20 శాతం నుంచి 80 శావతం వరకు ఛార్జ్ చేయవచ్చని టాటా ప్రతినిధులు చెబుతున్నారు. ఈ కారులో 7.2 కేడబ్ల్యూ ఏసీ హెూమ్ ఛార్జర్ కూడా అందుబాటులో ఉంది. అలాగే ఈ ఈవీ కారు 3.3 కేడబ్ల్యూ వరకు వెహికల్-టు-లోడ్ (V2L) సామర్థ్యాన్ని సపోర్ట్ చేస్తుంది. ఇది కేవలం 15 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్లో 240 కి.మీ పరిధిని అందిస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే టాటా హారియర్ ఈవీలో 14.53 అంగుళాల సెంట్రల్ టచ్‌తో వస్తుంది. పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్రూఫ్, వాయిస్ యాక్టివేషన్తో కూడిన డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉన్న ప్రీమియం డ్యూయల్- టోన్ క్యాబిన్‌తో హారియర్ ఆకట్టుకుంటుంది. వెనుక కూర్చొనే ప్రయాణీకులు “బాస్ మోడ్” ద్వారా ఒక బటన్ నొక్కితే ముందు ప్యాసింజర్ సీటును వంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. అలాగే ఈ కారులో డాల్బీ అట్మాస్ 5.1 సరౌండ్ సౌండ్ ఉన్నాయి. పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అలెక్సా వాయిస్ అసిస్టెంట్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటి ఫీచర్లు యూజర్లను ఆకట్టుకుంటాయి. ఫోన్ ఆధారిత డిజిటల్ కీ, స్మార్ట్ కార్డ్ ఆప్షన్, డాష్ క్యామ్ రెట్టింపు అయ్యే ఈ-ఐఆర్‌వీఎం (డిజిటల్ ఇన్సైడ్ రియర్వ్యూ మిర్రర్) ఈ కారు ప్రత్యేకతగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








