SBI Life Cover: స్టేట్ బ్యాంక్ నయా ఇన్సూరెన్స్ ప్లాన్.. యోనో ద్వారా సింపుల్ ప్రాసెస్‌తో రూ.40 లక్షల కవరేజీ
ఎస్‌బీఐ లైఫ్ – సంపూర్ణ్ సురాకాశ పేరుతో ఇచ్చే ఇన్సూరెన్స్ పాలసీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్‌లు ఏ సమయంలోనైనా ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా లైఫ్ కవరేజీని పొందవచ్చు. అయితే ఈ ప్లాన్ దరఖాస్తు అనేది కొన్ని దశల్లో ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు రూ. 40 లక్షల వరకు ఇన్‌స్టంట్ లైఫ్ కవర్‌ను అందిస్తోంది. ఎస్‌బీఐ లైఫ్ – సంపూర్ణ్ సురక్ష పేరుతో ఇచ్చే ఇన్సూరెన్స్ పాలసీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్‌లు ఏ సమయంలోనైనా ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా లైఫ్ కవరేజీని పొందవచ్చు. అయితే ఈ ప్లాన్ దరఖాస్తు అనేది కొన్ని దశల్లో ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎస్‌బీఐ లైఫ్ – సంపూర్ణ్ సురక్ష అనేది ఒక గ్రూప్ నాన్-లింక్డ్, నాన్-పార్టిసిటింగ్, ప్యూర్ రిస్క్ ప్రీమియం జీవిత బీమా పాలసీ. ఇది వివిధ అధికారిక, అనధికారిక సమూహాలకు అందుబాటులో ఉంది. ఈ ఎస్‌బీఐ లైఫ్ కవర్ యజమాని-ఉద్యోగి, రుణగ్రహీత-డిపాజిటర్, నిపుణులు, అనుబంధం మొదలైన విస్తృత శ్రేణి సమూహాలను కవర్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ పాలసీ గురించిన మరిన్ని వివరాలను ఓ సారి తెలుసుకుందాం.
ఈ ప్లాన్ మీ గ్రూప్ మెంబర్‌ల డిపెండెంట్‌లకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆర్థిక సహాయం, గ్రూప్ అవసరాలకు అనుగుణంగా ప్రయోజనాలను నిర్వచించే సౌలభ్యం ఉంది. సులభమైన ఆన్-బోర్డింగ్ ప్రక్రియ ద్వారా సింప్లిసిటీ ద్వారా భద్రతను అందిస్తుంది. ఎస్‌బీఐ లైఫ్ – సంపూర్ణ సురక్ష డెత్ బెనిఫిట్‌ను అందిస్తుంది, ఎందుకంటే స్కీమ్ నియమాల ద్వారా నిర్వచించిన మొత్తం హామీ మొత్తం చెల్లిస్తారు. ఎస్‌బీఐ లైఫ్ – సంపూర్ణ్ సురక్ష మీకు ఆదాయపు పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే భారతదేశంలో వర్తించే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం మినహాయింపులు ఉంటాయి.




అప్లై చేయడం ఇలా
- స్టెప్ 1: ఎస్‌బీఐ కస్టమర్‌లు మొదటగా యోనో యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుని లాగిన్ అవ్వాలి.
- స్టెప్:2 యోనోకు లాగిన్ అయిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్‌లు ‘ఇన్సూరెన్స్’ విభాగానికి వెళ్లాలి.
- స్టెప్ 3: ఇక్కడ ఎస్‌బీఐ కస్టమర్‌లు “పాలసీని కొనండి” విభాగాన్ని ఎంచుకుంటే సింపుల్‌గా పాలసీను కొనుగోలు చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




