Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షేర్ మార్కెట్లకు సూపర్ డే… !!

దలాల్‌ స్ట్రీట్‌ చరిత్రలో సెప్టెంబరు 20, 2019 మైలురాయిలా నిలిచిపోనుంది. గత దశాబ్ద కాలంలోలేని విధంగా దూసుకుపోయిన వైనం, ఒక రోజులో అతిభారీ లాభాలు లాంటి రికార్డులు ఇవాల్టి మార్కెట్లో నమోదయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కార్పొరేట్‌ ప్రపంచానికి ప్రకటించిన వరాలతో సెన్సెక్స్‌ ఒక దశలో 2200 పాయింట్ల పైగా ఎగిసింది. నిఫ్టీ 650 పాయింట్లకు పైన లాభపడింది. దీంతో కీలక సూచీలు మద్దతు స్థాయిలు ఎగువకు చేరాయి, ఆఖరి అర్ధగంటలో లాభాల స్వీకరణతో చివరికి […]

షేర్ మార్కెట్లకు సూపర్ డే... !!
Follow us
Rajesh Sharma

| Edited By:

Updated on: Oct 16, 2019 | 4:53 PM

దలాల్‌ స్ట్రీట్‌ చరిత్రలో సెప్టెంబరు 20, 2019 మైలురాయిలా నిలిచిపోనుంది. గత దశాబ్ద కాలంలోలేని విధంగా దూసుకుపోయిన వైనం, ఒక రోజులో అతిభారీ లాభాలు లాంటి రికార్డులు ఇవాల్టి మార్కెట్లో నమోదయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కార్పొరేట్‌ ప్రపంచానికి ప్రకటించిన వరాలతో సెన్సెక్స్‌ ఒక దశలో 2200 పాయింట్ల పైగా ఎగిసింది. నిఫ్టీ 650 పాయింట్లకు పైన లాభపడింది. దీంతో కీలక సూచీలు మద్దతు స్థాయిలు ఎగువకు చేరాయి, ఆఖరి అర్ధగంటలో లాభాల స్వీకరణతో చివరికి సెన్సెక్స్‌ 1921 పాయింట్ల లాభంతో 38,014 వద్ద, నిఫ్టీ సైతం 569 పాయింట్లు జంప్‌చేసి 11,274 వద్ద స్థిరపడింది. బ్యాంకు నిఫ్టీ కూడా 7 శాతం రికార్డు లాభాలను సాధించింది. దాదాపు అన్ని రంగాలు లాభాల దూకుడు ప్రదర్శించాయి.

ప్రధానంగా బ్యాంకింగ్‌, ఆటో, మెటల్‌, క్యాపిట్‌, కన్సూమర్‌ గూడ్స్‌ రంగాలు 10-6 శాతం చొప్పున దూసుకెళ్లాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐషర్‌, హీరో మోటో, ఇండస్‌ఇండ్, బజాజ్‌ ఫైనాన్స్‌, మారుతీ, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్‌, బ్రిటానియా, టైటన్‌, ఎంఅండ్‌ఎం టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. జీ ఎంటర్‌ప్రైజెస్‌, పవర్‌గ్రిడ్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, ఎన్‌టీపీసీ, టెక్‌ మహీంద్రా స్వల్పంగా నష్టపోయాయి. దీంతో లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ కేపిటలైజేషన్‌ చరిత్రలో తొలిసారి రూ. 7 లక్షల కోట్లకు చేరింది. వెరసి మార్కెట్‌ విలువ రూ. 1.45 ట్రిలియన్లను అధిగమించడం విశేషం. ఒకే రోజు 7 లక్షల సంపద క్రియేట్ అవడం దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెళ్లి విరిశాయి. ప్రధాని మోడీ సైతం నిర్మల సీతారామన్ ప్రకటించిన అంశాలు ఆషామాషీవి కాదంటూ ఆర్థిక మంత్రిని ఆకాశానికెత్తేశారు. సహజంగానే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ తదితర కాంగ్రెస్ నేతలు కేంద్రం నిర్ణయాన్ని తప్పు పట్టినా.. ఆర్ధిక మాంద్యం పరిణామాలు వేగంగా విస్తరిస్తున్న తరుణంలో నిర్మలమ్మ తీసుకున్న నిర్ణయాలు.. సమయానుకూలంగా చేసిన ప్రకటన దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉద్దీపన ఇచ్చే సంకేతాలను వ్యక్త పరిచింది. మరో వైపు అత్యంత కీలకమైన జీఎస్టీ విధానంలో, పన్ను స్లాబుల్లో మార్పులు తీసుకు రావడం ద్వారా కునారిల్లు తున్న ఆటోమొబైల్ రంగానికి కొత్త ఊపునిచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దుష్పరిణామాలను చూపుతున్న ఆర్ధిక మాంద్యాన్ని ఆది లోనే అరికట్టకపోతే, ధీటుగా ఎదుర్కోకపోతే ఇపుడిపుడే అభివృద్ధి పథాన వేగంగా పయనిస్తున్న భారత్ లాంటి దేశాలకు తీవ్ర నష్టం జరగక తప్పదు. దీన్ని గ్రహించిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందస్తు చర్యలతో ధీటుగా స్పందించడం ఎంతైనా ముదావహం.