AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Investment Plan: మీ కుమార్తె వివాహం నాటికి రూ. 55 లక్షలు కావాలా? ఇలా చేయండి.. అదిరిపోయే స్కీమ్‌

వారి పెళ్లీడు వచ్చే వరకు ఖర్చుల విషయంలో ఇబ్బంది ఉండదు. లక్షల రూపాయలు పొదుపు చేసుకోవచ్చు. ఇప్పుడు వారు విద్య, కెరీర్‌లకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ వివాహ ఖర్చులు కీలకమైన ఆందోళనగా మిగిలిపోయాయి. దీని వలన వారు వివిధ పెట్టుబడి ఎంపికలను..

Investment Plan: మీ కుమార్తె వివాహం నాటికి రూ. 55 లక్షలు కావాలా? ఇలా చేయండి.. అదిరిపోయే స్కీమ్‌
Subhash Goud
|

Updated on: Apr 17, 2025 | 5:05 PM

Share

Investment Plan: తల్లిదండ్రులు తమ కుమార్తె వివాహ ఆర్థిక విషయాలపై మాత్రమే దృష్టి సారిస్తుంటారు. ఆయితే ఆడ పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఆర్థిక విషయాలలో ముందు నుంచే ప్లాన్‌ చేసుకోవడం చాలా ముఖ్యం. వారి చదువులు, పెళ్లిళ్ల ఖర్చుల కోసం ముందు నుంచి పొదుపు చేసుకుంటే వారి పెళ్లీడు వచ్చే వరకు ఖర్చుల విషయంలో ఇబ్బంది ఉండదు. లక్షల రూపాయలు పొదుపు చేసుకోవచ్చు. ఇప్పుడు వారు విద్య, కెరీర్‌లకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ వివాహ ఖర్చులు కీలకమైన ఆందోళనగా మిగిలిపోయాయి. దీని వలన వారు వివిధ పెట్టుబడి ఎంపికలను అన్వేషించాల్సి వస్తుంది. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక స్కీమ్‌ను అమలు చేస్తోంది. సుకన్య సమృద్ధి యోజన అనేది కుమార్తె భవిష్యత్తు కోసం సురక్షితమైన, ప్రభుత్వ మద్దతుతో కూడిన పెట్టుబడి.

ప్రస్తుత 8.2% వడ్డీ రేటుతో 21 సంవత్సరాలలో నెలవారీ రూ. 10,000 పెట్టుబడితో రూ. 55,42,062 రాబడి లభిస్తుంది. సుకన్య సమృద్ధి యోజన 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికల కోసం రూపొందించిన పథకం ఇది. డిపాజిట్లు 15 సంవత్సరాలకు సంవత్సరానికి రూ. 250 నుండి రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్‌ చేయవచ్చు. 21 సంవత్సరాలలో మెచ్యూరిటీ చెందుతాయి. 80C కింద పన్ను ప్రయోజనాలు వర్తిస్తాయి. 18 సంవత్సరాల వయస్సులో విద్య కోసం పాక్షిక ఉపసంహరణలు అనుమతి ఉంటుంది. ఖాతాను 18 సంవత్సరాల తర్వాత మూసివేయవచ్చు.

☛ మీరు చేసే డిపాజిట్‌: ఆర్థిక సంవత్సరానికి కనీసం రూ. 250, గరిష్టంగా రూ. 1.5 లక్షలు

ఇవి కూడా చదవండి

ఖాతా తెరవడానికి వయస్సు: ఆడపిల్ల వయస్సు 10 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి.

ఎక్కడ అకౌంట్‌ తీయాలి: ఏదైనా పోస్టాఫీసు లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన బ్యాంకు శాఖలో

వడ్డీ రేటు: 8.2% చక్రవడ్డీ వార్షిక వడ్డీ రేటు (జనవరి-మార్చి 2024 త్రైమాసికానికి)

పన్ను ప్రయోజనాలు: ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడులపై పన్ను మినహాయింపు

మెచ్యూరిటీ: ఈ పథకం 21 సంవత్సరాల తర్వాత లేదా ఆడపిల్ల 18 సంవత్సరాల వయసుకు వచ్చిన తర్వాత మెచ్యూర్ అవుతుంది.

ఉపసంహరణ: ఆడపిల్లకు 18 ఏళ్లు నిండిన తర్వాత లేదా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత, ఖాతాలో జమ చేసిన మొత్తంలో 50% విద్య కోసం ఉపసంహరించుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Post Office: పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌.. ప్రతినెలా రూ.9250.. గ్యారెంటీ రిటర్న్స్!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈమెను గుర్తుపట్టారా? ఒకప్పుడు రూ.1,200.. ఇప్పుడు రూ.8,352 కోట్లు
ఈమెను గుర్తుపట్టారా? ఒకప్పుడు రూ.1,200.. ఇప్పుడు రూ.8,352 కోట్లు
రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ షురూ.. మధ్యాహ్నం కౌంటింగ్..
రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ షురూ.. మధ్యాహ్నం కౌంటింగ్..
బంగారం, వెండికి పోటీగా దూసుకొస్తున్న రాగి..!
బంగారం, వెండికి పోటీగా దూసుకొస్తున్న రాగి..!
ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు జాగ్రత్త.. స్ట్రోక్ వచ్చే ప్రమాదం..
ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు జాగ్రత్త.. స్ట్రోక్ వచ్చే ప్రమాదం..
ఈ చిత్రంలో రెండు అంకెలు ఉన్నాయ్.. 5 సెకన్లలో కనుగొన్నారో జీనియసే
ఈ చిత్రంలో రెండు అంకెలు ఉన్నాయ్.. 5 సెకన్లలో కనుగొన్నారో జీనియసే
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న దేఖ్ లేంగే సాలా సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న దేఖ్ లేంగే సాలా సాంగ్..
ఈ కష్టం ఏ తండ్రికీ రాకూడదు.. టెట్ పరీక్షకు తీసుకెళ్తుండగా..
ఈ కష్టం ఏ తండ్రికీ రాకూడదు.. టెట్ పరీక్షకు తీసుకెళ్తుండగా..
భారీ డీల్.. తెలంగాణలో అమెజాన్‌ డేటా సెంటర్‌.. ఎక్కడో తెలుసా?
భారీ డీల్.. తెలంగాణలో అమెజాన్‌ డేటా సెంటర్‌.. ఎక్కడో తెలుసా?
ప్రతి నెలా రూ.10 వేలు SIPలో పెడితే.. చేతికి ఎంతొస్తుంది?
ప్రతి నెలా రూ.10 వేలు SIPలో పెడితే.. చేతికి ఎంతొస్తుంది?
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల 2026 మార్కుల కేటాయింపులో కీలక మార్పులు
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల 2026 మార్కుల కేటాయింపులో కీలక మార్పులు