Tata Digital Acquire 1MG: డిజిటల్ మార్కెట్లో తనదైన ముద్ర వేసే క్రమంలో టాటా కంపెనీ దూసుకుపోతోంది. ఇటీవల ఫిట్‌నెస్ సంబంధిత సేవలందించే క్యూర్ ఫిట్ హెల్త్ కేర్‌లో సుమారు రూ. 550 కోట్లు పెట్టు బడులు పెట్టిన టాటా తాజాగా ప్రముఖ ఆన్‌లైన్ మెడికల్ సర్వీస్ 1 ఎంజీ టెక్నాలజీస్ మెజారిటీ వాటాను కొనుగోలు చేసేందుకు సిద్ధం చేస్తోంది. టాటా సన్స్ సొంత అనుబంధ సంస్థ టాటా డిజిటల్ ఈ భారీ డీల్‌ను సెట్ చేయనుంది.
అయితే ఈ ఒప్పందం విలువ ఎంతన్న విషయాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు. వినియోగదారుల విభిన్న అవసరాలను ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చే క్రమంలో ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు టాటా డిజిటల్ వివరించింది. ఇందులో భాగంగానే 1ఎంజీలో పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో డిజిటల్ రంగంలో.. ఈఫార్మసీ, ఈడయాగ్నోస్టిక్స్, టెలి కన్సల్టేషన్ కీలక విభాగాలుగా నిలవనున్నట్లు టాటా డిజిటల్ తెలిపింది. ముఖ్యంగా కరోనా లాంటి విపత్కర సమయంలో హెల్త్ కేర్ విభాగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు.. ప్రస్తుతం ఈ విభాగంలో దాదాపు రూ. 7,300 కోట్ల మార్కెట్ ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
Also Read: black fungus infection: బ్లాక్ ఫంగస్‌కు చికిత్సకు రూ.కోటిన్నర ఖర్చు అయ్యింది.. అయినా కూడా
Curd and Raisins:పెరుగు-ఎండుద్రాక్ష తినండి.. అది చేసే మ్యాజిక్ ప్రయోజనాలను చూడండి!
Viral News: కదిలే రైలులో టాయిలెట్ ముందు వివాహం.. చాలా పెద్ద స్టోరీనే ఉంది