AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేడమ్ ఫైనాన్స్ మినిస్టర్.. మాదొక విన్నపం.. వింటారా..? పసిడి ధరలపై మిడిల్ క్లాస్ వేడుకోలు!

బంగారు ఆభరణాలకు నెక్ట్స్ లెవల్ ఏంటంటే డైమండ్ జ్యూయెలరీ. అల్ట్రా రిచ్ ఫ్యామిలీలు ఎక్కువగా మోజుపడేది వజ్రాభరణాల మీదే. ఎంగేజ్‌మెంట్స్‌కి మినిమమ్ డైమండ్ రింగు తొడక్కపోతే వాళ్లకు నామోషీ. మిడిల్ క్లాస్, ఎబౌ మిడిల్‌క్లాస్ కుటుంబాలకు నిన్నటిదాకా డైమండ్ అనేది ఒక ఫాంటసీ.. చాలా ఖరీదైన సమాచారం. కానీ.. రేపటిరోజున మధ్యతరగతి వర్గానికి బంగారం కూడా ఫాంటసీగానే మారబోతోందా..? లక్ష దాటుతున్న పదిగ్రాముల పసిడి.. మిడిల్‌క్లాస్ ఫ్యామిలీకి అందని ద్రాక్షగానే మిగలబోతోందా..?

మేడమ్ ఫైనాన్స్ మినిస్టర్.. మాదొక విన్నపం.. వింటారా..? పసిడి ధరలపై మిడిల్ క్లాస్ వేడుకోలు!
Gold Prices
Balaraju Goud
|

Updated on: Apr 19, 2025 | 7:59 PM

Share

పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.. మిడిల్‌ క్లాసోళ్లు బంగారం షాపుల వైపు కన్నెత్తి చూడాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఈఎమ్‌ఐ పద్ధతిలోనైనా గోల్డు కొనుక్కునేలా వాళ్లకు వెసులుబాటునివ్వండి.. అని కాళ్లావేళ్లా బడ్డారు జ్యూయెలర్స్ అండ్ బులియన్ డీలర్లు. అది ఫిబ్రవరి మొదటివారం. అప్పట్లో బంగారం పది గ్రాముల ధర 77 వేలకు అటూఇటూ ఉండేది. ఇప్పుడైతే పాకుతూపాకుతూ లక్ష రూపాయాల దాకా వస్తోంది. మరి.. ఈ పరిస్థితుల్లో మధ్యతరగతి కుటుంబస్థుడి ముఖచిత్రం ఏమిటో..? తులం బంగారం ఖరీదు అక్షరాలా లక్ష. ఆ మైలురాయి ఎంతో దూరంలో లేదు. ఇప్పట్లో పరుగు ఆపనంటోంది కనకమహాలక్ష్మి. బంగారం షాపులకెళితేనే అంత. జిగేల్‌మనే మెరుపుల్ని చూసి మనల్ని మనం మర్చిపోతాం.. కళ్లప్పగించి అలాగే చూస్తుండిపోతాం. వచ్చినపని మర్చిపోతాం. కాకపోతే.. ఒక విషయాన్నయితే అక్కడ ఖచ్చితంగా అబ్జర్వ్ చెయ్యొచ్చు. జ్యువెలరీ షాపుల్లో ఎక్కువగా మధ్యతరగతివాళ్లే కనబడతారు. మిడిల్ ఇన్‌కమ్ గ్రూప్ నుంచే అధిక మొత్తంలో పసిడి కొనుగోళ్లు జరుగుతాయని, చిన్నచిన్న వస్తువుల అమ్మకాలే షాపులను బతికిస్తాయని, బులియన్‌ మార్కెట్‌ని బలంగా నడుపుతాయని ఇండియా గోల్డ్ పాలసీ సెంటర్ అనే సంస్థ తన లేటెస్ట్‌ రిపోర్టు స్పష్టం చేసింది. అంటే.. ఏ నెల సంపాదన ఆ నెలకే సరిపెట్టుకోవడం.. అంతో ఇంతో మిగిలితే దాన్ని తీసుకెళ్లి అర తులమో, పావు తులమో బంగారం కొనిపెట్టుకోవడం సగటు మధ్యతరగతి జీవుడికుండే అలవాటు. గత ఐదేళ్లలో ఉన్నతాదాయ వర్గాల్లో 74 శాతం మంది బంగారం కొనుగోలు చేశారు. ఇందులో ‘ఏటా...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి