Savings Plan: నెలకు రూ.1200తో రూ.6 లక్షలు మీ సొంతం.. కేంద్రం అద్బుత పథకం..
సుకన్య సమృద్ది యోజన పథకంలో నెలకు రూ.1200 పెట్టుబడి పెడితే చాలు.. దీర్ఘకాలంలో మీ కుమార్తె భవిష్యత్తుకు సిర్దమైన ఆర్ధిక నిధిని సృష్టించుకోవచ్చు. ప్రస్తుతం దీని వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది. రాబోయే రోజుల్లో పెంచితే ఆదాయం మరింత పెరుగుతుంది.

తమ కుమార్తెల భవిష్యత్ కోసం డబ్బులు పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రుల కోసం అద్బుతమైన పథకం ఏదైనా ఉందంటే.. అది సుకన్య సమృద్ది యోజనగా చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ పథకంలో మీ పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్ల ఒడిదొడుకులకు ప్రభావితం అవ్వదు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం అత్యధిక వడ్డీ రేటును కూడా అందిస్తోంది. ప్రస్తుతం వార్షిక వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది. తమ కుమార్తెల కోసం స్థిరమైన ఆదాయం పొగుచేసుకోవాలనుకునేవారికి ఇది మంచి పథకంగా చెప్పవచ్చు. అయితే ప్రభుత్వం వడ్డీ రేట్లను ఎప్పటికప్పడు మారుస్తూ ఉంటుంది. దీంతో భవిష్యత్తులో పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఇదే జరిగితే మీ పెట్టుబడి ద్వారా వచ్చే ఆదాయం మరింత పెరుగుతుంది.
21 ఏళ్ల పాటు కొనసాగిస్తే ఎంత వస్తుందంటే..?
సుకన్య సమృద్ది యోజన పథకంలో ప్రతీ నెలా రూ.1200 పెట్టుబడి పెడితే ఏడాదికి రూ.14,400 అవుతుంది. 15 ఏళ్ల పాటు పెడితే మొత్తం రూ.216000 అవుతాయి. ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు 8.20 శాతం ప్రకారం లెక్కిస్తే వడ్డీ రూపంలో రూ.4.74 లక్షలు అందుతాయి. అయితే 15 ఏళ్లకు మెచ్యూర్ అయినా 21 సంవత్సరాల వరకు మీరు ఖాతా కొనసాగించవచ్చు. అప్పటివరకు మీ ఖాతాలో వడ్డీ జమ అవుతూ ఉంటుంది. అప్పటికీ మీ మొత్తం నిధి రూ.6.90 లక్షలకు చేరుకుంటుంది. 15 ఏళ్ల పాటు మీరు నెలవారీ డిపాజిట్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత 21 సంవత్సరాలు వచ్చే వరకు ఎలాంటి డిపాజిట్ చేయకపోయినా వడ్డీ అనేది కొనసాగుతూ ఉంటుంది. వడ్డీపై వడ్డీ జమ కావడం వల్ల మీ నిధి దీర్ఘకాలంలో భారీగా పెరుగుతుంది.
ఈ ఖాతా ఎప్పుడు తెరవాలి..?
10 సంవత్సరాల్లోపు వయస్సు ఉన్న పిల్లల పేరుపై మాత్రమే ఈ ఖాతా తెరవొచ్చు. పిల్లల పేర్లపై తల్లిదండ్రులు సంరక్షకులుగా ఉండి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. కుమార్తెకు 10 ఏళ్లు దాటితే సుకన్య సమృద్ది యోజన ఖాతా తెరవడానికి నిబంధనలు అనుమతించవు. ఈ అకౌంట్‌లో కనీస వార్షిక డిపాజిట్ రూ.250, గరిష్టంగా రూ.1.50 లక్షలు జమ చేయవచ్చు. కుమార్తెకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఉన్న విద్య కోసం పాక్షికంగా కొంత మొత్తం విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే గడువు ముగిసిన తర్వాత మొత్తం ఒకేసారి తీసుకోవచ్చు.
