Swiggy IPO: ఐపీఓకు ముందుకు వచ్చిన స్విగ్గీ.. రూ.3750 కోట్ల సేకరణే టార్గెట్..!

|

Sep 28, 2024 | 3:15 PM

ఇటీవల కాలంలో చాలా కంపెనీలు నిధులను సేకరించేందుకు ఐపీఓలకు వెళ్తున్నాయి. తాజాగా ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ అయిన స్విగ్గీ కూడా ఐపీఓకు వెళ్లేందుకు సిద్ధమైంది. ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా నిధులను సేకరించేందుకు స్విగ్గీ లిమిటెడ్ ఇటీవల తన ప్రారంభ పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేసింది. ఐపీఓలో రూ. 3,750 కోట్ల తాజా ఇష్యూతో దాదాపు 18.5 కోట్ల షేర్ల విక్రయానికి ముందుకు వచ్చింది.

Swiggy IPO: ఐపీఓకు ముందుకు వచ్చిన స్విగ్గీ.. రూ.3750 కోట్ల సేకరణే టార్గెట్..!
Swiggy
Follow us on

ఇటీవల కాలంలో చాలా కంపెనీలు నిధులను సేకరించేందుకు ఐపీఓలకు వెళ్తున్నాయి. తాజాగా ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ అయిన స్విగ్గీ కూడా ఐపీఓకు వెళ్లేందుకు సిద్ధమైంది. ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా నిధులను సేకరించేందుకు స్విగ్గీ లిమిటెడ్ ఇటీవల తన ప్రారంభ పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేసింది. ఐపీఓలో రూ. 3,750 కోట్ల తాజా ఇష్యూతో దాదాపు 18.5 కోట్ల షేర్ల విక్రయానికి ముందుకు వచ్చింది. ఇష్యూకు సంబంధించిన ఆఫర్ ఫర్ సేల్ కాంపోనెంట్‌లో భాగంగా కంపెనీ వ్యవస్థాపకుడు శ్రీహర్ష మెజెటీ 17 లక్షలకు పైగా షేర్లను, రాహుల్ జైమిని 11 లక్షలకు పైగా షేర్లను విక్రయించనున్నారు. ఈ నేపథ్యంలో స్విగ్గీ ఐపీఓ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

స్విగ్గీ ఐపీఓ ఇతర అమ్మకపు వాటాదారులలో ఏసల్, ప్రోసస్, మిట్యూన్, నార్వెస్ట్  వెంచర్ భాగస్వాములు, ఆల్ఫా వేవ్ వెంచర్స్, కోట్, టెన్సట్ క్లౌడ్ ఉన్నాయి. స్విగ్గీ అప్‌డేట్ చేసిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌కు సంబంధించిన మొదటి వెర్షన్. చివరి ఆర్‌హెచ్‌పీ దాఖలు చేయడానికి ముందు కంపెనీల రిజిస్ట్రార్, ఎక్స్ఛేంజీలకు తర్వాత దశలో అందుబాటులో ఉంటుంది. 2024 ఆర్థిక సంవత్సరానికి స్విగ్గీ నిర్వహణ ఆదాయంలో 36 శాతం జంప్ చేసి రూ.11,247.3 కోట్లకు చేరుకుంది. స్విగ్గీ ప్రత్యర్థి అయిన జొమాటలో 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 12,961 కోట్ల టాప్‌లైన్‌ను పోస్ట్ చేసింది. లాభదాయకత విషయంలో కూడా జొమాటో రూ. 351 కోట్ల లాభంతో ముందుంది. అయితే స్విగ్గీ ఖర్చులను తగ్గించడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో నష్టాలు 44 శాతం తగ్గి రూ. 2,256 కోట్లకు చేరుకున్నాయి.

ఐపీఓ ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయం విషయానికొస్తే స్విగ్గీ దాని అనుబంధ సంస్థ స్కూట్సీలో పెట్టుబడి పెట్టడానికి, దాని త్వరిత వాణిజ్య విభాగం ఇన్‌స్టామార్ట్ కోసం డార్క్ స్టోర్ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి రూ. 982 కోట్లను ఉపయోగించాలని యోచిస్తోంది. టెక్నాలజీ, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో రూ.586 కోట్లు పెట్టుబడి పెడుతుంది. అలాగే బ్రాండ్ మార్కెటింగ్, వ్యాపార ప్రమోషన్ కోసం రూ.929 కోట్లు కేటాయిస్తుంది. ఇంకా రుణాన్ని తగ్గించుకోవడానికి దాదాపు రూ.137 కోట్లు వెచ్చించనుంది. స్విగ్గీ దాని వాటాదారుల నుంచి సంభావ్య రూ. 10,414 కోట్ల ఐపీఓ కోసం ఆమోదం పొందింది. ఆఫర్-ఫర్-సేల్ మార్గం ద్వారా రూ. 6,664 కోట్లు, తాజా షేర్ల జారీ ద్వారా రూ. 3,750 కోట్లు సమీకరిస్తారు. స్విగ్గీ కూడా ప్రీ ఐపీఓ యాంకర్ రౌండ్‌లో రూ. 750 కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అప్‌డేటెడ్ డీఆర్‌హెచ్‌పీ ఫైలింగ్‌తో స్విగ్గీ దాని లిస్టింగ్‌తో రూ. 10,000 కోట్లకు పైగా సేకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..