SBI ఖాతాదారులరా అలర్ట్.. కస్టమర్లకు కీలక ప్రకటన చేసిన బ్యాంక్.. ఏం చెప్పిందంటే..

|

Apr 25, 2021 | 2:18 PM

State Bank Of India: మీరు SBI ఖాతాదారులా ? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే. దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్

SBI ఖాతాదారులరా అలర్ట్.. కస్టమర్లకు కీలక ప్రకటన చేసిన బ్యాంక్.. ఏం చెప్పిందంటే..
Sbi
Follow us on

State Bank Of India: మీరు SBI ఖాతాదారులా ? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే. దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తన కస్టమర్లను అలర్ట్ చేసింది. మోసగాళ్ళ బారిన పడొద్దని ఖాతాదారుకు సూచిస్తోంది. మోసగాళ్ళు ఎలాగైనా మోసం చేయవచ్చని.. అందుకని జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ప్రస్తుత పరిస్థితులలో కొత్త తరహా మోసాలు వెలుగులోకి వస్తున్నాయని పేర్కోంది. మోసగాళ్లు మెడిషన్స్ పేరు చెప్పి డబ్బులు దొంగిలించే అవకాశముందని హెచ్చరించింది. అలాగే ప్రాణాలను కాపాడే ఔషదాల పేరుతో మోసాలు జరగొచ్చని తెలిపింది. మెడిషన్స్ కు డబ్బులు చెల్లించడానికి ముందు అన్ని విషయాలను జాగ్రత్తగా తెలుసుకోవాలని ఎస్బీఐ తన కస్టమర్లను కోరింది.

ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తుంది. ఈ క్రమంలో డిజిటల్ లావాదేవీలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. అదే సమయంలో ఆన్ లైన్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. మోసగాళ్ళు కొత్త కొత్త మార్గాల్లో కస్టమర్లను మోసం చేస్తున్నారు. మోసగాళ్లు కస్టమర్లను ఆకర్షించడానికి లైఫ్ సేవింగ్ మెడిషన్స్‌పై ఆఫర్లు ప్రకటించొచ్చని, అయితే ఈ ఆఫర్లను నమ్మితే మోసపోవాల్సి వస్తుందని ఎస్‌బీఐ తెలిపింది. స్టేట్ బ్యాంక్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. అందువల్ల డబ్బులు చెల్లించేటప్పుడు బెనిఫీషియరీ వివరాలు కరెక్ట్‌గా ఉండేలా చూసుకోండి.

ట్వీట్..

Also Read:  రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు.. జలుబు, ఫ్లూను తగ్గించే టీ.. సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోండిలా..

RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. మే 1 నుంచి కొత్త కార్డుల జారీపై నిషేధం.. నిబంధనలు పాటించడం లేదన్న ఆర్‌బీఐ