SBI: మీకు ఇలాంటి మెసేజ్‌లు వస్తే జాగ్రత్త.. మరోసారి కస్టమర్లను హెచ్చరించిన ఎస్‌బీఐ.. ఈ కోడ్‌లను గుర్తించుకోండి

|

Aug 04, 2022 | 7:56 AM

SBI: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయిన నేపథ్యంలో మోసాలు కూడా అంతే పెరిగిపోతున్నాయి. సైబర్‌ నేరాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బ్యాంకుల విషయంలో మాత్రం వినియోగదారుల..

SBI: మీకు ఇలాంటి మెసేజ్‌లు వస్తే జాగ్రత్త.. మరోసారి కస్టమర్లను హెచ్చరించిన ఎస్‌బీఐ.. ఈ కోడ్‌లను గుర్తించుకోండి
Follow us on

SBI: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయిన నేపథ్యంలో మోసాలు కూడా అంతే పెరిగిపోతున్నాయి. సైబర్‌ నేరాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బ్యాంకుల విషయంలో మాత్రం వినియోగదారుల మరి జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకు కస్టమర్లనే ఆసరాగా చేసుకుంటున్న మోసగాళ్లు ఒక్క మెసేజ్‌తో బ్యాంకు అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. తాము బ్యాంకు నుంచి ఫోన్‌లు చేస్తున్నామని, మీ డెబిట్‌ కార్డు బ్లాక్‌ అయ్యిందనో, లేక మీ బ్యాంకు అకౌంట్ల వివరాలు చెప్పాలనో ఫోన్‌లు చేస్తూ బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తున్నారు. అంతేకాకుండా కస్టమర్లకు లింక్‌లతో కూడిన సందేశాలను పంపిస్తూ నిలువునా మోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తమ ఖాతాదారులకు మరోసారి హెచ్చరించింది. ఇలాంటి మెసేజ్‌లతో జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి ఫోన్‌లు వచ్చినా.. మీ ఖాతా వివరాలు, వ్యక్తిగత వివరాలు ఎట్టి పరిస్థితుల్లో చెప్పవద్దని సూచించింది. మోసాలను అరికట్టేందుకు ఎస్‌బీఐ ఎప్పటికప్పుడు కస్టమర్లను అప్రమత్తం చేస్తోంది.

ఎస్‌బీఐ నుంచి ఎలాంటి మెసేజ్‌లు వస్తాయో తెలిపింది. అవి షార్ట్‌కట్‌ రూపంలో ఉంటాయని తెలిపింది. SBIBNK, SBIINB, SBYONO, ATMSBI, SBI/SB వంటి ముఖ్యమైన కోడ్‌లు వస్తే బ్యాంకు అధికారికంగా పంపిందని చెప్పుకోవాలి. కానీ ఇలాంటి కోడ్‌ లేక ఇతర కోడ్‌లు ఏమైనా ఉంటే అవి నకిలీవని, మిమ్మల్ని మోసగించేందుకు పంపించారని భావించాలని సూచిస్తోంది. ఇలాంటి ఫేక్‌ మెసేజ్‌లు వస్తే ఎట్టి పరిస్థితుల్లో సమాధానం ఇవ్వవద్దని, ఇట్టి లింక్‌లపై క్లిక్‌ చేయవద్దని అప్రమత్తం చేస్తోంది.

బ్యాంక్ మీకు సందేశాలను పంపే విధానం అదే పద్ధతిని అనుసరించి, సైబర్ మోసం మీకు SMSలో సందేశాలను పంపుతుంది. మీ వ్యక్తిగత సమాచారం, OTP కోసం బ్యాంక్ ఎప్పుడూ అడగదని బ్యాంకు చెబుతోంది. మీరు ఎప్పుడైనా బ్యాంక్ నుండి KYC కోసం వివరాలను అడిగినప్పుడు ఏ బ్యాంక్ అయినా మిమ్మల్ని ఏదైనా లింక్‌పై క్లిక్ చేయమని అడగదని, ఒక వేళ అడిగినట్లయితే ఇలాంటి నకిలీ సందేశాలుగా గుర్తించాలని తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి