EV Scooter: మరో నయా ఈవీ స్కూటర్ లాంచ్‌కు బజాజ్ సిద్ధం.. ఈ నెలలోనే రిలీజ్..?
భారతదేశంలో ప్రజలకు చేతక్ బండి అంటే ఓ ఎమోషన్. దేశంలో ఒకప్పుడు అమ్మకాలపరంగా ఓ వెలుగు వెలిగిన బజాజ్ చేతక్ ప్రస్తుతం ఈవీ వెర్షన్‌లో అమ్మకాలను విస్తరిస్తుంది. అయితే ఈవీ వాహనాలు అంటే అధిక ధర అని భావించే ప్రజల కోసం అతి తక్కువ ధరలో చేతక్ ఈవీను లాంచ్ చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

బజాజ్ కంపెనీ జూన్ నెలలో బడ్జెట్ ఫ్రెండ్లీ చేతక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బజాజ్ ఆటోకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ కంపెనీ ఆదాయాల సమావేశంలో చేతక్ 2903 మోడల్‌కు అప్‌డేటెడ్ వెర్షన్‌పై కంపెనీ పని చేస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త మోడల్ బజాజ్ ఈవీ అధికారికంగా జూన్‌లో ప్రారంభం కానుందని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం చేతక్ 2903, 3501, 3502, 3503 పేర్లతో నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. క్యూ4లో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో అమ్మకాల చార్టుల్లో అగ్రస్థానంలో నిలిచిన తర్వాత బజాజ్ దాని సరసమైన శ్రేణిని మరింత వైవిధ్యపరచాలని కోరుకుంటోంది. చేతక్ బ్రాండ్‌కు పెరుగుతున్న ప్రజాదరణ నేపథ్యంలో నాలుగో త్రైమాసికంలో భారతదేశ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో చేతక్‌ను నంబర్ వన్ స్థానానికి చేరింది. బజాజ్ ఈ-స్కూటర్ మార్కెట్‌లో 29 శాతం వాటాను కైవసం చేసుకుంది.
బజాజ్ చేతక్ 2903 వెర్షన్ 2.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో 123 కి.మీ.ల రేంజ్ తో పనిచేస్తుంది. ఇది 4 గంటల్లో 100 శాతం ఛార్జ్ అవుతుంది. అలాగే ఈ స్కూటర్ గరిష్టంగా 63 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుందని చెబుతున్నారు. అలాగే ఈ స్కూటర్ హిల్ హోల్డ్‌తో పాటు రెండు రైడ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ ధర ధర రూ. 98,498(ఎక్స్-షోరూమ్) ఉంటుంది. అయితే కొత్త అప్‌డేటెడ్ వెర్షన్ 35 సిరీస్ బ్యాటరీతో 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో 153 కి.మీల పరిధితో వస్తుందని భావిస్తున్నారు. 35 సిరీస్ 3503కు సంబంధించిన ఎంట్రీ-లెవల్ మోడల్ ఆధారంగా కొత్త వేరియంట్ 35 లీటర్ల బూట్ స్పేస్, పెద్ద అండర్-సీట్ స్టోరేజ్, 63 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్‌ను పొందవచ్చని అంచనా వేస్తన్నారు
అలాగే బజాజ్ నయా స్కూటర్ ఇది 3 గంటల 25 నిమిషాల్లో 0 – 80 శాతం వరకు ఛార్జ్ అవుతుందని, అలాగే 151 కి.మీ.ల పరిధిని అందిస్తుందని వివరిస్తన్నారు. ఈ స్కూటర్‌లో రెండు రైడ్ మోడ్‌లు ఉంటయి. బజాజ్ చేతక్‌కు సంబంధించిన న్యూ జెనరేషన్ 35 సిరీస్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 3503 ధర రూ. 102,500, 3502 ధర రూ. 122,499, 3501 ధర రూ. 122,500గా ఉంది. ఈ కొత్త అప్‌డేటెడ్ వేరియంట్ ధర రూ. 1 లక్ష లోపు ఉంటుందని భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








