ఇప్పటి వరకు బ్యాంకు క్రెడిట్ కార్డులను చూశాం. కానీ ఇప్పుడు ప్రముఖం ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ క్రెడిట్ కార్డు కూడా వచ్చేసింది. ప్రస్తుతం రోజుల్లో చాలా మంది ఆన్‌లైన్‌లో రకరకాల ఫుడ్‌లను ఆర్డర్ చేసుకుంటున్నారు. పేమెంట్ కూడా చాలా మంది క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తుంటారు. అలాంటి భోజన ప్రియులకు స్విగ్గీ శుభవార్త అందించింది. స్విగ్గీ క్రెడిట్ కార్డులను కూడా తీసుకువస్తోంది. స్విగ్గీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ భాగస్వామ్యంతో సరికొత్త క్రెడిట్ కార్డును ప్రారంభించింది. మీరు ఈ కార్డ్ ద్వారా ఆర్థిక లావాదేవీలు చేయవచ్చు.
స్విగ్గీ వివరాల ప్రకారం.. మీరు ఈ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా సంవత్సరానికి 42 వేల రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. అంతేకాకుండా, మీరు ఇతర ఖర్చులపై కూడా 1 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఈ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు మూడు నెలల పాటు Swiggy One ఉచిత సభ్యత్వాన్ని పొందుతారు. వీటిలో ఉచిత ఫుడ్ డెలివరీ, డైన్‌అవుట్, స్విగ్గీ జెనీ, ఇన్‌స్టామార్ట్ కూడా ఉన్నాయి. అంటే ఈ అన్ని సేవలపై మీకు తగ్గింపు లభిస్తుంది. ఆసక్తి ఉన్న వారందరూ కంపెనీ బ్లాగ్ పోస్ట్ ప్రకారం.. Swiggy యాప్ లేదా HDFC బ్యాంక్ వెబ్‌సైట్ నుంచి క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
HDFC Bank launches co-branded credit card with Swiggy.
Read below to know more.#HDFCBank #News pic.twitter.com/tg1DutvxE5
— HDFC Bank News (@HDFCBankNews) July 26, 2023
ప్రతి నెల 10వ తేదీన స్విగ్గీ మనీ ఖాతాలో క్యాష్‌బ్యాక్ క్రెడిట్ అవుతుంది
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి